సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మూసీ, హైడ్రాపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మూసీ ప్రక్షాళన సమాజ శ్రేయస్సు కోసమేనని భట్టి చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో మూసీ సుందరీకరణ విషయంలో ఎవరికీ వ్యక్తిగత ఎజెండాలు లేవు అంటూ కామెంట్స్ చేశారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం సెక్రటేరియట్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘చెరువుల ఆక్రమణ హైదరాబాద్‌కు పెను ప్రమాదకరంగా మారనుంది. హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా చెరువులు మాయం అవుతున్నాయి. మూసీ, హైడ్రాపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు. హైదరాబాద్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది రాక్స్, లెక్స్ అండ్ పార్క్స్. కాలక్రమేనా పార్క్స్ అండ్ లేక్స్ కబ్జాలకు గురి అయ్యాయి.
చిన్న వర్షం పడితేనే ఇళ్లల్లోకి నీళ్లు వస్తున్నాయి. మూసీ ప్రక్షాళన సమాజ శ్రేయస్సు కోసమే. మూసీపై ప్రజలకు కొందరు భ్రమలు కల్పిస్తున్నారు. తప్పుడు ఆరోపణలతో ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు. 2014కు ముందు 2024 వరకు కబ్జాకు గురైన చెరువులపై సర్వే చేశారు. హైదరాబాద్‌లో 20 పార్కులు పూర్తిగా కబ్జా అయ్యాయి. మూసీ సుందరీకరణ విషయంలో ఎవరికీ వ్యక్తిగత ఎజెండాలు లేవు. చెరువులు కబ్జా కాకూడదు అనేదే మా ఆలోచన. మాది ప్రజా ప్రభుత్వం. ప్రజల ఎజెండా మాత్రమే కానీ.. వ్యక్తిగత ఎజెండాలు లేవు.
మన ఆస్తులు మనకు కావాలి.. కాపాడుకోవాలి అని తెలంగాణ తెచ్చుకున్నాం. కోరి కొడ్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని సురక్షితంగా కాపాడుకునే బాధ్యత మనమీద ఉంది. గత పాలకులు బాధ్యత లేకుండా పాలన చేశారు. కబ్జాకు గురైన కట్టడాలను కూల్చాలని కేటీఆర్, హరీష్ అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు వక్రీకరిస్తున్నారు. మూసీ బాధితులకు ఆదుకుంటాం. ఇళ్లకు ఇండ్లు ఇచ్చే బాధ్యత మాది. మూసీ బాధితులను ఆదుకునేందుకు మా తలుపులు తెరిచే ఉన్నాయి. మూసీ గర్భం, ఎఫ్‌టీఎల్ వరకు మాత్రమే వెళ్తున్నాం.. బఫర్ జోన్ జోలికి వెళ్ళడం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: జీహెచ్‌ఎంసీ ఆఫీసు కూల్చేస్తారా?: ఎంపీ అసద్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment