ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్: పోలీసు సేవలు మరింత విసృ్తతపరిచే లక్ష్యంతో ప్రతి గ్రామానికి విలేజ్ పోలీసు అధికారిగా పోలీసు సిబ్బందిని నియమించనున్నట్లు జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు. బుధవారం ఎస్‌బీ సమావేశ మందిరంలో వరకట్న వేధింపు ల కేసులు, కేసుల ఛేదనలో సెల్‌ఫోన్ నెట్ వర్కింగ్, విలేజ్ పోలీసింగ్‌పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అవసరమైన ముందస్తు సమాచారాన్ని ఎప్పటికప్పడు సేకరించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడవల్సిన బాధ్యత విలేజ్ పోలీసు అధికారిపై ఉంటుందని అన్నారు. పోలీసు అధికారులు గ్రామల్లో జరిగే పలు కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకు వెళ్లాలని చెప్పారు. పారదర్శకతతో వ్యవహరించి ప్రజల్లో గుర్తింపు పొందాలని సూచించారు. వరకట్నం వేధింపుల కేసుల్లో రెండు విధాలా నష్టపోతున్నామనే భావన బాధితుల్లో నెల కొంటోందని, పెళ్లి సమయంలో ఇచ్చిన కట్న కానుకలను తిరిగి భర్త నుంచి పొందే విధానంపై, కోర్టు ద్వారా ఆస్తుల అటాచ్‌మెంట్‌పై వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సెల్‌ఫోన్‌వాడకం సర్వసాధారణమైందని, పలు కేసుల్లో సెల్‌ఫోన్ నెట్‌వర్కింగ్ కీలకమైందనితెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ లు బాలకిషన్‌రావు, కృష్ణ, అశోక్‌కుమార్, భాస్కర్‌రావు, రవీందర్, ఎస్‌బీఐ వెంకట్రావు, డీసీఆర్‌బీ సీఐ అంజలి, లీగల్ అడ్వైజర్ తుమ్మలపల్లి విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసు సేవలు మరింత విసృ్తతం
Published Thu, Jan 9 2014 4:27 AM | Last Updated on Mon, Sep 17 2018 6:20 PM
Advertisement
Advertisement