
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ మున్సిపల్ శాఖ అవకాశం కల్పించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 31.08.2020 నుంచి లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్‌ఆర్‌ఎస్) ప్రక్రియ ప్రారంభించినట్టు ఉత్తర్వుల్లో తెలిపింది. ఆగస్టు 26 లోపు చేసిన లే అవుట్ ఓనర్లకు, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్ ఓనర్లకు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ కింది మార్గదర్శకాలకు లోబడే లే అవుట్లను రెగ్యులర్ చేస్తామని అధికారులు తెలిపారు.
⇒ నాలాకు 2 మీటర్ల దూరం ఉండాలి.
⇒ వాగుకు 9 మీటర్ల దూరం ఉండాలి.
⇒ 10 హెక్టార్లలోపు ఉన్న చెరువుకు 9 మీటర్ల దూరం ఉండాలి .
⇒ 10 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువుకు 30 మీటర్ల దూరం ఉండాలి.
⇒ ఎయిర్‌పోర్టు, డిఫెన్స్ స్థలానికి 500 మీటర్ల దూరం ఉండాలి.
⇒ వ్యక్తిగత ప్లాట్ ఓనర్స్ వెయ్యి రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు, లే అవుట్ ఓనర్స్ 10 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
⇒ 100 గజాల లోపు ఉన్న వారు గజానికి 200 రూపాయల చొప్పున చెల్లించాలి.
⇒ 101 నుంచి 300 గజాలు ఉన్నవాళ్లు గజానికి 400 రూపాయలు చెల్లించాలి.
⇒ 301 నుంచి 500 గజాలు ఉన్నవాళ్లు గజానికి 600 రూపాయలు చెల్లించాలి.
(చదవండి: ప్రైవేటు జలగలు..! )
Comments
Please login to add a commentAdd a comment