సాక్షి, హైదరాబాద్: భూకబ్జాదారుల గుండెల్లో హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) గుబులు పుట్టిస్తోంది. హైడ్రా కమిషనర్ ఎ.వి రంగనాథ్ ‘సాక్షి’ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. హైడ్రాకు నోటీసులు ఇవ్వాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.
‘‘హైడ్రాకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. రాజకీయంగా ఎవరిపైనా కక్ష సాధించాల్సిన అవసరం మాకు లేదు. కాంగ్రెస్ నాయకులు కబ్జా చేసినట్లు సమాచారం ఉంటే ఇవ్వండి. వాటిని కూడా కూల్చేస్తాం. హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణ వల్లే వరదలు. మూడు నాలుగేళ్లలో చెరువుల ఆక్రమణ భారీగా పెరిగింది.’’ అని హైడ్రా కమిషనర్ పేర్కొన్నారు.
స్కూల్స్, కాలేజీల విషయంలో ఆక్రమణలు రుజువైతే చర్యలు ఎప్పుడు ఉంటాయి?. ఓవైసీ కాలేజీని కూల్చేస్తారా?. రాజకీయంగా ఎలాంటి ఒత్తిడి ఉంది. నాగార్జున ఆక్రమణలు చేశారా? కూల్చివేతల అంశంలో పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారాయన. హైడ్రాపై పలు సందేహాలను రంగనాథ్ నివృత్తి చేశారు.
హీరో నాగార్జున సినిమాలు చూస్తానన్న ఆయన.. ఇంకా ఏమన్నారో.. పూర్తి ఇంటర్వ్యూలో చూడొచ్చు..
Comments
Please login to add a commentAdd a comment