సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌పై దాడి జరిగిన వెంటనే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్‌తోపాటు పార్టీ నాయకులు వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేశ్, యార్లగడ్డ వెంకట్‌రావు, మల్లాది విష్ణులు మంగళగిరిలోని డీజీపీ ఆర్పీ ఠాకూర్ కార్యాలయానికి చేరుకున్నారు. వైఎస్ జగన్‌పై జరిగిన దాడి గురించి డీజీపీకి ఫిర్యాదు చేశారు. ప్రజాసంకల్పయాత్ర చేపడుతున్న వైఎస్ జగన్‌కు భద్రత పెంచాలని డీజీపీని కోరారు. అయితే వైఎస్ జగన్‌పై జరిగిన దాడిపై డీజీపీ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ నేతలు అభ్యతంరం వ్యక్తం చేశారు.
విచారణ జరపకుండానే ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారనే వైఎస్సార్ సీపీ నేతల ప్రశ్నలకు డీజపీ సమాధానం దాటవేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించారు. దీని వెనుక కుట్ర దాగి ఉందన్నారు. దీనిపై ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టాలని డీజీపీని కోరినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment