రఘును స్టేషన్ నుంచి బయటకు తీసుకు వస్తున్న పోలీసులు
విశాఖ సిటీ , పెదవాల్తేరు (విశాఖతూర్పు) :
ఎంవీపీ పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా నడిచిం ది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన టౌన్‌ప్లానింగ్ రాష్ట్ర డైరెక్టర్ జి.వి.రఘును విజ యవాడలో అరెస్టు చేసిన ఏసీబీ అధికా రులు మంగళవా రం మూడో పట్టణ పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చారు.ఈ విషయం తెలియ డంతో మీడియా ప్రతినిధులు ఉదయమే స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులు రఘ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఉదయం 8 నుంచి రాత్రి 7.10 గంటల వరకు పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు. దీంతో అక్కడ హైడ్రామా నడిచింది. రఘు తన ఆస్తుల గురించి ఏం మాట్లాడతారనే ఉత్కంఠతో మీడియా అంతా స్టేషన్ వద్ద పడిగాపులు కాయాల్సివచ్చింది.
ఏసీబీ అధికారులు రఘును సరిగ్గా రాత్రి 7.10 గంటలకు స్టేషన్ నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులు చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు. రఘు చిరునవ్వు చిందిస్తూ అందరికీ నమస్కారం చేస్తూ ఏసీబీ వాహనంలో ఎక్కేశారు. అక్కడి నుంచి రఘును ముందు కేజీహెచ్ తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఏసీబీకోర్టుకు తరలించారు. రఘుపై 308 పేజీల చార్జిషీట్‌ను ఏసీబీ అ«ధికారులు దాఖలు చేశారు. రఘుకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.