పార్కు కోసం వదిలిన ఈ స్థలంలోనే ప్లాట్లు చేసి విక్రయించారు
నిజామాబాద్‌నాగారం : నిజామాబాద్ మున్సిపాలి టీ పరిధిలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.. గజం భూమి రూ. వేల నుంచి రూ. లక్షల్లో పలుకుతుంది.. దీంతో చాలామంది వ్యవసాయభూములను వెంచర్‌లుగా మార్చేసి ప్లాట్లు చేసి క్రయవిక్రయాలు జరుపుతున్నారు. నగరంలోని మానిక్ భండార్ ప్రాంతం ఆర్టీసీ కాలనీ పద్మావతినగర్‌లో రెండు ఎకరాల్లో వెంచర్ వేశారు. భూములకు ధరలకు డిమాండ్ రావడంతో ఇదే అదనుగా పార్కుకు వదిలేసిన 10 శాతం భూమిలోనూ ప్లాట్లు చేసి మరీ సొమ్ముచేసుకున్నారు. ఈ విషయం తెలిసిన మున్సి పల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు పెద్ద ఎత్తున కాసు లు దండుకొని వెంచర్ నిర్వాహకుడికి సహకరించా రని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయమై 2018 నుంచి జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌ల కు రాతపూర్వకంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా స్పందించకపోవడం గమనార్హం.
దొంగ లేఅవుట్ తయారు చేసి..
మానిక్ భండార్ ప్రాంతంలోని పద్మావతి నగర్‌లో ఓం నారాయణ అట్టల్ అనే వ్యక్తి తనకు సంబంధించిన 2.02 ఎకరాల భూమిలో 2003 సంవత్సరంలో ఎల్‌పీనంబర్ 8/2003/ HRO/ H1లో వెంచర్ వేశారు. నిబంధనల ప్రకారం డీటీసీపీ అనుమతి తీసుకొని 32 ప్లాట్లు చేశారు. ఇందులో 10 శాతం భూమి అనగా సుమారు 1,200 గజాల భూమి పార్కు కోసం కేటాయించాలి. అయితే ఇదే ఎల్‌పీనంబర్‌తో నిజామాబాద్ మున్సిపాలిటీలో అక్రమ లేఅవుట్ తయా రు చేయించారు. 10 శాతం భూమిలో 6 ప్లాట్లు చేసి అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. అంతే గా కుండా ఒకే ప్లాట్‌ను ఇద్దరికి అమ్మిన వివాదాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఈ ప్రాంతం గజం భూమి విలు వ సుమారుగా రూ. 20 వేలకు పైనే ఉంది. పా ర్కుకు సంబంధించిన స్థలం 1,200 గజాల్లో సు మారు 700 గజాల భూమిని అమ్మేసి సొ మ్ము చేసుకున్నారు. మిగత 500 గజాల భూమికి స్థానికులు, సామాజిక కార్యకర్తలు పట్టుబట్టి మున్సిపల్ అధికారులతో పోరాటాలు చేసి కంచె ఏర్పాటు చేయించారు.
ఫిర్యాదులు.. చెత్తబుట్టలోకే...
వెంచర్ నిర్వాహకుడి అక్రమాలను గుర్తించిన స్థానికులు, మరో సామాజిక కార్యకర్త చంద్రప్రకాష్ మోదానీ నేరుగా 2018 సంవత్సరం నుంచి మాక్లూర్ మండల తహసీల్దార్‌కు, ఆర్‌డీవో, జిల్లా కలెక్టర్‌లకు, మున్సిపల్ కమిషనర్‌లకు రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. నాలుగేళ్లు పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు చెత్త బుట్టలో వేస్తూనే ఉన్నారు. పైగా ఫిర్యాదు చేసిన వ్యక్తిని వేధింపులను గురి చేయడంతో పాటు భయపెట్టడంతో బాధితుడు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల ఈ నెల 9న కూడా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపాయే..
మానిక్ భండార్ ప్రాంతంలోని పద్మావతి నగర్‌లో ఓం నారాయణ అట్టల్ అనే వ్యక్తి తనకు సంబంధించిన 2.02 ఎకరాల భూమిలో 2003 సంవత్సరంలో ఎల్‌పీనంబర్ 8/2003/HRO/1లో వెంచర్ వేశారు. నిబంధనల ప్రకారం డీటీసీపీ అనుమతి తీసుకొని 32 ప్లాట్లు చేశారు. ఇందులో 10 శాతం భూమి అనగా సుమారు 1,200 గజాల భూమి పార్కు కోసం కేటాయించాలి. అయితే ఇదే ఎల్‌పీనంబర్‌తో నిజామాబాద్ మున్సిపాలిటీలో అక్రమ లేఅవుట్ తయారు చేయించారు.
10 శాతం భూమిలో 6 ప్లాట్లు చేసి అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. అంతే గాకుండా ఒకే ప్లాట్‌ను ఇద్దరికి అమ్మిన వివాదాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతం గజం భూమి విలువ మారుగా రూ. 20 వేలకు పైనే ఉంది. పార్కుకు సంబంధించిన స్థలం 1,200 గజాల్లో సుమారు 700 గజాల భూమిని అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. మిగత 500 గజాల భూమికి స్థానికులు, సామాజిక కార్యకర్తలు పట్టుబట్టి మున్సిపల్ అధికారులతో పోరాటాలు చేసి కంచె ఏర్పాటు చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment