తన కూతురు షెడ్యూల్డ్ కులానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కసితోనే మిర్యాలగూడకు చెందిన రియల్టర్ తిరునగరు మారుతీరావు భారీ స్కెచ్ వేసి ప్రణయ్‌ను తుదముట్టించాడని తెలుస్తోంది. ఈ హత్య వెనుక మాజీ ఉగ్రవాది మహ్మద్ బారీ హస్తం ఉన్నట్లు సమాచారం. రెండు రోజులుగా పోలీసులు పూర్తిగా ఈ కేసు విచారణ సాగిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రణయ్ హత్య జరి గిన తర్వాత సాయంత్రానికల్లా ప్రధాన నిందితుడు మారుతీరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వివరాలన్నీ దాదాపు సేకరించామని అధికారులు చెబుతున్నారు.
ప్రణయ్ హత్య వెనుక మాజీ ఉగ్రవాది
Published Mon, Sep 17 2018 12:39 PM | Last Updated on Wed, Mar 20 2024 3:35 PM
Advertisement
Advertisement
Advertisement