
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20శాతం సైబర్ నేరాలు పెరిగాయని ఏసీబీ డీజీపీ ఠాకూర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రికవరీ శాతం కూడా స్వల్పంగా పెరిగిందని తెలిపారు. దోపిడీలు, డెకాయిటీల కంటే సైబర్ నేరం పెద్దదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 7 ప్రాంతాల్లో సైబర్ పోలీస్ స్టేషన్లు, లాబ్‌లు, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మొట్టమొదటి సైబర్ లాబ్‌ను విజయవాడ, రెండవది వైజాగ్‌లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. త్వరలోనే రాజమండ్రి, కర్నూల్, తిరుపతిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.
లాబ్‌లో ఎనలిస్ట్‌లకు కిట్‌లు ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం విశాఖపట్నం సైబర్ ఇన్వెస్టిగేషన్ లాబ్‌లో ఒక సీఐ, ముగ్గురు ఎస్‌ఐలు, ఒక హెచ్‌సీ, 13 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. త్వరలో సిబ్బంది సంఖ్య పెంచుతామన్నారు. సైబర్ నేరగాళ్ల శైలి మారుతోందని అన్నారు. సైబర్ నేరాలపై పోలీసులు కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. ఆన్ లైన్ జాబ్స్, వన్ టైం పాస్ వర్డ్, ఏటీఎం నేరాలు పెరిగాయని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment