అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్(ఏసీబీ డీజీ)గా ఆర్‌పి ఠాకూర్ బాధ్యతలు చేపట్టారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి అవినీతి అడ్డుకాకూడదని, ప్రభుత్వ అధికారి అవినీతికి పాల్పడాలంటేనే భయపడేలా పనిచేస్తానని ఏసీబీ డీజీ ఆర్‌పి ఠాకూర్ స్పష్టం చేశారు. విజయవాడలో అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్(ఏసీబీ డీజీ)గా శనివారం ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఏసీబీ కేసు నమోదు చేసిన వెంటనే ఆ అధికారికి చెందిన ఆస్తులను సీజ్ చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఏసీబీ కేసు కోర్టులో రుజువైన తరువాతే సంబంధిత అధికారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలకు ఏసీబీని అనుసంధానం చేసేలా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడంతోపాటు సీక్రెట్ ఏజన్సీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామన్నారు. దేశ రక్షణలో సైన్యం మాదిరిగా అంకితభావంతో పనిచేయాలని ఠాకూర్ ఏసీబీ అధికారులకు సూచించారు.