ఉద్యమ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్
ఖమ్మంసిటీ: జిల్లాలో మొదటి విడతగా సోమవారం మున్సిపాలిటీల్లో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతమైంది. ఉద్యమస్ఫూర్తితో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు భాగస్వాములయ్యూరు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె ఇలంబరితి, ఎస్పీ ఏవీ రంగనాథ్, జడ్పీ చైర్ పర్సన్ గడపల్లి కవిత పాల్గొన్నారు. కలెక్టర్, ఎస్పీ కార్పొరేషన్ సహ కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు మున్సిపాలిటీల్లో పర్యటించి సందర్శించి స్ఫూర్తి నింపారు. ఖమ్మం నగరంలోని సారధి నగర్‌లో, కలెక్టర్ నివాసం వెనుక ఉన్న గోళ్లపాడు చానల్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు.
కలెక్టర్, ఎస్పీ, జడ్పీ చైర్ పర్సన్, స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొన్నారు. గోళ్లపాడు చానల్‌లో సమారు కిలోమీటర్ మేర సిల్ట్ తొలగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలంబరితి మాట్లాడుతూ మొదటి విడతగా మున్సిపాలిటీల్లో, రెండో విడతగా పంచాయతీల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్‌లో పారిశుధ్య పనలకు 15 ట్రాక్లర్లను వినియోగించాలని అధికారులను ఆదేశించారు. మురుగు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గోళ్లపాడు చానల్ ఆక్రమణపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎస్పీ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ మనసు స్వచ్ఛంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా మొదటి అదనపు జడ్జి చిరంజీవి రావు మాట్లాడుతూ మన బాధ్యతలను గుర్తెగాలని సూచించారు.
జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత మాట్లాడుతూ ఇదో బృహత్తర కార్యక్రమమని, ఇందుకు కేంద్రం రూ. 20 వేల కోట్లు కేటారుుంచిందని చెప్పారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఖమ్మాన్ని స్మార్ట్ సిటీగా ఎంపిక చేసి రూ. వెరుు్య కోట్లు కేటారుుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్పొరేషన్‌లో సిబ్బంది కొరత తీర్చాలన్నారు. కార్పొరేషన్ ఇన్‌చార్జి కమిషనర్ వేణు మనోహర్ మాట్లాడుతూ సుమారు 23 జేసీబీ, 191 ట్రాక్టర్లతో పూడిక తీత పనులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలో ఒక్కరోజే 1928 టన్నుల చెత్త తరలించామని, 88 కిలో మీటర్ల మేర డ్రెరుున్లలో సిల్ట్ తొలగించామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు సాధు రమేష్‌రెడ్డి, తోట రామారావు, కొత్తగుండ్ల శ్రీలక్ష్మి, డీఎస్పీ బాలకిషన్‌రావు, మత్స్యశాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.