town planing
-
అక్రమ లేఅవుట్ తయారు చేసి.. 10 శాతం మింగేశారు..
నిజామాబాద్‌నాగారం : నిజామాబాద్ మున్సిపాలి టీ పరిధిలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.. గజం భూమి రూ. వేల నుంచి రూ. లక్షల్లో పలుకుతుంది.. దీంతో చాలామంది వ్యవసాయభూములను వెంచర్లుగా మార్చేసి ప్లాట్లు చేసి క్రయవిక్రయాలు జరుపుతున్నారు. నగరంలోని మానిక్ భండార్ ప్రాంతం ఆర్టీసీ కాలనీ పద్మావతినగర్‌లో రెండు ఎకరాల్లో వెంచర్ వేశారు. భూములకు ధరలకు డిమాండ్ రావడంతో ఇదే అదనుగా పార్కుకు వదిలేసిన 10 శాతం భూమిలోనూ ప్లాట్లు చేసి మరీ సొమ్ముచేసుకున్నారు. ఈ విషయం తెలిసిన మున్సి పల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు పెద్ద ఎత్తున కాసు లు దండుకొని వెంచర్ నిర్వాహకుడికి సహకరించా రని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయమై 2018 నుంచి జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ల కు రాతపూర్వకంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా స్పందించకపోవడం గమనార్హం. దొంగ లేఅవుట్ తయారు చేసి.. మానిక్ భండార్ ప్రాంతంలోని పద్మావతి నగర్లో ఓం నారాయణ అట్టల్ అనే వ్యక్తి తనకు సంబంధించిన 2.02 ఎకరాల భూమిలో 2003 సంవత్సరంలో ఎల్‌పీనంబర్ 8/2003/ HRO/ H1లో వెంచర్ వేశారు. నిబంధనల ప్రకారం డీటీసీపీ అనుమతి తీసుకొని 32 ప్లాట్లు చేశారు. ఇందులో 10 శాతం భూమి అనగా సుమారు 1,200 గజాల భూమి పార్కు కోసం కేటాయించాలి. అయితే ఇదే ఎల్‌పీనంబర్‌తో నిజామాబాద్ మున్సిపాలిటీలో అక్రమ లేఅవుట్ తయా రు చేయించారు. 10 శాతం భూమిలో 6 ప్లాట్లు చేసి అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. అంతే గా కుండా ఒకే ప్లాట్‌ను ఇద్దరికి అమ్మిన వివాదాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతం గజం భూమి విలు వ సుమారుగా రూ. 20 వేలకు పైనే ఉంది. పా ర్కుకు సంబంధించిన స్థలం 1,200 గజాల్లో సు మారు 700 గజాల భూమిని అమ్మేసి సొ మ్ము చేసుకున్నారు. మిగత 500 గజాల భూమికి స్థానికులు, సామాజిక కార్యకర్తలు పట్టుబట్టి మున్సిపల్ అధికారులతో పోరాటాలు చేసి కంచె ఏర్పాటు చేయించారు. ఫిర్యాదులు.. చెత్తబుట్టలోకే... వెంచర్ నిర్వాహకుడి అక్రమాలను గుర్తించిన స్థానికులు, మరో సామాజిక కార్యకర్త చంద్రప్రకాష్ మోదానీ నేరుగా 2018 సంవత్సరం నుంచి మాక్లూర్ మండల తహసీల్దార్‌కు, ఆర్డీవో, జిల్లా కలెక్టర్లకు, మున్సిపల్ కమిషనర్లకు రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. నాలుగేళ్లు పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు చెత్త బుట్టలో వేస్తూనే ఉన్నారు. పైగా ఫిర్యాదు చేసిన వ్యక్తిని వేధింపులను గురి చేయడంతో పాటు భయపెట్టడంతో బాధితుడు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల ఈ నెల 9న కూడా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపాయే.. మానిక్ భండార్ ప్రాంతంలోని పద్మావతి నగర్లో ఓం నారాయణ అట్టల్ అనే వ్యక్తి తనకు సంబంధించిన 2.02 ఎకరాల భూమిలో 2003 సంవత్సరంలో ఎల్‌పీనంబర్ 8/2003/HRO/1లో వెంచర్ వేశారు. నిబంధనల ప్రకారం డీటీసీపీ అనుమతి తీసుకొని 32 ప్లాట్లు చేశారు. ఇందులో 10 శాతం భూమి అనగా సుమారు 1,200 గజాల భూమి పార్కు కోసం కేటాయించాలి. అయితే ఇదే ఎల్‌పీనంబర్‌తో నిజామాబాద్ మున్సిపాలిటీలో అక్రమ లేఅవుట్ తయారు చేయించారు. 10 శాతం భూమిలో 6 ప్లాట్లు చేసి అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. అంతే గాకుండా ఒకే ప్లాట్‌ను ఇద్దరికి అమ్మిన వివాదాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతం గజం భూమి విలువ మారుగా రూ. 20 వేలకు పైనే ఉంది. పార్కుకు సంబంధించిన స్థలం 1,200 గజాల్లో సుమారు 700 గజాల భూమిని అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. మిగత 500 గజాల భూమికి స్థానికులు, సామాజిక కార్యకర్తలు పట్టుబట్టి మున్సిపల్ అధికారులతో పోరాటాలు చేసి కంచె ఏర్పాటు చేయించారు. -
అక్కడ పిరం.. ఇక్కడ స్థిరం!
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరులో స్థిరాస్తి వ్యాపారి ఒకరు అయిదెకరాల విస్తీర్ణంలో లేఅవుట్ వేసేందుకు స్థలాన్ని చూశాడు. భూ యజమానితో ఎకరాకు రూ.3 కోట్లకు బేరం కుదుర్చుకున్నాడు. సరిగా నెల తర్వాత 8 కి.మీ. దూరంలో ఉన్న కడ్తాల్‌లో ఎకరా రూ.4 కోట్ల చొప్పున లే అవుట్ ప్రారంభించాడు. అందేంటి? హెచ్ఎండీఏ పరిధిలో, హైవేకు ఆనుకొని ఉన్న స్థలాన్ని కాదని.. ఎక్కువ ధర పెట్టి డీటీసీపీలో వెంచర్ వేశారేంటని ప్రశ్నించగా.. హెచ్ఎండీఏ పరిధిలో ఇండస్ట్రియల్, కన్జర్వేషన్ జోన్ల కారణంగా నివాసిత స్థలం తక్కువగా ఉంది. పైగా లే–అవుట్ అనుమతుల కోసం నెలల తరబడి ఎదురుచూడాలి. ఫీజులూ ఎక్కువే. అదే డీటీసీపీ ఫ్రీ జోన్. చార్జీలు తక్కువే, పర్మిషన్లూ సులువుగా వచ్చేస్తాయని సమాధానమిచ్చాడు. పైగా ధర కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్లాట్లూ త్వరగానే అమ్మకం జరుగుతాయని సెలవిచ్చాడు. .. ఇది ఆ ఒక్క డెవలపర్ అభిప్రాయమే కాదు. చాలా మంది బిల్డర్లు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రాంతాలలో కాకుండా దగ్గరగా ఉన్న డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) పరిధిలో వెంచర్లు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో హెచ్ఎండీఏలో కంటే డీటీసీపీ ప్రాంతాల్లోని భూముల ధరలు శరవేగంగా పెరుగుతున్నాయి. ఆంక్షల్లేవ్.. ఆకాశంలో ధరలు హెచ్ఎండీఏ పరిధిలో చాలా వరకు ప్రాంతాలు ఇండస్ట్రియల్, కన్జర్వేషన్ జోన్లలో ఉంటాయి. ఇక్కడ ప్లాంటింగ్ లేదా నివాస భవనాలకు అనుమతి లేదు కేవలం పరిశ్రమలు, ఇతరత్రా నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఇస్తారు. లే– అవుట్, నిర్మాణాలకు పనికొచ్చే రెసిడెన్షియల్ (ఆర్)–1 జోన్ స్థలాలు చాలా తక్కువగా ఉంటాయి. డీటీసీపీలో జోన్ల సమస్య ఉండదు కాబట్టి ఇక్కడ భూముల ధరలు హెచ్ఎండీఏతో పోలిస్తే 20–30 శాతం ఎక్కువ పలుకుతున్నాయని స్పేస్ విజన్ సీఎండీ నర్సింహారెడ్డి తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో ఫీజు చదరపు మీటరుకు రూ.40 చెల్లించాలి. బెటర్మెంట్ చార్జీలు, పార్క్‌లు, ఇతరత్రా లోడ్ల పేరిట ఫీజుల మోత మోగుతుంది. పైగా అనుమతుల కోసం నెలల తరబడి వేచి చూడాలి. డీటీసీపీలో గ్రామ పంచాయితీ తీర్మానాన్ని బట్టి ఫీజుల్లో తేడా ఉంటుంది. బెటర్మెంట్ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్, లే అవుట్ ఫీజు (చ.మీ.) గజానికి రూ.5–12 వరకు ఉంటుంది. డీటీసీపీలో రోడ్ల విస్తీర్ణం ఎక్కువే.. లే–అవుట్ విస్తీర్ణంలో 10 శాతం ఓపెన్ ప్లేస్, 30 శాతం రోడ్లకు పోగా మిగిలిన స్థలంలో ప్లాటింగ్ చేసుకోవచ్చు. రహదారుల హద్దులను బట్టి ఎకరం స్థలంలో 55–59 శాతం ప్లాటింగ్ ఏరియా ఉంటుంది. అంటే ఎకరానికి సుమారుగా 2,600 గజాల నుంచి 2,900 గజాల ప్లాటింగ్ చేసుకోవచ్చు. హెచ్ఎండీఏలో పోలిస్తే డీటీసీపీలో రహదారుల విస్తీర్ణం కాస్త ఎక్కువగా ఉంటుంది. హెచ్ఎండీఏలో 30 అడుగుల రోడ్లు ఉన్నా అనుమతులు వస్తాయి. అదే డీటీసీపీలో అయితే అంతర్గత రోడ్లు 33 ఫీట్లు ఉండాల్సిందే. ఒకవేళ హెచ్ఎండీఏ పరిధిలో అప్రోచ్ రోడ్ 40 ఫీట్లు ఉంటే ఇంటర్నల్ రోడ్ కూడా 40 ఫీట్లు ఉండాల్సిందే. హెచ్ఎండీఏ, డీటీసీపీ ఏ ప్రాంతంలోనైనా సరే లే–అవుట్‌లోని మొత్తం ప్లాటింగ్ 15 శాతం మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. అమ్మకాలు సులువు.. అపార్ట్మెంట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలతో పోలిస్తే ఓపెన్ ప్లాట్ల విషయంలో కొనుగోలుదారుల ఎంపిక భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ధరే కొనుగోలు నిర్ణయాన్ని నిర్ధారిస్తుంది. అందుకే చాలా మంది డెవలపర్లు హెచ్ఎండీఏ పరిధిలో అధిక ధర పెట్టి స్థలాన్ని కొని వెంచర్ చేస్తే డెవలపర్‌కు పెద్దగా లాభం ఉండదు. అదే హెచ్ఎండీఏ ప్రాంతం నుంచి 4–5 కి.మీ. దూరంలో ఉన్న డీటీసీపీలో తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేసి అన్ని రకాల అభివృద్ధి పనులను చేపట్టి ప్లాట్లను చేస్తే సులువుగా అమ్ముడవుతాయి. డెవలపర్‌కూ గిట్టుబాటవుతుంది. ప్రతికూల మార్కెట్ ఉన్న ప్రస్తుత సమయంలో డీటీసీపీలో వెంచర్లు చేయడమే ఉత్తమమని మిర్చి డెవ లపర్స్ ఎండీ మల్లారెడ్డి అన్నారు. (చదవండి: 4 గంటలు.. 3 సర్జరీలు) -
టౌన్ ప్లానింగ్‌పై ఏసీబీ పంజా
మంగళవారం ఉదయం 10.30 గంటల సమయం..గాజువాకలోని జీవీఎంసీ జోన్–5 కార్యాలయంలో అప్పుడప్పుడే కార్యకలాపాలు మొదలవుతున్నాయి. అదే సమయంలో ఒక్కసారిగా పది మంది వ్యక్తులు లోపలికి ప్రవేశించి ఉద్యోగుల నుంచి ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు మొదలుపెట్టారు.అదే సమయానికి.. మధురవాడలోని జోన్–1 కార్యాలయంలోనూ అదే సీన్.అవినీతి ప్లానింగ్‌తో నగరపాలనను గాడి తప్పిస్తున్న జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంపై అవినీతి నిరోధక శాఖ పంజా విసిరింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఏసీబీ డీఎస్పీలు షకీలాభాను, రంగరాజుల ఆధ్వరం్యలో రెండు బృందాలు గాజువాక, మధురవాడ కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. రెండు చోట్లా టౌన్ ప్లానింగ్ విభాగాల్లోనే ఈ సోదాలు కేంద్రీకృతం కావడం విశేషం.తనిఖీ బృందాలు ఫైళ్లు, రికార్డులు పరిశీలించడంతో సరిపెట్టకుండా బిల్డింగ్ ఇన్స్పెక్టర్ నుంచి చైన్మన్ వరకు.. అలాగే ఆ సమయంలో అక్కడ ఉన్న బయటి వ్యక్తులను తరచి తరచి ప్రశ్నించారు. వారిలో కొందరు అనధికార ఉద్యోగులుగా చెలామణీ అవుతున్న విషయాన్ని గుర్తించారు. కాగా మధురవాడ జోనల్ కార్యాలయంలో ఒక అనధికార మహిళా ఉద్యోగి వద్దటౌన్ ప్లానింగ్ సిస్టమ్‌కు చెందిన పాస్వర్డ్ ఉన్న విషయం సోదాల్లో వెలుగు చూసింది. బిల్డింగ్ ప్లాన్లకు అనుమతుల జారీలో కొన్ని ఉల్లంఘనలు సైతం ఏసీబీ అదికారులు దృష్టికి వచ్చాయి. విశాఖపట్నం, మధురవాడ (భీమిలి): భవన నిర్మాణాలకు అనుమతుల మంజూరులో నిబంధనలు తుంగలో తొక్కేయడం... నిర్మాణదారులు నిబంధనలు ఉల్లంఘించినా చూసీచూడనట్లు వ్యవహరించడం... అధ్వానంగా రికార్డుల నిర్వహణ, అనధికార నిర్మాణాలు కట్టడిచేయలేకపోవడం... ఇలా ఒక్కటేమిటి అన్నింటా జీవీఎంసీ జోన్–1 కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సి బ్బంది అవకతవకలకు పాల్పడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఏసీబీ అధికారులు తేల్చారు. మధురవాడలోని జోనల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ డీఎస్పీ రంగరాజు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు జెడ్సీ రాము సమక్షంలోను, వేర్వేరుగా స్థానిక అధికారులను ప్రశ్నించారు. అనంతరం బీరువాలు, రికార్డులు పరిశీలించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం మంగళవారం సాయంత్రం వరకూ సోదాలు జరుగుతుండగా ప్రాథమిక సమాచారాన్ని డీఎస్పీ రంగరాజు మీడియాకి తెలిపారు. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడంలో, ప్లాన్లు అమోదించడంలో జరుగుతున్న అవకతవకలు పరిశీలించాలని రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి ఆదేశాల మేరకు సోదాలు నిర్వహించినట్టు చెప్పారు. ఇక్కడ పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది రికార్డులు సరిగా నిర్వహించడం లేదని తెలిపారు. అనధికార నిర్మాణాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారని, పరిశీలించాల్సిన అధికారులు కూడా పట్టించుకోవడం లేదని గుర్తించామన్నారు. ఈ డీవియేషన్స్ టీపీఎస్, టీపీవో, ఏసీపీ... ఇలా అన్ని స్థాయిల్లో ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా నాన్ ఏజెన్సీ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ రికార్డుల నిర్వహణ, టీడీఆర్ ఇవ్వడం వంటి వాటిలో అవకతవకలు జరిగినట్టు గుర్తించామని తెలిపారు. అలాగే ఇక్కడ అత్యంత రహస్యంగా ఏసీపీ మాత్రమే ఉపయోగించాల్సిన డాంగిల్, పాస్వర్డ్ ఓ అనధికార మహిళకు అప్పగించి పనులు నిర్వహిస్తున్నారని తెలిపారు. చివరకు అత్యంత ముఖ్యమైన ఆర్టీఐ రిజిస్టర్ కూడా సక్రమంగా నిర్వహించలేదని చెప్పారు. ఆరిలోవ ఇందిరానగర్‌లో ఓ భవనంలో మూడు ప్లాట్ల నిర్మాణానికి అనుమతి తీసుకుని 8 ప్లాట్స్ నిర్మిస్తున్నట్టు ప్రాథమిక నిర్థారణకు వచ్చామని, దానిపై కూడా విచారణ సాగుతుందని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలకు సిఫార్స్ చేస్తామని తెలిపారు. ఇన్స్పెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఆఫీసులో, మరో ఇన్స్పెక్టర్ అప్పారావు ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో విచారణ సాగిస్తున్నామని తెలిపారు. జోన్–5లోనూ విస్తృత సోదాలు గాజువాక: జీవీఎంసీ జోన్ – 5 (గాజువాక జోన్) కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్ విభాగంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు, సిబ్బంది మంగళవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో ఒక్కసారిగా పది మంది ప్రవేశించి విభాగంలోని ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు విచారణ కొనసాగించారు. ఏసీబీ అడిషినల్ ఎస్పీ షకీలాభాను, సీఐ లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించిన అధికారులు టౌన్‌ప్లానింగ్ విభాగంలోని ప్రతి ఫైలును క్షుణ్ణంగా పరిశీలించారు. వివిధ ఫైళ్లకు సంబంధించిన అనుమతుల్లో చోటుచేసుకున్న జాప్యంపై విభాగం అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా సహాయ ప్లానింగ్ అధికారి అమర్నాథ్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు వెంకటరావు, గోపన్నలను వివిధ అంశాలపై విచారించారు. గుమస్తాలను విచారించడంతోపాటు వారి వద్ద ఉన్న నగదు సైతం పరిశీలించారు. అనంతరం ఆ వివరాలను నమోదు చేశారు. విభాగంలో అనధికారికంగా పని చేస్తున్న వ్యక్తుల వివరాలు సేకరించారు. విభాగంలో అప్పటికే ఉన్న బయటి వ్యక్తులను ప్రశ్నించారు. సమస్యలుంటే తమతో చెప్పాలని ఏసీబీ అధికారులు కోరడంతో పలువురు తమ సమస్యలను వివరించారు. అనంతరం జోన్లో చోటు చేసుకొంటున్న అనధికార నిర్మాణాలపై చైన్మ్యాన్లను ప్రశించారు. పలు వార్డుల్లో పర్యటించి వివిధ భవన నిర్మాణాలను పరిశీలించారు. జోనల్ కమిషనర్ డి.శ్రీధర్ నుంచి పలు వివరాలు సేకరించారు. టౌన్‌ప్లానింగ్ సిబ్బంది హాజరు, సర్వీస్ రిజిస్టర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అడిషినల్ ఎస్పీ షకీలాభాను మాట్లాడుతూ అనధికార వ్యక్తుల నుంచి రూ.29వేలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కార్యాలయం పరిధిలో పలు అవకతవకలు జరిగినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఇద్దరు అనధికార కంప్యూటర్ ఆపరేటర్లు కార్యాలయంలో పనిచేస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. ఫిర్యాదుల ఆధారంగా దాడులు టౌన్‌ప్లానింగ్ విభాగంపై ఏసీబీకి వరుసగా అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. గాజువాక జోన్లో ఈ ఫిర్యాదులు మరింత వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు ఇవ్వనిదే భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంలేదని, అనధికారిక నిర్మాణాల్లో చైన్మ్యాన్లు కీలకంగా వ్యవహరిస్తున్నారని, డబ్బులు వసూలు చేసి అనుమతిస్తున్నారన్న ఆరోపణలు, ఫిర్యాదులు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ అంశాలపై ఏసీబీ అధికారులు వివరాలు సేకరించారు. -
రూల్స్ ఈజీ
సాక్షి, సిటీబ్యూరో: మున్సిపాలిటీలు,కార్పొరేషన్ల కోసం ప్రభుత్వం నూతనంగా రూపొందించిన మున్సిపల్ చట్టం మేరకు భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతులు ప్రజలు, బిల్డర్లకు అనుకూలంగాఉండడంతో... గ్రేటర్ హైదరాబాద్‌కోసం త్వరలో రూపొందించనున్నజీహెచ్ఎంసీ చట్టంలోనూ టౌన్‌ప్లానింగ్ రూల్స్ అందరికీ సదుపాయంగా ఉండే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త మున్సిపల్ చట్టం మేరకు 75 చ.మీ (దాదాపు 90 గజాలు)లోపు ఇళ్లు నిర్మించుకునేవారు ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. నామమాత్రంగా రూపాయి ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. నిర్మాణం పూర్తయ్యాక కూడా ఓసీ అవసరం లేదు. 10 మీటర్ల ఎత్తులోపు జీప్లస్ 1 అంతస్తు వరకు ఈ సదుపాయం ఉంది. అంతేకాకుండా 500 చ.మీ లోపు నివాస గృహాలకు ఇంటి యజమాని లేదా నిర్మాణదారు సెల్ఫ్ సర్టిఫికేషన్ (స్వీయ ధ్రువీకరణ) సరిపోతుంది. నగరానికి సంబంధించి త్వరలో రూపొందించనున్న జీహెచ్ఎంసీ నూతన చట్ట ముసాయిదాలోనూ ఇలాంటి నిబంధనలే ఉండే అవకాశం ఉందని, నగర పరిస్థితుల దృష్ట్యా 100 గజాల్లోపు స్థలంలో ఇళ్లు నిర్మించుకునే వారికి నిర్మాణ అనుమతి నుంచి మినహాయింపు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇంకా 200 చ.మీ వరకు మార్టిగేజ్ అవసరం లేదు. 200–500 చ.మీ వరకు ఓసీ కూడా స్వీయ సర్టిఫికేషన్ సరిపోతుంది. అయితే ఉల్లంఘనలుంటే మాత్రం సంబంధిత ఆర్కిటెక్ట్ లైసెన్సు రద్దవుతుంది. 500 చ.మీ మించిన వాటికి సింగిల్‌విండో ద్వారా అనుమతుల జారీ ఇప్పటికే ప్రారంభమైంది. ఇలాంటి వాటికి కొత్త నిబంధన మేరకు 10 రోజుల్లోగా దరఖాస్తుకు సంబంధించి అన్ని పత్రాలు సవ్యంగా ఉన్నదీ? లేనిదీ? సమాచారం తెలపడంతో పాటు 21 రోజుల్లోగా అనుమతించాల్సి ఉంటుంది. లేని పక్షంలో అనుమతిచ్చినట్లుగానే పరిగణించవచ్చు. ఉల్లంఘనలపై కఠిన చర్యలు.. మున్సిపల్ చట్టం మేరకు మాస్టర్‌ప్లాన్, బిల్డింగ్ రూల్స్‌కు లోబడి మాత్రమే నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించినా, తప్పుడు ప్రకటనలతో స్వీయ ధ్రువీకరణ పొందినా యజమానితో పాటు ఆర్కిటెక్ట్‌పై కూడా కఠిన చర్యలుంటాయి. వీటిలో మూడేళ్ల వరకు జైలు శిక్ష, పెనాల్టీ, నోటీసులు లేకుండా కూల్చివేయడం, సీలు వేయడం తదితర చర్యలు ఉన్నాయి. దీంతో అక్రమ నిర్మాణాలు తగ్గుతాయనే అంచనాలు ఉన్నాయి. అనుమతి పొందిన భవనాలను మాత్రమే రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో నగరానికి సంబంధించి త్వరలో రూపొందనున్న టౌన్‌ప్లానింగ్ నిబంధనలతో సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
‘ప్లాన్’ చేంజ్!
సాక్షి, సిటీబ్యూరో : నగర ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఆయా సేవల్ని సరళీకరిస్తున్న జీహెచ్ఎంసీ..అదే తరుణంలో నిబంధనలు ఉల్లంఘించేవారు, అక్రమాలకు పాల్పడేవారిపై కఠినచర్యలు తీసుకోనుంది. ఇలా ఓవైపు సరికొత్త సంస్కరణల అమలు..మరోవైపు ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపనుంది. మునిసిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల కనుగుణంగా ఇప్పటికే భవన నిర్మాణ అనుమతుల జారీని 21 రోజులకు తగ్గించిన జీహెచ్ఎంసీ.. దీన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఏ అధికారి వద్దనైనా ఫైలు నిర్ణీత వ్యవధికంటే ఎక్కువ రోజులుంటుందో వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఈ అంశంలో ఇప్పటికే కొందరు అధికారులకు మెమోలు జారీ చేశారు. ప్రజలు భవన నిర్మాణ అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండేందుకు ఆన్లైన్లోనే అనుమతుల జారీ విధానాన్ని రెండేళ్లక్రితమే చేపట్టినప్పటికీ మరింత సరళీకరణలో భాగంగా అనుమతులను 21 రోజులకు తగ్గించారు. సర్కిళ్లు, జోన్ల పరిధిలోని భవనాల అనుమతులకు సంబంధించి ప్రధాన కార్యాలయం వరకు రానవసరం లేకుండా జోన్లకే స్టిల్ట్+ 5 అంతస్తుల వరకు అధికారాలిచ్చే చర్యలు తాజాగా చేపట్టారు. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకొని ఆర్కిటెక్టులు ఇబ్బందులు పెట్టకుండా ఉండేందుకు భవన నిర్మాణాలకు తగిన డిజైన్లను కూడా జీహెచ్ఎంసీయే రూపొందించి త్వరలో అందుబాటులోకి తేనుంది. ఇది అమల్లోకి వస్తే.. నిర్ణీత స్థల విస్తీర్ణంలో ఎన్ని అంతస్తుల భవనం కట్టుకోవచ్చో అన్ని అంతస్తులకు సంబంధించి నాలుగైదు రకాల డిజైన్లు ఆన్లైన్లోనే అందుబాటులో ఉంచుతారు. ప్రజలు తాము కోరుకున్నడిజైన్ను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. తద్వారా ఆర్కిటెక్ట్‌తో పని ఉండదు. అప్రూవ్డ్ లేఔట్లలోని ప్లాట్లలో నిర్మాణం చేసుకోవాలనుకునేవారికి, ముందస్తు క్షేత్రస్థాయి తనిఖీల్లేకుండానే ఒకరోజు వ్యవధిలోనే ప్రాథమిక అనుమతులు జారీ చేసేందుకు సాఫ్ట్‌వేర్‌ను తగిన విధంగా రూపొందిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఇది అందుబాటులోకి రానుందని చీఫ్‌సిటీప్లానర్ దేవేందర్‌రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ చేపట్టే వివిధ ప్రాజెక్టులతోపాటు నగరంలో ఏ సంస్థ అభివృద్ధి పనులు ప్రారంభించినా అవసరమైన భూసేకరణ బాధ్యతలు జీహెచ్ఎంసీపై మోపుతున్నారు. భూసేకరణ అధికారాలు కలెక్టర్ల పరిధిలో ఉండటంతో జీహెచ్ఎంసీనుంచి కలెక్టర్లకు పంపడం.. అక్కడినుంచి తిరిగిరావడంలో జాప్యం తోపాటు కలెక్టర్లకున్న వివిధ పనుల వల్ల కూడా ఆలస్యం జరుగుతోంది. వీటిని దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ల పరిధిలోని భూసేకరణ అధికారాలను జీహెచ్ఎంసీకే అప్పగించేందుకు ప్రత్యేకంగా భూసేకరణ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీపరిధిలో ప్రస్తుతం ఆయా జిల్లాల కలెక్టర్లకున్న భూసేకణ అధికారం కమిషనర్‌కు బదలాయిస్తారు. ఇందుకు ప్రత్యేకంగా భూసేకరణ విభాగాన్ని ఏర్పాటుచేసి జాయింట్ కలెక్టర్‌ను అడిషనల్ కమిషనర్ హోదాలో నియమిస్తారు. కమిషనర్ అజమాయిషీలో ఆయన పనిచేస్తారు. ఈ విభాగానికి అవసరమైనంతమంది అధికారులు, ఇతరత్రా సిబ్బందినీ నియమిస్తారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదముద్ర పడగానే ప్రత్యేక భూసేకరణ విభాగం ఏర్పాటు కానుంది. అతిక్రమణలపై కఠిన చర్యలు.. ఇలా ఓవైపు వివిధ సంస్కరణలు అమలు చేస్తున్నప్పటికీ, నిర్మాణాల్లో ఉల్లంఘనలు ఆగకపోవడంతో అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. అనుమతుల్లేకుండా జరిగే అక్రమనిర్మాణాలను గుర్తించడంతోపాటు వెంటనే కూల్చివేసే చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని బలోపేతం చేస్తున్నారు. ఎస్పీస్థాయి అధికారి డైరెక్టర్‌గా ఉన్న ఈ విభాగంలోని పోలీసు అధికారులు, తదితర సిబ్బందితోపాటు, జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేస్తారు. అంతేకాదు..నాలాల వెంబడి, చెరువుల ఎఫ్టీఎల్లు, తదితర ప్రాంతాల్లో వెలిసే అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేస్తారు. ఆహారకల్తీ తదితర అంశాలపైనా కఠిన చర్యలు తీసుకోనున్నారు. భవన నిర్మాణాలకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి బిల్డింగ్ ట్రిబ్యునల్ అందుబాటులోకి రానుంది. ఇది పని ప్రారంభిస్తే ఇప్పటిమాదిరిగా వివిధ కోర్టుల స్టేలుండవు. నిర్మాణాలకు సంబంధించిన వివాదాలన్నీ ట్రిబ్యునల్ పరిధిలోకే వస్తాయి. కేసులు సత్వరం పరిష్కారమవుతాయి. రెరా(రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) సైతం పని ప్రారంభిస్తే ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. బూటకపు ప్రకటనలతో మోసం చేసే బిల్డర్ల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. కొనుగోలుదారులకు మేలు కలిగే అవకాశం ఉంది. -
ఎంవీపీ స్టేషన్లో హైడ్రామా
విశాఖ సిటీ , పెదవాల్తేరు (విశాఖతూర్పు) : ఎంవీపీ పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా నడిచిం ది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన టౌన్‌ప్లానింగ్ రాష్ట్ర డైరెక్టర్ జి.వి.రఘును విజ యవాడలో అరెస్టు చేసిన ఏసీబీ అధికా రులు మంగళవా రం మూడో పట్టణ పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చారు.ఈ విషయం తెలియ డంతో మీడియా ప్రతినిధులు ఉదయమే స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులు రఘ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఉదయం 8 నుంచి రాత్రి 7.10 గంటల వరకు పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. దీంతో అక్కడ హైడ్రామా నడిచింది. రఘు తన ఆస్తుల గురించి ఏం మాట్లాడతారనే ఉత్కంఠతో మీడియా అంతా స్టేషన్ వద్ద పడిగాపులు కాయాల్సివచ్చింది. ఏసీబీ అధికారులు రఘును సరిగ్గా రాత్రి 7.10 గంటలకు స్టేషన్ నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులు చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు. రఘు చిరునవ్వు చిందిస్తూ అందరికీ నమస్కారం చేస్తూ ఏసీబీ వాహనంలో ఎక్కేశారు. అక్కడి నుంచి రఘును ముందు కేజీహెచ్ తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఏసీబీకోర్టుకు తరలించారు. రఘుపై 308 పేజీల చార్జిషీట్‌ను ఏసీబీ అ«ధికారులు దాఖలు చేశారు. రఘుకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. -
కేవీఆర్ స్థలాన్ని కబ్జా చేస్తే ఊరుకోం
– కొందరి స్వార్థం కోసం పేద విద్యార్థులకు అన్యాయం చేస్తామంటే సహించం – అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ బుట్టా రేణుక – ఎంపీ రాకతో కబ్జా స్థలంలోని పునాదుల్లో మార్పులు – టౌన్ ప్లానింగ్ ప్రకారం దగ్గర ఉండి కొలతలు వేయించిన హఫీజ్‌ఖాన్, విద్యార్థి సంఘాల నాయకులు కర్నూలు సిటీ: రోడ్డు విస్తరణలో అధికార పార్టీ నేతల మాటలు విని ఇష్టానుసారంగా వ్యవహరించడం తగదని కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక నగరపాలక సంస్థ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుల్లో స్టే ఉన్నా కేవీఆర్ కాలేజీ క్యాంపస్ స్థలాన్ని కబ్జా చేయాలని అధికార పార్టీ నేతల అనుచరులు గోడను కూల్చి వేయడంతో రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ బుట్టారేణుక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జ్ హఫీజ్‌ఖాన్, కేంద్ర పాలక మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డితో కలిసి కేవీఆర్ కాలేజీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా అర్ధరాత్రి గోడను కూల్చివేయడం, తదితర పరిణామాల గురించి హఫీజ్‌ఖాన్, విద్యార్థి సంఘాల నాయకులు, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మలమ్మ ఎంపీకి వివరించారు. ఆ తరువాత నగర పాలక సంస్థ కమిషనర్ హరినాథ్‌రెడ్డి, ఇతర అధికారులతో ఆమె చర్చించారు. అనుమతులు లేకుండా అర్ధరాత్రి మహిళ కాలేజీ గోడను కూల్చి వేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. కొందరికి ప్రయోజనం చేకూర్చడ కోసం కాలేజీ స్థలాన్ని ఆక్రమించుకోవడం తగదన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ బుట్టా రేణుక మండిపడ్డారు. గతంలో మాదిరిగా 6 మీటర్ల వరకు మాత్రమే స్థలాన్ని తీసుకోవాలని ఇంతకు మించి ఎక్కువ తీసుకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ప్రహరీ గోడ కూల్చివేతతో విద్యార్థినులకు రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. టౌన్ ప్లానింగ్ ప్రకారమే రోడ్లు విస్తరించాలని చెప్పారు. అనంతరం అందుకు సంబంధించిన మ్యాప్‌లు తెప్పించి, ప్రస్తుతం తీసిన పునాదుల నుంచి బయటి వైపునకు 2 మీటర్లు వదిలి గోడ నిర్మాణం జరపాలని సూచించారు. ఇందుకు కమిషనర్ హరినాథ్‌రెడ్డి హామీ ఇచా్చరు. అలాగే విద్యార్థినులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం టౌన్ ప్లానింగ్ ప్రకారం హఫీజ్‌ఖాన్ దగ్గర ఉండి కొలతలు వేయించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సురేందర్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అద్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ నాగరాజు యాదవ్, నాయకులు రాఘవేంద్రరెడ్డి, రాజశేఖర్, ట్రేడ్ యూనియన్ సిటీ నాయకులు కటారీ సురేష్, జాన్, బుజ్జీ, రవి, అశోక్, కుమార్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు అనిల్‌కుమార్, రాజు, కిరణ్, సాంబ, ఏసన్న, ప్రవీణ్, లోకేష్, చెన్నప్ప, చంద్రశేఖర్‌గౌడు, తాఫీక్, శీను, విద్యార్థి సంఘాల నాయకులు రంగన్న, చంద్రప్ప, రామకృష్ణ, భాస్కర్, రాజ్‌కుమార్, రమేష్, సీపీఎం నగర కార్యదర్శి గౌస్‌దేశాయ్, తదితరులు పాల్గొన్నారు. -
క్రమబద్ధీకరించుకోకుంటే చర్యలు
– టౌన్ ప్లానింగ్ రీజినల్ డైరెక్టర్ వెంకటపతి రెడ్డి కర్నూలు(టౌన్): ప్రభుత్వ అనుమతి లేని భవనాలను ఈ నెలాఖరు లోపు క్రమబద్ధీకరించుకోకపోతే చర్యలు తప్పవని పట్టణ ప్రణాళిక విభాగం ప్రాంతీయ సంచాలకులు వెంకటపతిరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నగరపాలక సంస్థలోని కమిషనర్ చాంబర్లో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల అనుమతులకు సంబంధించి ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో కంప్యూటీకరించాలన్నారు. ఆన్లైన్ విధానంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అలాగే భవనాల క్రమబద్ధీకరణ పథకం కింద ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, కంప్యూటరీకరణ చేశారా, ఎన్ని దరఖాస్తులను క్లియర్ చేశారు తదితర వివరాలను సంబంధిత పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరిత గతిన భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.రవీంద్రబాబు, పట్టణ ప్రణాళిక విభాగం అడిషనల్ సిటీ ప్లానర్ శాస్త్రి షభ్నం, టీపీఎస్‌లో బీఐలు పాల్గొన్నారు. -
అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణలో ఆదోని ఫస్ట్
టౌన్ ప్లానింగ్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ వెంకటపతిరెడ్డి ఆదోని టౌన్: అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణలో రీజియన్‌లో ఆదోని, ప్రొద్దుటూరు ప్రథమ స్థానంలో నిలిచాయని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ వెంకటపతి రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తన సహచర ఉద్యోగులతో కలిసి ఆదోని మున్సిపాలిటీని సందర్శించారు. అర్ధాంతరంగా ఆగిపోయిన ఆస్పరి బైపాస్ రోడ్డును పరిశీలించారు. పట్టణంలో పలు వార్డుల్లో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు చేసుకున్న వారి ఆస్తులు, కట్టడాలను పరిశీలించారు. అనంతరం టౌన్‌ప్లానింగ్ సెక్షన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన 10,346 దరఖాస్తుల్లో 5వేలు పరిష్కారమయ్యాయన్నారు. తద్వారా ప్రభుత్వానికి రూ.496 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. క్రమబద్ధీకరణ చేసుకోని యజమానులు ఈ నెలాఖరు వరకు గడువు ఉందని త్వరగా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని లేనిపక్షంలో భవిష్యత్తులో ఆస్తులపై పన్నులు రెట్టింపు విధించడం లేదా భవంతులు కూల్చివేయడం జరుగుతుందన్నారు. భవంతుల నిర్మాణం, ఇతరత్రా వాటి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి 24గంటల్లోగా అనుమతి లభిస్తుందన్నారు. ఆన్లైన్లో మంజూరు మేరకే నిర్మాణాలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా భవంతులు నిర్మించుకున్నట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో టీపీఏలు భాస్కర్, జయరామ్, ఆదోని టౌన్‌ప్లానింగ్ అధికారి మహబూబ్ బాషా ఉన్నారు. -
నారాయణ.. ‘నారాయణ’!
మంత్రి ఫోన్‌తో నిలిచిపోయిన టాస్క్‌ఫోర్స్ తనిఖీలు ప్రారంభించిన కొన్ని గంటల్లోనే నిలిపివేత అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకే.. నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై చర్యలు నిల్ సాక్షి, గుంటూరు: హలో... ఎక్కడున్నారు.. ఎక్కడున్నా సరే వెంటనే రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేసి వెనక్కి రండి.. ఇది ఫోన్లో డీటీసీపీ (డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) నుంచి రెస్క్యూటీమ్ అధికారులకు వచ్చిన ఆదేశాలు. ఆరంభ శూరత్వంలో తమకు సాటి లేరని రాష్ట్రప్రభుత్వ పెద్దలు మరోసారి నిరూపించుకున్నారు. నెల్లూరు తరహాలో గుంటూరు నగరంలో ఎక్కడికక్కడ ఆన్లైన్లో ఇచ్చిన భవన నిర్మాణ అనుమతులను తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకుంటాం... ఇందుకోసం నాలుగు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ టీమ్‌లను ఏర్పాటు చేశామంటూ ప్రగల్భాలు పలికిన మంత్రి నారాయణ, రాష్ట్ర పట్టణప్రణాళికాధికారులు నగరంలోని టీడీపీ నాయకుల ముందు తమ ఆదేశాలు ఏమాత్రం చెల్లవని అంగీకరించక తప్పలేదు. పరిశీలన ఊసే లేదు.. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల నుంచి కొంతమంది అధికారులను ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ టీమ్‌లో సభ్యులుగా నియమించింది. టాస్క్‌పోర్స్ బృందం బుధవారం నుంచి ఈనెల 6వ తేదీ వరకు న గరంలో 200 చదరపు మీటర్లు కలిగిన భవన నిర్మాణాలను మొదటి విడతగా దాదాపు 200 ఇళ్లను తనిఖీ చేయాలని నిర్ణయించారు. ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరిగాయా? నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి చెల్లించవలసిన ఫీజు చెల్లించినదీ, లేనిదీ తదితర అంశాలను టాస్క్‌పోర్స్ సిబ్బంది తనిఖీ చేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలు చేయకుంటే వాటిని కూల్చివేయాలని నిర్ణయించారు. బుధవారం ఉదయం 7.30 గంటలకే నాలుగు టీమ్‌లు బయలుదేరి నగరంలోని నాలుగువైపులకు వెళ్లాయి. మధ్యాహ్నం వరకు తనిఖీలు చేశారు. అయితే అనుకోకుండా డీటీసీపీ నుంచి ఆపరేషన్ నిలిపివేయాలని ఆదేశాలు రావడంతో రెస్క్యూ టీమ్‌లోని అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. తనిఖీలు నిలిపివేసి వారివారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఎన్నికలు వస్తున్నాయనే.. వాస్తవానికి వందల సంఖ్యలో భవనాలను ఈ తనిఖీల్లో కూల్చివేయడం, లేదా నోటీసులు అందించడంతో పాటు జరిమానాలు విధించే అవకాశం ఉంది. నగరంలో తనిఖీలు ప్రారంభించిన వెంటనే టీడీపీ నాయకులు అప్రమత్తమయ్యారు. ఎక్కువగా టీడీపీ నాయకులు, వారికి కావాల్సిన వారే బిల్డర్లుగా ఉండటంతో వారు ప్రజాప్రతినిధులను ఆశ్రయించారు. ఇంకేముంది నగరంలో మరో మూడు నెలల్లో కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయని, ఇటువంటి సమయంలో భవనాల జోలికి వస్తే పార్టీకి తీరని నష్టం ఏర్పడుతుందంటూ ప్రజాప్రతినిధులపై వత్తిడి తీసుకువచ్చారు. నగరంలో ఉన్న మంత్రి పుల్లారావు దృష్టికి ఇదే విషయాన్ని టీడీపీ నాయకులు తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన ఆయన మంత్రి నారాయణ దష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. నగరపాలకసంస్థ ఎన్నికల దృష్ట్యా రెస్క్యూ ఆపరేషన్‌ను నిలిపివేయాలని, ఏమైనా ఉంటే ఎన్నికల తర్వాత చూడవచ్చంటూ వత్తిడి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన మంత్రి నారాయణ రెస్క్యూ ఆపరేషన్‌ను నిలిపివేయాలని డీటీసీపీకి ఆదేశాలు జారీచేయడంతో ఆయన రెస్క్యూటీమ్ అధికారులకు ఆపరేషన్ నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో తనిఖీ ప్రక్రియ నిలిచిపోయింది. ఏది ఏమైనా నగరపాలకసంస్థ ఎన్నికలను అడ్డుపెట్టుకొని నగరంలో అ«నధికార భవనాలపై చర్యలకు టీడీపీ నాయకులు అడ్డుపడుతున్నారు. దీంతో ఏ నగరంలో లేని విధంగా అక్రమ కట్టడాలకు అడ్డగా గుంటూరు నగరం మారుతోంది.