విజయనగరం మున్సిపాలిటీ : తన దుకాణాన్ని తీసేశారని మనస్తాపానికి గురైన సంతోషి అనే మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించింది. ఈ సంఘటన విజయనగరం పట్టణంలో ఆక్రమణల తొలగింపులో భాగంగా బుధవారం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను పక్కకు తీసుకెళ్లి నచ్చజెప్పి ఆత్మహత్యాయత్నాన్ని ఆపారు. మున్సిపాలిటీ వాళ్లు అకారణంగా తన తొలగించారని ఆమె ఆరోపించింది.