munsipal department
-
ప్రక్షాళన చేయాల్సిందే..
ఖమ్మం: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో ఔట్ సోర్సింగ్ సిబ్బంది తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కొందరు సిబ్బంది విభాగాల్లో అంతా తామై వ్యవహరిస్తున్నారని కేఎంసీలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల కన్నా వీరి పెత్తనమే ఎక్కువైందని, అధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా తాము చెప్పిందే వేదం అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇక కంప్యూటర్ ఆపరేటర్లు కేటాయించిన విభాగాల్లో కాకుండా అంతా ఒకే గదిలో కూర్చుని కార్యకలాపాలు సాగిస్తున్నారనే విమర్శ ఉంది. ప్రధానంగా శానిటేషన్, రెవెన్యూ, ఇంజనీరింగ్, అకౌంట్స్, ఐటీ, ఎన్నికలు, పరిపాలన విభాగాల్లో ఔట్సోర్సింగ్ సిబ్బంది పెత్తనం అధికమైందని తెలుస్తోంది. ఈనేపథ్యాన కమిషనర్‌గా విధుల్లో చేరిన అభిషేక్ అగస్త్య తొలుత కార్యాలయ ప్రక్షాళన నుంచే తన పని ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు.అంతా అక్కడి నుంచే..కేఎంసీలో ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది కొరత కారణంగా పలువురిని ఔట్సోర్సింగ్ విధానంలో నియమించారు. వీరిలో కొందరికి కంప్యూటర్ ఆపరేటర్లుగా హోదా కల్పించి విభాగాలకు అప్పగించారు. ఇందులో పలువురు అధికారులు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ బృందంగా ఏర్పడి కార్యాలయంలో తమకంటూ ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేసుకున్నారు.రెవెన్యూ, గ్రీవెన్స్, కమిషనర్ పేషీ, సిస్టమ్ మేనేజర్ విభాగాలకు చెందిన కంప్యూటర్ ఆపరేటర్లు సాంకేతిక విభాగం పేరుతో అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు. వారి కి నచ్చిన ఫైళ్లను పరిష్కరిస్తూ.. ఇతరులవి పక్కన పెడుతున్నారనే విమర్శలు చాన్నాళ్లుగా ఉన్నాయి. ఏళ్ల తరబడి వీరంతా అదేవిభాగాల్లో పనిచేస్తుండడంతో అజమాయిషీ కరువవగా.. విభాగాల్లో కాకుండా అంతా ఒకేచోటకు చేరడంతో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.పాతుకుపోయారు..కేఎంసీలో రెవెన్యూ, శానిటేషన్, టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్, ఎస్టాబ్లిష్మెంట్ విభాగాల్లో ఉద్యోగులు, అధికారులు ఏళ్ల తరబడి పాతుకుపోయి ఉన్నారు. ఇటీవల కొందరి విభాగాలు మార్చినప్పటికీ ఉద్యోగుల తీరు మాత్రం మారలేదని తెలుస్తోంది. కొందరు ఉద్యోగులు చెప్పా పెట్టకుండానే విధులకు గైర్హాజరు కావడం పరిపాటిగా మారిందని సమాచారం. ఈ నేపథ్యాన నగరాభివృద్ధి ఎంత ముఖ్య మో... కార్యాలయాన్ని ప్రక్షాళన చేయడం కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని కొత్త కమిషనర్ గుర్తించాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి.విధుల్లో చేరిన కమిషనర్ అభిషేక్ అగస్త్యఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా అభిషేక్ అగస్త్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి అదనపు కలెక్టర్‌గా ఉన్న ఆయనను కమిషనర్‌గా బదిలీ చేయగా విధుల్లో చేరారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం మేయర్ పునుకొల్లు నీరజను కమిషనర్ మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు.ఆ తర్వాత కమిషనర్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాల అధికారులతో సమావేశమై ప్రస్తుతం జరుగుతున్న పనులపై ఆరా తీశారు. అలాగే, అకౌంట్స్ విభాగం అధికారితో సమావేశం సందర్భంగా కేఎంసీలో నిధుల నిల్వలు, పెండింగ్ బిల్లులపై చర్చించారు. మధ్యాహ్నం నగరంలోని బోనకల్ రోడ్డు, మమత రోడ్డు మార్గాల్లో కమిషనర్ అభిషేక్ పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ రంజిత్‌కుమార్, అసిస్టెంట్ కమిషనర్ ఏ.సంపత్‌కుమార్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, డీఈలు, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ వసుంధర తదితరులు పాల్గొన్నారు.కేఎంసీనా.. సాఫ్ట్వేర్ కంపెనీయా?కార్పొరేషన్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ల సంఖ్యను చూస్తే ఓ సాఫ్ట్వేర్ కంపెనీని తలదన్నేలా ఉంటుంది. ఒక్కో విభాగంలో ఇద్దరి నుంచి నలుగురు, ఐదుగురు వరకు ఆపరేటర్లను నియమించగా.. వీరు పనిచేయడం కన్నా బయట తిరగడం పైనే శ్రద్ధ వహిస్తారనే విమర్శలున్నాయి. ఎక్కడా ఏ కార్యాలయంలో లేని విధంగా కేఎంసీలో 23 మంది వరకు కంప్యూటర్ ఆపరేటర్లను నియమించగా పలువురికి కనీస కంప్యూటర్ పరిజ్ఞానం లేదని తెలుస్తోంది.అయినా రాజకీయ పలుకుబడితో ఇతర విధుల్లో చేరి కంప్యూటర్ ఆపరేటర్లుగా పేర్లు నమోదు చేయించుకున్నారని సమాచారం. కాస్త పరిజ్ఞానం ఉన్న వారు అధికారులను ఏమారుస్తుంటే.. ఏ మాత్రం నైపుణ్యం లేని సిబ్బంది ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి నెట్టుకొస్తున్నారని తెలుస్తోంది. ఇంతమంది ఉన్నప్పటికీ ప్రత్యేక అవసరాల సమయాల్లో మాత్రం రోజువారీ వేతనంపై బయట నుంచి ఆపరేటర్లను తీసుకొస్తుండడం గమనార్హం. -
అక్రమ లేఅవుట్ తయారు చేసి.. 10 శాతం మింగేశారు..
నిజామాబాద్‌నాగారం : నిజామాబాద్ మున్సిపాలి టీ పరిధిలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.. గజం భూమి రూ. వేల నుంచి రూ. లక్షల్లో పలుకుతుంది.. దీంతో చాలామంది వ్యవసాయభూములను వెంచర్లుగా మార్చేసి ప్లాట్లు చేసి క్రయవిక్రయాలు జరుపుతున్నారు. నగరంలోని మానిక్ భండార్ ప్రాంతం ఆర్టీసీ కాలనీ పద్మావతినగర్‌లో రెండు ఎకరాల్లో వెంచర్ వేశారు. భూములకు ధరలకు డిమాండ్ రావడంతో ఇదే అదనుగా పార్కుకు వదిలేసిన 10 శాతం భూమిలోనూ ప్లాట్లు చేసి మరీ సొమ్ముచేసుకున్నారు. ఈ విషయం తెలిసిన మున్సి పల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు పెద్ద ఎత్తున కాసు లు దండుకొని వెంచర్ నిర్వాహకుడికి సహకరించా రని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయమై 2018 నుంచి జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ల కు రాతపూర్వకంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా స్పందించకపోవడం గమనార్హం. దొంగ లేఅవుట్ తయారు చేసి.. మానిక్ భండార్ ప్రాంతంలోని పద్మావతి నగర్లో ఓం నారాయణ అట్టల్ అనే వ్యక్తి తనకు సంబంధించిన 2.02 ఎకరాల భూమిలో 2003 సంవత్సరంలో ఎల్‌పీనంబర్ 8/2003/ HRO/ H1లో వెంచర్ వేశారు. నిబంధనల ప్రకారం డీటీసీపీ అనుమతి తీసుకొని 32 ప్లాట్లు చేశారు. ఇందులో 10 శాతం భూమి అనగా సుమారు 1,200 గజాల భూమి పార్కు కోసం కేటాయించాలి. అయితే ఇదే ఎల్‌పీనంబర్‌తో నిజామాబాద్ మున్సిపాలిటీలో అక్రమ లేఅవుట్ తయా రు చేయించారు. 10 శాతం భూమిలో 6 ప్లాట్లు చేసి అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. అంతే గా కుండా ఒకే ప్లాట్‌ను ఇద్దరికి అమ్మిన వివాదాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతం గజం భూమి విలు వ సుమారుగా రూ. 20 వేలకు పైనే ఉంది. పా ర్కుకు సంబంధించిన స్థలం 1,200 గజాల్లో సు మారు 700 గజాల భూమిని అమ్మేసి సొ మ్ము చేసుకున్నారు. మిగత 500 గజాల భూమికి స్థానికులు, సామాజిక కార్యకర్తలు పట్టుబట్టి మున్సిపల్ అధికారులతో పోరాటాలు చేసి కంచె ఏర్పాటు చేయించారు. ఫిర్యాదులు.. చెత్తబుట్టలోకే... వెంచర్ నిర్వాహకుడి అక్రమాలను గుర్తించిన స్థానికులు, మరో సామాజిక కార్యకర్త చంద్రప్రకాష్ మోదానీ నేరుగా 2018 సంవత్సరం నుంచి మాక్లూర్ మండల తహసీల్దార్‌కు, ఆర్డీవో, జిల్లా కలెక్టర్లకు, మున్సిపల్ కమిషనర్లకు రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. నాలుగేళ్లు పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు చెత్త బుట్టలో వేస్తూనే ఉన్నారు. పైగా ఫిర్యాదు చేసిన వ్యక్తిని వేధింపులను గురి చేయడంతో పాటు భయపెట్టడంతో బాధితుడు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల ఈ నెల 9న కూడా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపాయే.. మానిక్ భండార్ ప్రాంతంలోని పద్మావతి నగర్లో ఓం నారాయణ అట్టల్ అనే వ్యక్తి తనకు సంబంధించిన 2.02 ఎకరాల భూమిలో 2003 సంవత్సరంలో ఎల్‌పీనంబర్ 8/2003/HRO/1లో వెంచర్ వేశారు. నిబంధనల ప్రకారం డీటీసీపీ అనుమతి తీసుకొని 32 ప్లాట్లు చేశారు. ఇందులో 10 శాతం భూమి అనగా సుమారు 1,200 గజాల భూమి పార్కు కోసం కేటాయించాలి. అయితే ఇదే ఎల్‌పీనంబర్‌తో నిజామాబాద్ మున్సిపాలిటీలో అక్రమ లేఅవుట్ తయారు చేయించారు. 10 శాతం భూమిలో 6 ప్లాట్లు చేసి అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. అంతే గాకుండా ఒకే ప్లాట్‌ను ఇద్దరికి అమ్మిన వివాదాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతం గజం భూమి విలువ మారుగా రూ. 20 వేలకు పైనే ఉంది. పార్కుకు సంబంధించిన స్థలం 1,200 గజాల్లో సుమారు 700 గజాల భూమిని అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. మిగత 500 గజాల భూమికి స్థానికులు, సామాజిక కార్యకర్తలు పట్టుబట్టి మున్సిపల్ అధికారులతో పోరాటాలు చేసి కంచె ఏర్పాటు చేయించారు. -
అక్రమ నిర్మాణాలు కూల్చివేత
శ్రీరాంపూర్(మంచిర్యాల): శ్రీరాంపూర్ బస్టాండ్ ఏరియాలోని ఎన్‌హెచ్ 63 పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను సోమవారం మున్సిపల్ అధికారులు కూల్చివేయించారు. ఎన్‌హెచ్ అఽధికారుల ఆదేశాలతో నస్పూర్ మున్సిపల్ కమిషనర్ టీ.రమేశ్, సిబ్బందితో కలిసి జేసీబీలతో నిర్మాణాలను నేలమట్టం చేయించారు. మంచిర్యాల నుంచి శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు విస్తరణ పనులు ఆర్నెళ్లుగా నడుస్తుండటంతో ఇప్పటికే కొందరు రోడ్డుకు దగ్గరగా ఉన్న నిర్మాణాలను కూల్చివేసి వెనక్కి కట్టుకున్నారు. కొంతమంది నిర్ణీత దూరం జరగకుండానే కొత్త నిర్మాణాలు చేపట్టారు. వీటిని తొలగించాలని మూడు రోజుల నుంచి మున్సిపల్, ఎన్‌హెచ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో పోలీసు బందోబస్తు నడుమ జేసీబీలతో కూల్చివేశారు. రోడ్డు మధ్యభాగం నుంచి 66 ఫీట్ల వరకు రోడ్డు మార్కింగ్ చేసి ఆ పరిధిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు. వర్తకుల అభ్యంతరం.. గతంలో రోడ్డు మధ్యలో నుంచి 60 ఫీట్లు మార్కింగ్ చేశారని, ఇప్పుడు 66 ఫీట్లు జరగాలని చెప్పి కొత్తగా కట్టుకున్నవి కూడా కూల్చివేస్తున్నారని కొందరు వర్తకులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు నిర్వహించారు. -
వ్యర్థం.. మరొకరికి ఉపయోగం
మంచిర్యాలటౌన్: మున్సిపాలిటీల్లో ప్రతీ శనివారం ‘పునరాలోచన దినం’ పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం. నిర్ణయించింది. ఈమేరకు అన్ని పురపాలికలకు తాజాగా ఆదేశాలందాయి. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు పాతవస్తువులను సేకరించి అవసరమైన వారికి ఉచితంగా అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీల్లో పేరుకు పోతున్న చెత్తాచెదారం తొలగించడంతోపాటు, ఇళ్లల్లో నిరుపయోగంగా ఉంటున్న వస్తువులను సేకరించి స్వచ్ఛతను సాధించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆర్ఆర్ఆర్ పేరుతో ప్రజల్లోకి వెళ్లి పాత దుస్తులు, పుస్తకాలు సేకరించి ఆర్ఆర్ఆర్ కేంద్రాల్లో భద్రపరుస్తారు. ఈమేరకు రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్(ఆర్ఆర్ఆర్) పేరిట కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని గతనెల 15వ తేదీ నుంచి ఈ నెల 5వ తేదీ వరకు 20 రోజులపాటు అధికారులు వార్డుల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మరొకరికి ఉపయోగం ప్రజల నుంచి వీలైనంత వరకు చెత్తను సేకరించేలా పలు కార్యక్రమాలు చేపడుతుండగా, సేకరించిన పనికిరాని వస్తువులను, వాడని పాత వస్తువులను అవసరమైన వారు వినియోగించుకునేలా ప్రతీ మున్సిపాలిటీలో ఆర్ఆర్ఆర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా స్వచ్ఛత అవార్డుల్లో పోటీ పడేందుకు జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల మెప్మా సిబ్బంది, మున్సిపల్ అధికారులు కృషి చేస్తున్నారు. ప్రతీ శనివారం రీథింక్ డే(పునరాలోచన దినం)గా పాటించాలని నిర్ణయించారు. ఇలా సేకరించిన వస్తువులను నిర్వాహకులు పేదలకు పంపిణీ చేస్తారు. సేకరించిన వస్తువుల వివరాలను సేకరించిన వారి చిరునామాను కేంద్రంలోని (తగ్గింపు) దస్త్రాల్లో నమోదు చేస్తారు. చిత్తుకాగితాలు ఉంటే వాటిని డంపింగ్ యార్డుకు తరలిస్తారు. స్వయం సహాయక సంఘాల కీలకపాత్ర ఆర్ఆర్ఆర్ కేంద్రాల నిర్వహణలో స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయిదారు వార్డులకు కలిపి ఒక చోట కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రంలో 10 మంది సభ్యులున్నారు. వారు ఇంటింటికీ వెళ్లి స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, యువజన సంఘాలు, వార్డు కమిటీలు భాగస్వామ్యం అయ్యేలా అధికారులు అవగాహన కల్పిస్తారు. మెప్మా ఆర్పీల సహకారం, మున్సిపల్ కార్మికులతో కలిసి మున్సిపల్ అధికారులు వార్డుల్లో శుభ్రత యొక్క ప్రాముఖ్యతను వివరించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరుచేసి ఇవ్వడంపై ప్రజలకు తెలియజేస్తున్నారు. శ్రీమేరా లైఫ్... మేరా స్వచ్ఛ షెహర్శ్రీ పేరిట ఆర్ఆర్ఆర్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే కార్యక్రమాల్లో స్వచ్ఛ ర్యాంకులను సాధించేందుకు అవకాశం ఉంది. -
పాచిపోయిన పదార్థాలు.. పురుగుల బిర్యానీ!
నల్లగొండ టూటౌన్ : ఘుమఘుమ వాసన ... ఆహా ఏమి రుచి .. చికెన్ లెగ్ పీస్ సూపర్ ... చికెన్ 65 యమ రుచి అంటూ తింటున్న భోజన ప్రియులు.. ఆయా హోటళ్లలో జరుగుతున్న తతంగం చూస్తే కంగు తినాల్సిందే. వేడి, వేడి వంటకాలు, హైదరాబాద్ బిర్యానీ, దమ్, స్పెషల్ బిర్యానీలని చెబుతూ జనం చెవిలో పూలు పెడుతున్నారు జిల్లాకేంద్రంలోని పలు హోటళ్ల నిర్వాహకులు. ఎంచక్కా తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ జనాన్ని అనారోగ్యం పాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లలో కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, పురుగుల బిర్యానీ, మూడు, నాలుగు రోజుల కిందట మిగిలిపోయిన ఆహార పదార్థాలు వడ్డిస్తున్న వైనం బయట పడింది. నల్లగొండలోని పలు హోటళ్లలో మున్సిపల్ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేయడంతో నిర్ఘాంత పోయే ఉదంతాలు వెలుగు చూశాయి. హోటళ్లలో వండి వడ్డిస్తున్న ఆహార పదార్థాలను చూసి మున్సిపల్ అధికారులు సైతం కంగుతిన్నారు. బావర్చిలో పాచిపోయిన పదార్థాలు ! నల్లగొండ పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న బావర్చి హోటల్లో ఆహారపదార్థాలు అన్నీ పాచి పోయి, కుళ్లిపోయినవే ఉన్నాయి. మూడు, నాలు గు రోజులుగా మిగిలిపోయిన చికెన్ కూర, తిన్న తరువాత మిగిలిన వాటిని సైతం ఓ గిన్నెలో వేసి పెట్టారు. మున్సిపల్ అధికారులు తనిఖీ చేసిన అన్ని ఆహార పదార్థాలు కుళ్లిపోయినవే ఉన్నాయి. హైదరాబాద్ రోడ్డులోని ప్రసాద్ ఉడిపి హోటల్లో సైతం పాచిపోయిన కూరలే పెడుతున్నారు. ఎంతో పేరున్న హోటల్లో కూడా మిగిలిపోయిన వాటిని మరుసటి రోజు వినియోగదారులకు పెట్టి సొమ్ము చేసుకుంటుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెస్టారెంట్లలోనూ ఇదే తంతు జిల్లా కేంద్రంలోని హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. హోటళ్లతో పాటు బార్ అండ్ రెస్టారెంట్లలోనూ పాచిపోయిన ఆహార పదార్థాలే పెడుతున్నట్లు తెలిసింది. మందు ప్రియులు కొద్దిగా మత్తులోకి జారుకోగానే పాచిపోయిన చికెన్ కూరలు, లెగ్ పీస్‌లు, ఆ తరువాత బిర్యానీలు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా రెస్టారెంట్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను పడవేయకుండా దాచి పెట్టి వాటినే మరుసటి రోజు వేడి చేసి పెడుతున్న సమయంలో కొంత మంది వినియోగదారులు గుర్తించి హోటల్ యజమానులతో ఘర్షణలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. పురుగులుంటే తీసేసి తినండి.. పురుగులు ఉంటే తీసేసి తినండి ... ఇంట్లో వస్తే ఏం చేస్తాం, ఇక్కడా అంతే అంటూ ఓ హోటల్ యజమాని బుకాయించడంతో వినియోగదారునికి సదరు యజమానితో ఘర్షణ చోటు చేసుకుంది. నల్లగొండలోని మేళ్లదుప్పలపల్లి స్టేజీ సమీపంలో ఉన్న ఓ హోటల్లో ఓ కుటుంబం పూరీలు తింటుండగా పప్పుకూరలో పురుగులు వచ్చాయి. దీంతో సదరు వినియోగదారుడు పురుగుల విషయంపై హోటల్ యజమానిని నిలదీయడంతో అతడు ఎదురుదాడికి దిగాడు. పురుగుల వస్తుంటాయి..అవసరమైతే తీసేసి తినండి అనడంతో వినియోగదారుడు అసహనంతో అధికారులకు ఫిర్యాదు చేశాడు. తనిఖీలు కరువు హోటళ్లలో ఆహార పదార్థాలపై తనిఖీలు కరువయ్యాయి. సాధారణంగా ఫుడ్ ఇన్స్పెక్టర్తోపాటు మున్సిపాలిటీనుంచి శానిటేషన్ విభాగం వారు తనిఖీలు చేయాలి. కానీ రెండు చోట్ల సిబ్బంది లేరు. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఒక్కడే ఉన్నాడు. ఆయన ఇతర కేసులకు సంబంధించి కోర్టుల చుట్టూ ఒక్కడే తిరుగుతుంటారు. దానికే ఆయనకు సమయం సరిపోతుంది. దీంతో హోటళ్లలో తనిఖీలు చేపట్టని పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీ శానిటేషన్ విభాగంలో నలుగురు ఉండాల్సి ఉంది. కానీ ఇద్దరే ఉన్నారు. -
ఎంత కష్టపడుతున్నా.. అభినందనల్లేవు: కేటీఆర్
హైదరాబాద్: 2019 ఎన్నికల్లోనూ తెలంగాణలో టీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు కూడా సీఎం కేసీఆర్ నాయకత్వం వహిస్తారని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన శనివారం మీడియాతో ముచ్చటించారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటు ఆధారంగానే మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని, వాటిని మతపరమైన రిజర్వేషన్లుగా చూడొద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. ఆ దిశగా లబ్ధిపొందే ప్రయత్నం ఎవరూ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. విభజన బిల్లు ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు సాధ్యమవుతుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి తాము ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తామన్నారు. 20 ఏళ్ల తర్వాత అసెంబ్లీ వేదికగా పద్దులపై చర్చ జరిగిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ శాఖమంత్రిగా తాను శక్తివంచన లేకుండా ఎంతో కష్టపడుతున్నానని, మున్సిపల్‌శాఖలో ఎంతో కష్టపడ్డా అభినందనలు దొరకవని మంత్రి కేటీఆర్ చమత్కరించారు.