![High Competition For Andhra Pradesh DGP Post - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/27/sawang-rp%20thakur.jpg.webp?itok=_0o2EFNC)
గౌతమ్ సవాంగ్(ఎడమ), ఆర్‌పీ ఠాకూర్(కుడి)
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ పోస్టు కోసం ఐపీఎస్ అధికారుల మధ్య విపరీత పోటీ నెలకొంది. ఈ నెల 30న ప్రస్తుత డీజీపీ మాలకొండయ్య పదవీ విరమణ చేయనున్నారు. విజయవాడలో పోలీసు కమిషనర్‌గా పని చేస్తున్న గౌతమ్ సవాంగ్, అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డీజీ ఆర్‌పీ ఠాకూర్ల మధ్య డీజీపీ పదవి కోసం విపరీతమైన పోటీ ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, రాష్ట్ర నూతన డీజీపీ ఎంపికపై ప్రభుత్వం సెలక్షన్ కమిటీని వేసింది. ఇన్‌చార్జ్ చీఫ్ సెక్రటరీ ఏసీ పునేఠా నేతృత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు మన్మోహన్ సింగ్, సాంబశివరావులతో పాటు జీఏడీ కార్యదర్శి శ్రీకాంత్‌లు సెర్చ్ కమిటీలో ఉన్నారు. శుక్రవారంలోగా టాప్-3 జాబితాను సిద్ధం చేయాలని కమిటీని ప్రభుత్వం కోరింది. అయితే, కమిటీ ఇప్పటికే ముగ్గురు అధికారుల పేర్లను సూచించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment