సాక్షి, హైదరాబాద్: నగరంలో చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపే లక్ష్యంగా హైడ్రా దూసుకుపోతోంది. అక్రమ నిర్మాణాలపై హైడ్రా రోజు రోజుకి మరీంత దూకుడుగా వ్యవహారిస్తుంది. ఇక, తాజాగా మూసీ పరివాహక ప్రాంతంపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైడ్రా అధికారులు ఇప్పటికే 1350 మందికి నోటీసులు జారీ ఇచ్చారు. మరోవైపు.. ప్రభుత్వం వారికి పునరావాసం కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
మూసీ నదిలో ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. గోల్నాక, చాదర్ ఘాట్, మూసారంబాగ్ ఏరియాల్లో మూసీ ఆక్రమణల కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే శని, ఆదివారాల్లో భారీగా మూసీ ఆక్రమణల కూల్చివేతలు కొనసాగించనుంది. రెండు రోజుల్లోనే అక్రమ నిర్ణయాలను కూల్చివేయాలని నిర్ణయం తీసుకుంది. డే అండ్ నైట్ కూల్చివేతలు చేసేలా హైడ్రాకు అదనంగా సిబ్బందిని నియమించుకుంది. ఇక, మూసీ పరివాహక ప్రాంతంలో ఇప్పటికే 1350 మందికి హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లోని ఇళ్లను హైడ్రా మార్క్ చేసింది.
మరోవైపు.. మూసీ నిర్వాసితులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే నేడు మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో మూసీ నివాసితుల ప్రాంతాలకు కలెక్టర్లు వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా బాధితుల వివరాలను హైడ్రా, రెవెన్యూ అధికారులు సేకరించనున్నారు. అలాగే, వారం రోజుల్లో ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగరంలో హైడ్రా ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే కూకట్‌పల్లి, అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలో ప్రభుత్వ భూములును అక్రమించి నిర్మించిన కోట్ల రూపాయాల విల్లాలను నేలమట్టం చేసింది. అంతకుముందు నాగార్జున ఎన్ కన్వెషన్ సహా పలు నిర్మాణాను కూల్చివేసింది.
ఇది కూడా చదవండి: ఫోన్‌ట్యాపింగ్‌పై స్పందించిన డీజీపీ
Comments
Please login to add a commentAdd a comment