
సాక్షి, కాకినాడ : ఐబీ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తూర్పుగోదావరి జిల్లాలోని గాడిమొగ రిలయన్స్ టెర్మినల్‌తో పాటు పలు చమురు క్షేత్రాలను పర్యటించారు. ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలపై సమీక్షించారు. కేసుల నమోదు చార్జ్ షీట్‌లపై యంత్రానికి సూచనలు చేశారు. ఎన్నికల కౌంటింగ్ భద్రతపై ఎటువంటి చర్యలు చేపట్టాలో అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఆంధ్ర ఒడిశా సహరిద్దు (ఏఓబీ) ప్రాంతంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, కౌంటింగ్ భద్రతకు అన్ని ఏర్పాటు చేశామని డీజీపీ పేర్కొన్నారు.