హైడ్రా అంటే కేవలం కూల్చివేతలే కాదు! | HYDRA Boss AV Ranganath again Clarity On Its Duties and Functionaries | Sakshi
Sakshi News home page

హైడ్రా అంటే కేవలం కూల్చివేతలే కాదు!

Published Mon, Sep 30 2024 5:27 PM | Last Updated on Mon, Sep 30 2024 7:53 PM

HYDRA Boss AV Ranganath again Clarity On Its Duties and Functionaries

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన వేళ.. హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ మరోసారి ఆ విభాగం పని తీరుపై స్పష్టత ఇచ్చారు. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలు మాత్రమే కాదన్న ఆయన.. ప్రజలతో పాటు సామాజిక మాధ్యమాలు కూడా వాస్తవాలను తెలుసుకోవాలని కోరుతున్నారు.

‘‘మూసీ న‌దికి ఇరువైపులా స‌ర్వేల‌తో  హైడ్రాకు సంబంధం లేదు. అక్క‌డి నివాసితుల‌ను హైడ్రా త‌ర‌లించ‌డం లేదు. అక్క‌డ ఎలాంటి కూల్చివేత‌లు హైడ్రా చేప‌ట్ట‌డం లేదు. మూసీ ప‌రీవాహ‌క ప్రాంతంలోని ఇళ్ల‌పై హైడ్రా మార్కింగ్ చేయ‌డం లేదు. మూసీ సుంద‌రీక‌ర‌ణ ప్ర‌త్యేక ప్రాజెక్టు. దీనిని మూసీ రివ‌ర్‌ఫ్రంట్  డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చేప‌డుతోంది’’ అని ఎక్స్ వేదిక ద్వారా తెలియజేశారు. అలాగే..

‘‘హైడ్రా అంటే కూల్చివేత‌లే కాదు. హైడ్రా ప‌రిధి ఔట‌ర్ రింగు రోడ్డు వ‌ర‌కే. న‌గ‌రంలోనే కాదు.. రాష్ట్రంలో.. ఆఖ‌రుకు ఇత‌ర రాష్ట్రాల్లో కూల్చివేత‌లు కూడా హైడ్రాకు ఆపాదించి సామాజిక మాధ్య‌మాల ద్వారా ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నాయి. హైడ్రా పేద‌ల నివాసాల జోలికి వెళ్ల‌దు. అలాగే నివాసం ఉంటే  ఆ ఇళ్ల‌ను కూల్చ‌దు.  కూల్చివేత‌ల‌న్నీ హైడ్రావి కావు.  ప్ర‌జ‌లు,  సామాజిక మాధ్య‌మాలు ఈ విషయాన్ని గుర్తించాలి.

.. హైడ్రా ప్రధాన విధి ప్ర‌కృతి వ‌న‌రుల ప‌రిర‌క్ష‌ణ‌.  చెరువులు, కుంట‌లు, నాలాలను కాపాడ‌డం, వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ర‌హ‌దారులు, నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చ‌ర్య‌లు తీసుకోవడం’’ అని హైడ్రా కమిషనర్‌ స్పష్టం చేశారు. చేశారు.

సంబంధిత వార్త: ఎవరిని మెప్పించడం కోసం  ఈ దూకుడు?.. తెలంగాణ హైకోర్టు సీరియస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement