![Valuable Vote: Many Countries Have Such Penal Systems In Action](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/05/12/Vote_0_0.jpg.webp?itok=09e81YvA)
ఓటరా..! ఓటు వేయడం మీ బాధ్యత! అంటూ ఎలక్షన్ కమిషన్ ప్రజలను చైతన్యపరుస్తుంది. పైగా మొబైల్ ఫోన్‌ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే యత్నం కూడా చేస్తోంది.. అంతేగాక టీవీ, సామాజిక మాధ్యమాలతో సహా ప్రజలను ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే "దేవుడు హుండీలో డబ్బులు వేయడం కాదు! దేశం కోసం ఓటు వేయడం నేర్చుకో!, ప్రజాస్వామ్య వేడుకలో పాలుపంచుకోవడం మన కర్తవ్యం వంటి మాటలతో ఓటర్లను చైతన్యపరుస్తున్నారు.
ఇంతలా చేసినా చాలా వరకు ముఖ్యంగా విద్యావంతులే ఈ ఓటు హక్కు వినియోగించుకోవడం లేదని పలు సర్వేల్లో వెల్లడయ్యింది కూడా. అయితే ఇలా ఓటు హక్కుని వినియోగించకపోతే కొన్ని దేశాల్లో అధికారులు అస్సలు ఊరుకోరట. చాలా దారుణమైన శిక్షలు విధిస్తారట. అవేంటో తెలుసుకుందామా.!
బెల్జియం
ఇక్కడ వరుసగా నాలుగుసార్లు ఓటు వేయకపోతే పదేళ్ల వరకు ఓటు హక్కుండదు. మొదటిసారి వేయకపోతే రూ.4 వేలు, రెండోసారికి రూ.10వేలు జరిమానా వేస్తారు. ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కోల్పోతారు. దీంతో 96 శాతం ఓటింగ్ నమోదవుతుంది.
ఆస్ట్రేలియా
ఇక్కడ జరిమానా విధానాన్ని అనుసరిస్తున్నారు. ఓటు వేయకపోతే వారం రోజుల్లో జరిమానా చెల్లించాలనే నిబంధన ఉంది. దీంతో ఇక్కడ 98 శాతం పోలింగ్ నమోదవుతోంది.
సింగపూర్
ఈ దేశంలో ఓటు వేయకపోతే ఓటరు జాబితా నుంచి పేరు తీసేస్తారు. కారణాలను పూర్తి ఆధారాలతో, పెద్దల సంతకంతో అందిస్తేనే ఆ వ్యక్తుల ఓటుహక్కు పునరుద్ధరిస్తారు. దీంతో 92 శాతం నమోదవుతుంది
గ్రీస్
ఇక్కడ ఏకంగా ఓటు వేయని వారికి డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు ఇవ్వరు. బలమైన కారణాలు చూపితే తప్ప వాటిని పునరుద్ధరించరు. ఇతర సౌకర్యాలపైనా ఆంక్షలు విధిస్తారు. ఇక్కడ 94శాతం ఓటింగ్ నమోదవుతుంది..
(చదవండి: పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!)
Comments
Please login to add a commentAdd a comment