ఎంత కష్టపడుతున్నా.. అభినందనల్లేవు: కేటీఆర్‌ | minister KTR chitchat with media | Sakshi
Sakshi News home page

ఎంత కష్టపడుతున్నా.. అభినందనల్లేవు: కేటీఆర్‌

Published Sat, Mar 25 2017 2:07 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

ఎంత కష్టపడుతున్నా.. అభినందనల్లేవు: కేటీఆర్‌ - Sakshi

ఎంత కష్టపడుతున్నా.. అభినందనల్లేవు: కేటీఆర్‌

హైదరాబాద్‌: 2019 ఎన్నికల్లోనూ తెలంగాణలో టీఆర్‌ఎస్సే అధికారంలోకి వస్తుందని మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు కూడా సీఎం కేసీఆర్‌ నాయకత్వం వహిస్తారని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన శనివారం మీడియాతో ముచ్చటించారు.

సామాజిక, ఆర్థిక వెనుకబాటు ఆధారంగానే మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని, వాటిని మతపరమైన రిజర్వేషన్లుగా చూడొద్దని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఆ దిశగా లబ్ధిపొందే ప్రయత్నం ఎవరూ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. విభజన బిల్లు ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు సాధ్యమవుతుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి తాము ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తామన్నారు. 20 ఏళ్ల తర్వాత అసెంబ్లీ వేదికగా పద్దులపై చర్చ జరిగిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ శాఖమంత్రిగా తాను శక్తివంచన లేకుండా ఎంతో కష్టపడుతున్నానని, మున్సిపల్‌శాఖలో ఎంతో కష్టపడ్డా అభినందనలు దొరకవని మంత్రి కేటీఆర్‌ చమత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement