వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. నిందితుడు సెల్ఫీ పేరుతో వైఎస్ జగన్‌పై దాడికి ప్రయత్నించిన సమయంలో కత్తి మెడకు తగిలితే ఏమై ఉండేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీసీటీవీ ఫుటేజ్ అడిగితే లేదని చెబుతున్నారని తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌లో భద్రత ఉన్నా అలాంటి కత్తులు ఎలా తీసుకువచ్చారో అర్ధం కావడం లేదని అన్నారు. ఎయిర్‌పోర్ట్ లోపల జరిగిన ఘటనతో తమకు సంబంధం లేదని మంత్రులు చెప్పడాన్ని నీచమైన చర్యగా అభివర్ణించారు