Woman suicide attempt
-
న్యాయం కోసం చంద్రబాబు దగ్గరికి వస్తే..
తిరుపతి రూరల్: అయ్యా.. నా పరిశ్రమను నాశనం చేశారని, నాపై దౌర్జన్యం చేసి జాకెట్‌ను సైతం చించేశారు, పోలీసులు కూడా నాపై దాడిచేసిన వారికే వత్తాసు పలుకుతున్నారు, ముఖ్యమంత్రిగారికి నా బాధ చెప్పుకుంటానయ్యా.. అంటూ వచ్చింది ఓ మహిళ. అయితే ఆయన వ్యక్తిగత పర్యటన మీద వచ్చారని, ఎవరినీ కలవరంటూ ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతి జిల్లాలో చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో జరిగిందీ ఘటన. .. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన యశోద కుటుంబంతో కలిసి తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ పరిధిలో రాజేశ్వరరావు, సరోజినిదేవి దంపతుల నుంచి కొంతభూమి అద్దెకు తీసుకున్నారు. దాదాపు రూ.కోటి ఖర్చుతో ఎల్వీ పవర్‌లూమ్స్, హ్యాండ్లూమ్స్ పరిశ్రమను ఏర్పాటు చేశారు. హాథీరాంజీ మఠానికి చెందిన ఈ భూమి వివాదంలో ఉంది. ఈ భూమికి తామే యాజమానులమని, అద్దె తమకే చెల్లించాలని పలువురు బెదిరిస్తుండటంతో ఆమె కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. కోర్టు స్టే ఉన్నా రాజేశ్వరరావు, మరికొందరు కలిసి హ్యాండ్లూమ్స్ను ఖాళీచేయాలని దౌర్జన్యం చేస్తున్నారు. రూ.50 లక్షల విలువైన యంత్రాలను నాశనం చేశారు. కోర్టు స్టే ఉన్నా సామగ్రి ఎత్తుకెళ్లి ఆమెపై దాడిచేశారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు వచి్చన తనను తిరుపతి జిల్లా పోలీసులు అడ్డుకోవడమే కాకుండా దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం యశోద.. నారావారిపల్లికి వచ్చి సీఎం చంద్రబాబును కలవడానికి ప్రయత్నించింది. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ఏడుస్తూ.. ఆమె రోడ్డుపై బైఠాయించారు. సీఎం తనకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. చేతి గాజులు పగులుగొట్టుకుని వాటిని మింగేందుకు ప్రయత్నించారు. ఆమెను ఆపి బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు.మీడియాపైనా దౌర్జన్యం..ఈ ఘటనను ఫొటోలు, వీడియోలు తీస్తున్న మీడియా ప్రతినిధులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ఫోన్లు, కెమెరాలను లాక్కుని ఫొటోలు, వీడియోలను డిలీట్ చేశారు. దీనిపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టీడీపీ నేతల బెదిరింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం
ఒంగోలు టౌన్: ప్రేమపేరుతో వెంటపడి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఒక బాలికను గర్భిణిని చేశాడు దర్శి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడి కుమారుడు. తమకు న్యాయం చేయమంటూ వేడుకున్న బాధిత బాలిక కుటుంబ సభ్యులపై బెదిరింపులకు దిగడంతో భయాందోళనకు గురైన బాలిక తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బాధిత బాలిక తండ్రి కథనం ప్రకారం.. కావలికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె కావలిలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతుండగా, చిన్న కుమార్తె దర్శి సమీప గ్రామంలో అమ్మమ్మ దగ్గర ఉంటూ 7వ తరగతి చదువుకుంటోంది. కొద్దిరోజులుగా గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఏనిగంటి కోటేశ్వరరావు కుమారుడు వరుణ్ చౌదరి ప్రేమ పేరుతో బాలిక వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. శారీరకంగా లోబరుచుకొని గర్భిణిని చేశాడు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఆగస్టులో దర్శి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి వరుణ్ చౌదరిని అరెస్టు చేశారు.రూ.50 వేలు ఇస్తా తీసుకొని వెళ్లు ...బాలికను గర్భిణిని చేసిన వరుణ్ చౌదరి తండ్రి కొద్ది రోజులుగా రాజీ ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాడని బాలిక తండ్రి చెబుతున్నారు. రాజంపల్లికి చెందిన తెలుగుదేశం నాయకులను మధ్యవర్తులుగా రాయబారానికి పంపించాడన్నారు. వారి ద్వారా డబ్బులు ఇస్తానంటూ ఆశ పెట్టాడని, అయితే ఇందుకు అంగీకరించలేదని, తమకు డబ్బులు ఏమీ వద్దని, తమ కూతురిని పెళ్లి చేసుకోవాలని కోరామన్నాడు. దాంతో అగ్గిమీద గుగ్గిలమైన కోటేశ్వరరావు రూ.50 వేలు ఇస్తా, తీసుకొని పోండి. పెళ్లి అంటే ఎదురు కేసు పెట్టి బాలికను, బాలిక తల్లిని బజారుకీడుస్తానంటూ రెచ్చి పోయాడని ఆరోపించాడు. చెప్పినట్లు విని రాజీకి వస్తే సరేసరి లేకపోతే ఇబ్బందులు పడతావంటూ బెదిరింపులకు దిగాడన్నాడు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కావలిలో తన ఇంటిపై దాడి చేసి కొట్టారాని వాపోయాడు. కేసులో రాజీ పడాలని, లేకుంటే నిన్ను, నీ భార్యను చంపుతామని బెదిరించి వెళ్లారని ఆరోపించాడు. వెంటనే బాలిక తండ్రి కావలి వన్‌టౌన్ సీఐకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పామన్నాడు. వెంటనే ఎస్సై వచ్చి జరిగిన విషయం అడిగి తెలుసుకుని, చుట్టుపక్కల విచారించి వెళ్లారని తెలిపాడు.బాలిక తల్లి ఆత్మహత్యా యత్నం..ఈ ఘటనలతో బాలిక తల్లి భయాందోళనకు గురైంది. ఈ నెల 2వ తేదీ ఎలుకల మందు తిని ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను కావలి ఆస్పత్రికి తరలించి వైద్యం చేశారు. మెరుగైన చికిత్స కోసం శుక్రవారం ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆమెను ఎమర్జన్సీ వార్డులో ఉంచి కృతిమ శ్వాస అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని, లివర్ చెడిపోయిందని, ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోతున్నాయని, రక్తపోటు తరచుగా పడిపోతుందని వైద్యులు తెలిపారు. ఒకవైపున నిండా పద్నాలుగేళ్ల వయసు కూడా లేని కుమార్తె నిండు గర్భంతో ఉంది. చిన్న వయసు కావడంతో కాన్పు ప్రమాదం కావచ్చని, సిజేరియన్ చేసినా ప్రాణాలకు ముప్పు రావచ్చని వైద్యులు చెబుతున్నారని, మరోవైపు ఆత్మహత్యా యత్నం చేసిన భార్య చావు బతుకుల మధ్య పోరాడుతోందని బాలిక తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి అండ చూసుకునే కోటేశ్వరరావు రెచ్చి పోతున్నాడని ఆరోపిస్తున్నారు. -
బెదిరించేందుకు మహిళ..
పార్వతీపురం: కుటుంబసభ్యులను బెదిరించేందుకు సీతానగరం మండలం గుచ్చిమి గ్రామానికి చెందిన మండల అపర్ణ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భర్త రామకృష్ణ, అత్తమ్మ చూస్తుండగానే వారిని భయపెట్టేందుకు ఇంట్లో ఉన్న మాత్రలు ఒక్కసారిగా మింగేసింది. దీంతో కుటుంబసభ్యులు ఆటోలో ఆమెను చికిత్సకోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
పెళ్లి గొడవ... తల్లి ఆత్మహత్య.. కుమార్తె సాయిలీల ఆత్మహత్యాయత్నం
నెల్లిమర్ల రూరల్: నగర పంచాయతీ పరిధిలోని గాంధీనగర్ కాలనీకి చెందిన మహిళ వ్యక్తిగత కారణాలతో సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో విషయం తెలుసుకున్న మృతురాలి కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గాంధీనగర్ కాలనీకి యువతి బొట్టా సాయిలీల హైదరాబాద్‌లోని ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తోంది. తాను ఓ వ్యక్తిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని ఇటీవల ఆమె ఇంట్లో చెప్పింది. తల్లి సత్యవతి(45)కి ఈ విషయం నచ్చకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. దీంతో తల్లి సత్యవతి సమీపంలోని రైల్వేట్రాక్ వద్దకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు రైల్వేట్రాక్‌పై ఉన్న మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లి గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించారు. కాగా తల్లి ఆత్మహత్య చేసుకుందని విషయం తెలుసుకున్న కుమార్తె మనస్తాపం చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు అపస్మారక స్థితిలో ఉన్న సాయిలీలను చికిత్స నిమిత్తం స్థానిక మిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోర్టులో మహిళ షాకింగ్ ట్విస్ట్.. భర్త కోసం ఎంతకు తెగించిందంటే?
అన్నానగర్(తమిళనాడు): అరియలూరు కోర్టులో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. వివరాలు.. అరియలూరు జిల్లా సెందురై సమీపంలోని ఇడయకురిచ్చి గ్రామానికి చెందిన పురట్చీతమిళన్‌ను (27) ఇటీవల చైన్‌స్నాచింగ్ కేసులో ఇరులికురిచ్చి పోలీసులు అరెస్టు చేశారు. ఇతనిపై ఇప్పటికే జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో మొత్తం 11 దొంగతనాల కేసులు ఉన్నాయి. దీంతో ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో జిల్లా కలెక్టర్ రమణ సరస్వతి నిందితుడిపై గ్యాంగ్‌స్టర్ యాక్ట్ నమోదు చేయాలని అరియలూరు ఎస్పీని పెరోజ్ ఖాన్ అబ్దుల్లాను ఆదేశించారు. ఈ క్రమంలో కేసు విచారణ నిమిత్తం పురట్చీ తమిళన్‌ను మంగళవారం సెందురై కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చారు. అతడిని చూసేందుకు అతని భార్య కోర్టుకు వచ్చింది. ఆపై హఠాత్తుగా తన వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన పోలీసులు, న్యాయవాదులు వెంటనే మహిళను రక్షించి చికిత్స నిమిత్తం సెందురై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రసుత్తం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 17 ఏళ్ల వయసున్న ఆ వివాహిత తనకు భర్త మాత్రమే ఆధారమని, న్యాయం చేయాలని అధికారులను వేడుకోవడం గమనార్హం. చదవండి: ట్రాన్స్‌జెండర్ షాకింగ్ నిర్ణయం.. అసలు ఏం జరిగింది? -
భర్త నుంచి విడాకులు.. ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..
ఆకివీడు(పశ్చిమ గోదావరి): భర్త నుంచి కోర్టులో విడాకులు తీసుకుని, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోమని కోరగా, అతను నిరాకరించడంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కుప్పనపూడి గ్రామానికి చెందిన పుష్పలత అదే గ్రామానికి చెందిన ఎడమటి సతీష్‌ను ప్రేమించింది. ఇది తెలియని పెద్దలు ఆమెను భీమవరం మెంటేవారితోటకు చెందిన గెడ్డం ఏసురాజుతో గత ఏడాది అక్టోబర్ 28న వివాహం చేశారు. చదవండి: ఎంతపని చేశావ్.. ఎంత భార్యపై కోపం ఉంటే మాత్రం.. ఆమె ప్రేమ విషయం భర్త తెలుసుకుని కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. అనంతరం సతీష్‌ను పెద్దలు కలిసి పుష్పలతను పెళ్లి చేసుకోవాలని కోరగా, అతను నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన పుష్పలత ఈ నెల 3వ తేదీన ఎలుకల మందు తిని ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆకివీడులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. సోదరుడు మారంపూడి నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ భూషణం చెప్పారు. -
మహిళ ప్రాణాన్ని నిలిపిన పోలీసులు
సాక్షి, రామారెడ్డి(నిజామాబాద్): కుటుంబంలో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా, గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. సోమవారం రామారెడ్డి మండల కేంద్రం శివారులోని పెద్దమ్మ ఫంక్షన్ హాల్ సమీపంలో గల చెట్టుకు ఓ మహిళ ఉరి వేసుకునేందుకు యత్నిస్తోంది. అటు వైపు వెళ్తున్న ప్రొబేషనరీ ఎస్సై ఆదిల్, కానిస్టేబుల్ సిద్దిరాములు గమనించి హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆ మహిళను కాపాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల జిల్లా వీరన్నపల్లి గ్రామానికి చెందిన సులోచనగా ఆమెను గుర్తించారు. రామారెడ్డిలో ఉండే తన అన్న ఇంట్లో శుభకార్యం కోసం వచ్చానని, కుటుంబ సభ్యులతో జరిగిన గొడవ కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని ఆమె తెలిపారు. దీంతో ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చిన ప్రొబెషనరీ ఎస్సై.. కుటుంబ సభ్యులను పిలిపించి ఆమెను అప్పగించారు. చదవండి: పరిచయం ప్రేమగా మారింది, పెళ్లి చేసుకుంటానన్నాడు.. కానీ ఇద్దరిని కాపాడిన పోలీసులు.. నాలుగు రోజుల వ్యవధిలో ఇద్దరి ప్రాణాలను కాపాడారు రామారెడ్డి పోలీసులు. కుటుంబ తగాదాలతో నాలుగు రోజుల క్రితం గిద్ద చెరువు కట్టపై ఆత్మహత్యకు యత్నించిన మహిళను గమనించి పోలీసులు కాపాడారు. తాజాగా చెట్టుకు ఉరి వేసుకునేందుకు యత్నిస్తున్న మహిళను కూడా సంరక్షించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. చివరి క్షణాల్లో రెండు నిండు ప్రాణాలను కాపాడిన రామారెడ్డి పోలీసులు ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. -
రెండు నిండు ప్రాణాలను కాపాడిన దిశ యాప్
సాక్షి, విజయవాడ: దిశ యాప్ రెండు నిండు ప్రాణాలను కాపాడింది. బుధవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో విజయవాడకు చెందిన ఓ మహిళ తను ఆత్మహత్య చేసుకుంటున్నానని దిశ ఎస్ఓఎస్కు సమాచారం ఇచ్చింది. ప్రేమ పేరుతో నమ్ముకొని వచ్చిన అఖిల్ తనను మోసం చేయడంతో సమాజంలో ఎదురయ్యే అవమానాలను భరించే ధైర్యం లేక గత్యంతరం లేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన కుమార్తెను పోలీసులు చేరదీసి ఆదుకోవాలని కోరింది. వెంటనే స్పందించిన దిశ కంట్రోల్ రూం సిబ్బంది మహిళ ఫోన్ నెంబరు ఆధారంగా ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. చదవండి: దిశ యాప్ డౌన్లోడ్ ఇలా.. హుటాహుటిన విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన సమీపంలో విధులు నిర్వహిస్తున్న పెట్రోలింగ్ పోలీసులు కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే మహిళ ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికే మహిళ విషం సేవించి అపస్మారక స్థితిలో పడి ఉండగా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రాణాలను కాపాడారు. అంతేకాకుండా మహిళతో పాటు అయిదు సంవత్సరాల బాలికను చేరదీసిన అజిత్ సింగ్ నగర్ పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: నకిలీ చలానాల కేసు: ప్రధాన నిందితుడు అరెస్ట్ -
ఫేస్బుక్ పరిచయం.. వివాహితతో ఎస్సై ప్రేమాయణం
సాక్షి, జగిత్యాలక్రైం: ఓ మహిళను నమ్మించి వంచించాడో ఎస్సై.. పెళ్లి చేసుకోమంటే నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వివాహిత తన భర్త, ఇద్దరు పిల్లలతో కలసి హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. ఏడాది క్రితం జగిత్యాల జిల్లా సరిహద్దు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఎస్సైకి ఫేస్బుక్లో సదరు మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమెతో ప్రేమాయణం కొనసాగించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో వివాహిత కొద్ది రోజుల క్రితం భర్తకు విడాకులు ఇచ్చింది. అనంతరం రెండు నెలల క్రితం ఎస్సై ఆమెను కరీంనగర్లో రహస్యంగా ఉంచాడు. అయితే.. ఎస్సైకి ఇదివరకే పెళ్లి కావడంతో సదరు మహిళను వదిలించుకునేందుకు ప్రయత్నించాడు. మనస్తాపానికి గురైన ఆమె.. వారం క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తనను ఎస్సై మోసం చేశాడని బాధితురాలు జగిత్యాల డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం చర్చనీయాంశం కావడంతో సదరు ఎస్సై సెలవులో వెళ్లాడు. -
ఠాణా ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
మొయినాబాద్ (చేవెళ్ల): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఠాణా ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. వెండి పట్టాలు పోయాయని తాను ఇచ్చిన ఫిర్యాదు విషయం తెలుసుకునేందుకు బుధవారం స్టేషన్‌కు వెళ్లిన ఆమెను పోలీసులు బెదిరించి వెళ్లగొట్టడంతో మనస్తాపంతో ఒంటికి నిప్పంటించుకుంది. మొయినాబాద్ మండల పరిధిలోని ముర్తూజగూడలో నివాసముంటున్న సంపంగి బాల్‌రాజ్, సుగుణ(32) దంపతులు వడ్డెర పని చేసి జీవనం సాగిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం సుగుణకు చెందిన 20 తులాల వెండి పట్టాలు ఇంట్లోంచి పోయాయి. ఈ విషయమై ఆమె అదే రోజు స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేసింది. తన తండ్రి రెండో భార్య ఎల్లమ్మపై అనుమానం ఉందని పేర్కొంది. పోలీసులు ఎల్లమ్మను పిలిపించి విచారించగా తాను పట్టాలు తీయలేదని చెప్పింది. అయితే, ఈ విషయంలో సుగుణ, ఎల్లమ్మ గొడవపడ్డారు. గొడవలు వద్దని, చోరీపై విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్పి ఇద్దరినీ పంపించారు. కాగా బుధవారం కేసు విషయం ఎంత వరకు వచ్చిం దని తెలుసుకునేందుకు సుగుణ ఠాణాకు వెళ్లిం ది. పోలీసులు ఆమెను లోపలికి రానివ్వకుండా బెదిరించి బయటి నుంచే వెళ్లగొట్టారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె బయటకొచ్చి ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకుంది. చుట్టుపక్కల వారు, పోలీసులు మం టలను ఆర్పారు. తీవ్ర గాయాలైన సుగుణను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. తల్లి వెంటే ముగ్గురు పిల్లలు... కేసు విషయం తెలుసుకునేందుకు ఠాణాకు వచ్చిన సుగుణ తన ఇద్దరు కొడుకులు, ఓ కూతురును తీసుకొచ్చింది. పిల్లల ముందే ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో వారు పెద్దగా కేకలు పెడుతూ రోదించారు. అనం తరం తల్లిని ఆస్పత్రికి తరలించడంతో పిల్లలు పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే బిక్కుబిక్కుమంటూ కూర్చోవడం స్థానికులను కలిచివేచింది. డీజిల్ ఎక్కడిది..? సుగుణ డీజిల్ ఎక్కడి నుంచి తెచ్చుకుందనే విష యం అంతు చిక్కడం లేదు. పోలీసులు బెదిరిం చిన తర్వాత బయటకు వెళ్లిన ఆమె డీజిల్ తెచ్చు కుని ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుందా...? లేక ముందుగానే తనతో డీజిల్ తెచ్చుకుందా.. అనే విషయం తెలియడం లేదు. ఈ విషయమై పోలీసులు సైతం ఆరా తీస్తున్నారు. ఠాణా ఎదుటున్న సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. విచారణ చేస్తున్నామని చెప్పాం.. వెండి పట్టాలు పోయాయని నాలుగు రోజుల క్రితం సుగుణ ఫిర్యాదు ఇచ్చింది. సవతి తల్లి ఎల్లమ్మపై అనుమానం ఉందని చెప్పడంతో ఆమెనూ విచారిం చాం. బుధవారం సుగుణ మళ్లీ ఠాణాకు వచ్చింది. కేసు విచారణ జరుపుతున్నామని చెప్పి పంపించాం. బయటకు వెళ్లిన కొంతసేపటికి ఠాణా పక్కన తహసీల్దార్ కార్యాలయం గేటు సమీపంలో ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే 108లో ఆస్పత్రికి తరలించాం. – జానయ్య,మొయినాబాద్ ఇన్స్పెక్టర్ -
ప్రాణాలు కాపాడిన అపరిచిత వ్యక్తి ఫోన్‌కాల్
సాక్షి, కాశీబుగ్గ: క్షణికావేశానికి లోనై ఓ మహిళ అర్ధరాత్రి వేళ రైలు పట్టాలపైకి చేరుకుంది. దీన్ని ఓ అపరిచిత వ్యక్తి గమనించి సంకోచించకుండా వెంటనే 100 కాల్‌కు ఫోన్ చేశాడు. అప్పుడే విధుల్లో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్‌కు సమాచారం చేరడంతో నిమిషాల వ్యవధిలో అక్కడకు చేరుకుని ఆమెను ప్రాణాలతో రక్షించాడు. ఈ ఘటన పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీ తాళభద్ర రైల్వేగేట్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. అత్యవసర సమయంలో 100 కాల్ చేస్తే విలువైన ప్రాణాలు కాపాడవచ్చని ఈ ఘటన నిరూపించింది. కాశీబుగ్గ పోలీసు డివిజన్ కార్యాలయంలో గురువారం కాశీబుగ్గ డీఎస్పీ ఎన్ శివరామరెడ్డి ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించారు. వజ్రపుకొత్తూరు మండలం ధర్మపురం గ్రామానికి చెందిన ఓ మహిళకు తన భర్తతో చిన్నపాటి మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవడానికి రైలు పట్టాలపైకి చేరుకుంది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 3వ వార్డులో తాళభద్ర రైల్వేగేట్ సమీపంలో అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడింది. దీన్ని గమనించిన ఓ అపరిచిత వ్యక్తి వెంటనే 100కు డయల్ చేసి విషయం చెప్పాడు. తక్షణమే కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు సమాచారం అందడంతో కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలిలో రాత్రి విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామయ్య నిమిషాల వ్యవధిలోనే సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. అయితే భువనేశ్వర్ నుంచి వైజాగ్ వైపు వెళ్లే ఈస్టుకోస్టు రైలు రావడం ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో ఆ మహిళను రక్షించగలిగారు. లేదంటే ప్రాణాలు పోయి ఉండేవి. అనంతరం కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి సమస్యను పరిష్కరించారు. ఆపద సమయంలో డయల్ 100 సేవలను ప్రజలకు వినియోగించుకోవాలని డీఎస్పీ తెలిపారు. ఈమెను ప్రాణాలతో రక్షించినట్లుగా హెడ్ కానిస్టేబుల్ రామయ్య విషయం తెలియడంతో ఎస్పీ అమ్మిరెడ్డి రూ.5 వేలు రివార్డు ప్రకటించి అభినందనలు తెలిపారు. 100 కాల్ చేసిన వ్యక్తిని సైతం అభినందించారు. అయితే ఆయన వివరాలు ఇంతవరకు పోలీసులకు తెలియరావడం లేదు. ఈ సమావేశంలో కాశీబుగ్గ సీఐ వేణుగోపాల్ పాల్గొన్నారు. -
పుష్కరిణిలోకి దూకి వివాహిత..
కాణిపాకం: పుష్కరిణిలో దూకి ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మంగళవారం కాణిపాకంలో కలకలం సృష్టించింది. ఉదయం 11 గంటల వేళ నిజరూప దర్శన సేవ సమయంలో ఇది చోటుచేసుకోవడంతో భక్తులు ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను కాపాడారు. అదృష్టవశాత్తు పుష్కరిణిలో ఎక్కువగా నీళ్లు లేకపోవడం, మూడు అడుగుల లోతు వరకే నీళ్లు ఉండడంతో కాపాడటం సులువైంది. ఆపై, ప్రథమ చికిత్స చేసి వివాహితను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాక్షాత్తు ఆమె భర్త కూడా ఆలయంలో పనిచేసే ఇంజినీరింగ్ శాఖ ఉద్యోగి కావడంతో తొలుత అతడిని పిలిపించారు. ఆ తర్వాత దంపతుల కుటుంబ సభ్యులనూ సైతం పిలిపించారు. దంపతులిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీసులకు తలబొప్పి కట్టించారు. వారిద్దరికీ కౌన్సెలింగ్‌తో ఎస్ఐ కృష్ణమోహన్ ఎట్టకేలకు హితబోధ చేసి దంపతుల కలహాలకు తాత్కాలికంగా తెరదించారు. ఇంటికి సాగనంపారు. ఎస్ఐ కథనం..యాదమరి మండలానికి చెందిన లావణ్యకు కాణిపాకం ఆలయంలోని ఇంజినీరింగ్ శాఖలో పనిచేస్తున్న బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి వాసి బద్రికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడున్నరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో తన భర్త రెండు నెలలుగా ఇంటికి రాలేదంటూ లావణ్య కాణిపాకం ఈఓ కార్యాలయానికి వచ్చి తన భర్తను నిలదీసింది. అతను ఆమెను తీవ్రంగా మందలించి చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఆలయ పుష్కరిణిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. -
పిల్లల్ని సంపులో పడేసి.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని
సాక్షి, చెన్నై : భార్యాభర్తల మధ్య ఉన్న తగాదాలు ఇద్దరు పిల్లలను బలికొన్నాయి. ఈ సంఘటన శుక్రవారం తమిళనాడులోని తిరుపూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరుపూరు జిల్లా పూమలూరుకు చెందిన శివరంజని అనే మహిళకు భర్తతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం కూడా ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ సందర్భంగా భర్త ఆమెను కొట్టడంతో మనోవేదనకు గురైంది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుంది. ముందుగా ఆరు నెలల కుమార్తెను, ఏడు సంవత్సరాల కుమారున్ని ఇంటి ముందు ఉన్న నీటి సంపులో పడేసింది. నీటిలో ఊపిరాడక పిల్లలిద్దరూ చనిపోయారని ధ్రువీకరించుకున్న శివరంజని వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటల్లో కాలుతున్న ఆమె గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టింది. ఆమె కేకలు విన్న ఇరుగు పొరుగు వారు మంటలు ఆర్పి కోయంబత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శివరంజని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. భార్యాభర్తల నడుమ గొడవ ఇద్దరు చిన్నారులను బలి కొనటం తిరుపూరు జిల్లాలో కలకలం సృష్టించటమే కాకుండా విషాదం నింపింది. -
చావడానికి దూకితే...
వ్యక్తిగత కారణాలు ఆమెను మానసికంగా కుంగదీశాయి. నెలలు కూడా నిండని పసికందుతోసహా ఆత్మాహూతికి సిద్ధపడింది. అమాంతం రైలు పట్టాలపై దూకేసింది. జనాలు చూస్తుండగానే రైలు వాళ్ల మీదినుంచి పోయింది. కానీ, అదృష్టవశాత్తూ ఆ రెండు ప్రాణాలు నిలిచాయి. భోపాల్: శనివారం ఉదయం ఓ మహిళ, ఓ చంటి బిడ్డతో భూర్హన్‌పూర్ జిల్లాలోని నేపానగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. పుష్కక్ ఎక్స్‌ప్రెస్ స్టేషన్‌కు వస్తున్న సమయంలో అమాంతం పట్టాలపైకి దూకింది. జనాలంతా అరుస్తుండగానే రైలు వాళ్ల మీదునుంచి వెళ్లింది. అయితే చిన్న గాయం కూడా కాకుండా ఆ తల్లికూతుళ్లు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ట్రాక్‌కు సరిగ్గా మధ్యలో పడిపోవటంతో రైలు వారి మీదుగా వెళ్లింది. షాక్‌లోకి వెళ్లిన మహిళను సమీపంలోని ఆస్పత్రికి ప్రయాణికులు తరలించారు. రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తన పేరు తబాస్సుమ్ అని, భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నానని, ఎటు వెళ్లాలో తెలీని స్థితిలో బిడ్డతో కలిసి చనిపోయేందుకు నిర్ణయించుకున్నానని వివరించింది. దీంతో ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు సఖి సెంటర్‌కు తరలించి, ముంబైలోని ఆమె బంధువులకు సమాచారం అందించారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం!
సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద సోమవారం ఓ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అధికారులు గుర్తించి ఆమెను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ మహిళ గతంలో లైంగికదాడికి గురయ్యారు. తన జీవనాధారం కోసం ఉద్యోగం ఇవ్వాలంటూ ఆమె ఎన్నో సార్లు అధికారుల చుట్టూ తిరిగారు. అయినా పట్టించుకోకపోవడంతో విసిగి వేసారిన ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనపై ఆరా తీసిన కలెక్టర్ శశిధర్ బాధితురాలికి ఉద్యోగం ఇవ్వకుండా ఎందుకు తిప్పుతున్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. వెంటనే ఉద్యోగం ఇవ్వాలంటూ ఆదేశించారని తెలిసింది. -
నా చావుకి ఎమ్మెల్యే కారణం అంటూ పోస్టు చేసి.!
కర్ణాటక : నా చావుకి ఎమ్మెల్యేనే కారణం అంటూ ఫేస్బుక్లో పోస్టులు పెట్టింది ఓ మహిళ. తన గోడును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లేఖ రాసి శివకుమారి (30) అనే మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన నెలమంగలలో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం తన ఫేస్బుక్ ఖాతాలో ‘మహిళపై అత్యాచారం జరగాలి, లేదా హత్య జరగాలి. అప్పుడే ప్రభుత్వం న్యాయం చేస్తుందా?’ అని అని పోస్టుచేసింది. తరువాత, ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన నీచుడు నెలమంగల ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి. నా చావుకి అతడే కారణం’ అని మరో పోస్టుపెట్టి కాసేపటికే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. శివకుమారి గతంలోనూ ఎమ్మెల్యే తనను వేధిస్తున్నాడని, అతడికి లొంగలేదనే అక్కసుతో రౌడీలతో బెదిరించి తను ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఉద్యోగంలో కొనసాగడానికి వీలు లేకుండా చేశాడని శివకుమారి ఆరోపించారు. కొద్దినెలల క్రితం ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారని ఆమె అప్పట్లో ఫేస్బుక్, వాట్సప్‌లలో ముమ్మరంగా ప్రచారం చేయడం సంచలనం సృష్టించింది. అనంతరం ఉపాధ్యాయురాలి ఉద్యోగం వదిలేసిన శివకుమారి ఎమ్మెల్యేపై వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతూ ‘జనజాగృతి అభియాన్’ పేరున తాలూకాలో పర్యటిస్తూ ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు హఠాత్తుగా ఇలా ఫేస్బుక్ పోస్టులు పెట్టి ఆత్మహత్యాయత్నం చేసి కొత్త వివాదానికి తెరతీశారు. ప్రస్తుతం శివకుమారి మ్యాగ్నిస్ ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. పోలీసులు ఈ ఘటన గురించి ఆరా తీస్తున్నారు. -
ఏపీ సచివాలయం ఎదుట కలకలం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎదుట ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. వసుధ అనే యువతి బుధవారం సచివాలయం ప్రధాన గేటు ఎదుట యువతి కళ్లు తిరిగి పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వసుధ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. కాగా విజయనగరం జిల్లాకు చెందిన శ్రవణ్ అనే వ్యక్తి వసుధను ప్రేమించి మోసం చేసినట్లు సమాచారం. అయితే అక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో ఆమె... ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. అయితే వసుధను లోపలికి అనుమతించకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసింది. కాగా గతంలోనూ ఓ ఆర్ఎంపీ డాక్టర్ కూడా సచివాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విదితమే. -
హోంమంత్రి బ్లాక్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం
-
కలెక్టరేట్లో మహిళ ఆత్మహత్యాయత్నం
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో ఓ మహిళ వంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గుర్తించిన అక్కడి సిబ్బంది ఆమెను అడ్డుకొని ఆస్పత్రికి తరలించారు. భూ వివాదం విషయంలో హుజూర్నగర్ కోర్టుకు వెళ్తే అక్కడ అటెండర్‌గా పనిచేస్తున్న వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని.. సహాయం చేస్తానని చెప్పి లైంగింక వేధింపులకు గురిచేస్తున్నాడని దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశానని ఆమె తెలిపింది. ఈ ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. -
శశికి వ్యతిరేకంగా జయ సమాధి వద్ద..!
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రిగా శశికళ నటరాజన్ శనివారం పగ్గాలు చేపడుతున్న తరుణంలో ఓ మహిళ జయలలిత సమాధి వద్ద ఆత్మాహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ సుమతి అనే మహిళ బలవన్మరణానికి ప్రయత్నించింది. మెరీనా బీచ్‌లోని అమ్మ సమాధి వద్ద ఆమె విషం తాగింది. దీంతో స్థానికులు ఆమెను గుర్తించి సుమతిని ఆస్పత్రికి తరలించారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఆఖరికీ మద్రాస్ హైకోర్టు కూడా జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేసింది. జయలలిత భౌతికకాయాన్ని వెలికితీసి.. ఎందుకు మరోసారి అనుమానాల నివృత్తికి ప్రయత్నించకూడదంటూ హైకోర్టు పేర్కొంది. మరోవైపు జయలలిత మృతి నేపథ్యంలో శశికళ తీరుపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మ సమాధి వద్దే ఆత్మహత్యాయత్నం జరగడం కలకలం రేపుతోంది. -
భర్త ఒట్టు వేసి మరిచాడని..
హైదరాబాద్ : మద్యం సేవించనని భార్యపై ఒట్టు వేసిన భర్త మద్యం తాగి వచ్చాడని మనస్తాపంతో భార్య తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ కిషన్ తెలిపిన వివరాల ప్రకారం..హన్మకొండకు చెందిన అనూష (30) జనగాంకు చెందిన రాజు (35) దంపతులు. వీరికి రెండు సంవత్సరాల పాప ఉంది. కాగా బతుకుదెరువు కోసం కొన్ని రోజుల క్రితం నగరానికి వచ్చి ఎల్.బి.నగర్లో నివాసముంటున్నారు. రాజుకు సొంత కారు ఉంది. కారు నడుపుతుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా రాజు తాగుడుకు బానిసకావడంతో కొన్ని రోజుల క్రితం తాగనని భార్య అనూషపై ఒట్టు వేశాడు. ఆదివారం తిరిగి మద్యం సేవించి రావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన అనూష ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన భర్త రాజు అడ్డుకుంటుండగా రాజుకు స్వల్ప గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు గమనించి చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కొడుకు పుట్టాక భార్యను నీవెవరు అన్నాడు..
కొడుకుతో పాటు ఆత్మహత్యాయత్నం చేసిన బాధితురాలు అమీర్‌పేట: సెల్‌ఫోన్ పోయిందని ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన యువతికి కానిస్టేబుల్ మాయమాటలు చెప్పి ప్రేమలోకి దింపాడు. పెళ్లి కాలేదని నమ్మించి గుడిలో వివాహం చేసుకున్నాడు. కొడుకు పుట్టాక ఇంటికి రావడం మానేశాడు. ఎందుకు రావడంలేదని అడగడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భార్యను నీవెవరో నాకు తెలియదని కానిస్టేబుల్ అనడంతో ఆ యువతి కొడుకుతో పాటు రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు యుత్నించింది. గురువారం సంజీవరెడ్డినగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్జిల్లాకు చెందిన నిరోష 2014లో నగరానికి వచ్చి ఎస్ఆర్నగర్లోని హోస్టల్లో ఉండేది. గదిలో సెల్‌ఫోన్ పోయిందని ఫిర్యాదు చేసేందుకు ఎస్సార్‌నగర్ స్టేషన్‌కు వెళ్లిన ఆమెకు అక్కడ కానిస్టేబుల్ రాజారాం పరిచయం అయ్యాడు. మాయమాటలు చెప్పి ఆమెను వలలో వేసుకున్నాడు. ప్రేమ వివాహానికి తన కుటుంబసభ్యులు అంగీకరించరని చెప్పి సాంఘీ ఆలయానికి తీసుకెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. యూసుఫ్‌గూడలో ఆమెతో కాపురం పెట్టాడు. కొడుకు పుట్టాక ఇంటికి సరిగా రాకపోవటంతో అనుమానం వచ్చి ఆరా తీయగా రాజారాంకు అంతకు ముందే పెళ్లైందని తెలిసింది. ఏడాది వయసు కొడుకు ఉండటంతో రాజారాంతోనే కలిసి ఉండాలని నిరోష నిర్ణయించుకుంది. వారం రోజులుగా భర్త రాజారాం పూర్తిగా ఇంటికి రావడం మానేయడంతో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడంలేదు. దీంతో గురువారం ఉదయం ఆమె నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఇంటికి ఎందుకు రావడంలేదని ప్రశ్నించగా... రాజారాం అసభ్యంగా మాట్లాడాడు. నీవెవరో నాకు తెలియదు. నీతో నాకు సంబంధం లేదన్నాడు. దీంతో మనస్తాపానికి గురైన నిరోష కొడుకును తీసుకుని నేరుగా ప్రకృతి చికిత్సాలయం రైల్వేస్టేషన్‌కు వచ్చి రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు యుత్నించింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా వచ్చి ఆమెకు నచ్చచెప్పి ఠాణాకు తరలించారు. విచారణలో ఆమె ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉంటుందని తెలియడంతో ఆమెను ఆ స్టేషన్లో ఫిర్యాదు చేయమని పంపించామని ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపారు. కాగా.. రాజారాం తన ఇద్దరు భార్యలను కొంత కాలంగా ఒకే చోట ఉంచినట్లు తెలిసింది. కుటుంబ పోషణ కోసం ప్రతినెలా రాజారాం రెండో భార్యకు కొంత డబ్బు ఇచ్చేవాడని, అవి సరిపోక పోవడంతో వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని, గతంతో రాజారాంపై వరంగల్జిల్లా మర్రిపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టగా కౌన్సెలింగ్ చేసినట్లు తెలిసింది. -
మంత్రి సభలో మహిళ ఆత్మహత్యాయత్నం
బెల్లంపల్లి: ముగ్గురు రాష్ట్ర మంత్రుల సాక్షిగా భూమి కోసం ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో శుక్రవారం జరిగింది. నిండు సభలో హెయిర్‌డై తాగి బలవన్మరణానికి యత్నించిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ఎంపీలు, ఎమ్మెల్యేలు బెల్లంపల్లి పర్యటనకు వచ్చారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో కొత్తగా నిర్మించిన కార్యాలయ నూతన భవనానికి మంత్రి హరీశ్‌రావు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతుండగా.. బెల్లంపల్లి సుభాష్‌నగర్‌బస్తీకి చెందిన ఆరే వరలక్ష్మి అనే మహిళ సూపర్వాస్మల్ 33 హెయిర్‌డైని తాగి పడిపోయింది. పోలీసులు అంబులెన్స్‌లో ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి పంపించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సందర్భంగా బాధితురాలు వరలక్ష్మి ఆస్పత్రిలో విలేకరులతో మాట్లాడింది. ‘నా తండ్రి పురంశెట్టి బాపు తాండూర్ శివారులోని సర్వే నం.699/1లో ఉన్న ఒక ఎకరం 42 సెంట్ల పట్టా భూమిని నాకు కట్నంగా ఇచ్చారు. ఆ భూమిని తాండూర్ జెడ్పీటీసీ మంగపతి సురేశ్‌బాబు కబ్జా చేసుకున్నాడు. 2011 నుంచి జెడ్పీటీసీ నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఆక్రమణకు గురైన భూమి విషయమై హైకోర్టును ఆశ్రయించాను. హైకోర్టు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. ఇంత వరకు జెడ్పీటీసీ సురేశ్‌బాబు భూమి మాత్రం అప్పగించలేదు. జెడ్పీటీసీకి మద్దతుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బెల్లంపల్లి టీఆర్ఎస్ నాయకులు పసుల సురేశ్ ఫోన్ చేసి రోజూ భూమి విడిచిపెట్టాలని బెదిరిస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు దృష్టికి నా సమస్యను తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే హెయిర్‌డైని తాగాను’. పరామర్శించిన కలెక్టర్.. సభ ముగిసిన అనంతరం వరలక్ష్మిని కలెక్టర్ జగన్మోహన్, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల ఆర్డీవో ఆయేషామస్రత్‌ఖానం, తహసీల్దార్ కె.శ్యామలదేవి ప్రభుత్వాస్పత్రితో బాధితురాలిని పరామర్శించారు. కలెక్టర్ జగన్మోహన్ ఆమె ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ చంద్రమోహన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెతో మాట్లాడుతూ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
షాపు తొలగించారని మహిళ ఆత్మహత్యాయత్నం
విజయనగరం మున్సిపాలిటీ : తన దుకాణాన్ని తీసేశారని మనస్తాపానికి గురైన సంతోషి అనే మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించింది. ఈ సంఘటన విజయనగరం పట్టణంలో ఆక్రమణల తొలగింపులో భాగంగా బుధవారం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను పక్కకు తీసుకెళ్లి నచ్చజెప్పి ఆత్మహత్యాయత్నాన్ని ఆపారు. మున్సిపాలిటీ వాళ్లు అకారణంగా తన తొలగించారని ఆమె ఆరోపించింది. -
సచివాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : ఆంధ్ర్రప్రదేశ్ సచివాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సమస్యలు చెప్పుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కలిసేందుకు అర్చన అనే మహిళ సచివాలయానికి వచ్చింది. అయితే పోలీసులు ఆమెను తెలంగాణ సచివాలయంలోనికి అనుమతించలేదు. దీంతో మనస్తాపం చెందిన అర్చన ఏపీ సచివాలయం ఎదుటు తన వెంట తెచ్చుకున్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తక్షణం స్పందించిన సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
భవనంపైకి ఎక్కి... కిరోసిన్ పోసుకుని
దుబ్బాక, న్యూస్‌లైన్: అందరూ చూస్తుండగానే ఉన్నట్టుండి భవనంపైకి ఎక్కిన ఓ మహిళ.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన దుబ్బాక పట్టణంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం...దుబ్బాకకు చెందిన బోడి కృపాకర్‌కు ఐదేళ్ళ క్రి తం రాజమండ్రికి చెందిన పరిమళ(27) తో వివాహం జరిగింది. పాస్టర్‌గా పనిచేసే కృపాకర్ వివాహం జరిగినప్పటి నుంచి భార్యతో కలిసి ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటలో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కూతుళ్లు లేఖన, బేరునిక సంతానం. కృపాకర్ ఇటీవల దుబ్బాకలో ఉంటున్న తన పాత ఇంటిని కూల్చేసి కొత్తగా ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. దీం తో కృపాకర్ కొద్దిరోజుల క్రితం కుటుం బంతో సహా దుబ్బాకకు వచ్చి ఏఎన్ఎంగా పనిచేస్తున్న తన సోదరి ఇంట్లో ఉంటున్నాడు. ఇటీవలే కూతుళ్లను కూ డా దుబ్బాకలోని ఓ ప్రైవేటు పాఠశాల లో చేర్చించాడు. కాగా, మంగళవారం కృపాకర్ తన భార్య పిల్లలతో కలిసి దు బ్బాకలోనే ఓ అద్దె ఇంట్లో నివాసం ఉం టున్న తన మరోసోదరి చిట్టి ఇంటికి వచ్చారు. సాయంత్రం సమయంలో కృపాకర్ తాను నిర్మించుకుంటున్న భవ న నిర్మాణ పనుల వద్దకు వెళ్లాడు. ఆ కొద్దిసేపటికే కృపాకర్ భార్య పరిమళ ఇంట్లో ఉన్న అల్లుడు పండు(కృపాకర్ సోదరి కుమారుడు)కు ఓ లేఖ ఇచ్చి దాన్ని మామయ్యకు ఇచ్చి రమ్మని ఆ చిన్నారిని పంపింది. అనంతరం ఆమె ఇంట్లో ఉన్న కిరోసిన్ డబ్బాను తీసుకుని భవనం పైకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పుపెట్టుకుంది. మంటల కు తాళలేక బిగ్గరగా కేకలు వేసింది. భవనంపై పెద్దఎత్తున మంటలు చెలరేగ డం పరిమళ గట్టిగా కేకలు వేయడంతో వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు, పరిమళ భర్త కృపాకర్ ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే పూర్తిగా కాలిపోయిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పంచనామా నిర్వహించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు దుబ్బాక సీఐ రామకృష్ణరెడ్డి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పశ్చాతాపంలోనే ఆత్మహత్య మృతురాలు పరిమళ ఆత్మహత్యకు చేసుకునే ముందు తన భర్త కృపాకర్‌కు రాసిన రెండు పేజీల లేఖలో తీవ్ర పశ్చాతాపం తెలిపినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో ఆమె లేఖ రాయటానికి గల కారణాలు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితులపై వారు దర్యాప్తు చేస్తున్నారు. వీరు అదిలాబాద్ జిల్లా నుంచి ఇటీవలే దుబ్బాకకు రావటంపై కూడా పలు అనుమనాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బారులు తీరిన జనం... దుబ్బాకలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పక్కనే ఉన్న ఓ భవనంపై పరిమళ ఆత్మహత్య చేసుకోవటం చూసిన స్థానికులంతా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. భవనంపైన పెద్ద ఎత్తున మంటలు రావటంతో చుట్టుపక్కల వారందరూ అక్కడికి చేరుకుని భవనంపైకి ఎక్కి ఆమెను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో వారంతా తీవ్ర కలత చెందారు. తల్లిని కోల్పోయిన పరిమళ ఇద్దరు కూతుళ్లను చూసి వారంతా కంటతడిపెట్టారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
నాగర్‌కర్నూలు మండలం కోళ్ల ఇటిక్యాల గ్రామంలోఓ మహిళ ఈ రోజు తెల్లవారుజామున ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఆ ఘటనలో మహిళ శరీరం దాదాపుగా కాలిపోయింది. దాంతో స్థానికులు వెంటనే స్పందించి మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే తమ కుమార్తెను ఆమె అత్త,మామలే కిరోసిన్ పోసి నిప్పంటించారని మహిళ తల్లితండ్రులతోపాటు బంధువులు ఆరోపించారు. దాంతో వారు నాగర్ కర్నూల్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.