Strict Action Against 70 Officers For Not Taking Election Training In Lucknow, Details Inside | Sakshi
Sakshi News home page

ఎ‍న్నికల శిక్షణకు డుమ్మా.. 70 మంది అధికారులపై చర్యలు!

Published Tue, Apr 30 2024 11:44 AM | Last Updated on Tue, Apr 30 2024 12:36 PM

Strict Action Against 70 Officers For Not Taking Election Training

ఎన్నికల శిక్షణకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం గతంలోనే వెల్లడించించింది. అయితే దీనిని పెడచెవిన పెట్టిన కొందరు అధికారులు చిక్కుల్లో పడ్డారు. ఈ ఉదంతం యూపీలోని లక్నోలో చోటుచేసుకుంది.  

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ప్రిసైడింగ్, పోలింగ్ శిక్షణకు హాజరుకాని 70 మంది అధికారులపై శాఖాపరమైన చర్యలు మొదలయ్యాయి. జిల్లా మేజిస్ట్రేట్ సూర్యపాల్ గంగ్వార్ ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ  చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సంబంధిత సెక్షన్ల ప్రకారం అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎన్నికల సంఘం నిర్వహించే ఈ శిక్షణ.. ఓటింగ్ ప్రక్రియపై సమగ్ర అవగాహనను కలిగిస్తుంది. అలాగే నిష్పాక్షికంగా ఎన్నికలను నిర్వహించడానికి అనుసరించాల్సిన మార్గదర్శకాలను తెలియజేస్తుంది. ఈ శిక్షణకు హాజరు తప్పనిసరి అని ఇప్పటికే  ఎన్నికల సంఘం అధికారులకు తెలియజేశారు. ఈ శిక్షణ సమయంలో ఓటింగ్ రోజున తలెత్తే సమస్యల పరిష్కారానికి అనేక వ్యూహాలను తెలియజేస్తారు. ఈవీఎం, వీవీప్యాట్‌ల పనితీరుపై అధికారులకు అవగాహన కల్పిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement