
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసుపై ఈ శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ఎన్‌ఐఏ యాక్ట్ ప్రకారం కేసును ఎన్‌ఐఏకి బదిలీ చేయాలని వైఎస్ జగన్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. కేసు దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాధారాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కేసును ఎన్‌ఐఏకి బదిలీ చేయటంపై తమ నిర్ణయాలను చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. హైకోర్టు తదుపరి విచారణను జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది. (ఎన్‌ఐఏ చట్ట పరిధిలోకి వస్తుందా? రాదా?)
Comments
Please login to add a commentAdd a comment