నాగర్కర్నూలు మండలం కోళ్ల ఇటిక్యాల గ్రామంలోఓ మహిళ ఈ రోజు తెల్లవారుజామున ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఆ ఘటనలో మహిళ శరీరం దాదాపుగా కాలిపోయింది. దాంతో స్థానికులు వెంటనే స్పందించి మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే తమ కుమార్తెను ఆమె అత్త,మామలే కిరోసిన్ పోసి నిప్పంటించారని మహిళ తల్లితండ్రులతోపాటు బంధువులు ఆరోపించారు. దాంతో వారు నాగర్ కర్నూల్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.