ప్రతీకాత్మక చిత్రం
అన్నానగర్(తమిళనాడు): అరియలూరు కోర్టులో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. వివరాలు.. అరియలూరు జిల్లా సెందురై సమీపంలోని ఇడయకురిచ్చి గ్రామానికి చెందిన పురట్చీతమిళన్‌ను (27) ఇటీవల చైన్‌స్నాచింగ్ కేసులో ఇరులికురిచ్చి పోలీసులు అరెస్టు చేశారు. ఇతనిపై ఇప్పటికే జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో మొత్తం 11 దొంగతనాల కేసులు ఉన్నాయి. దీంతో ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో జిల్లా కలెక్టర్ రమణ సరస్వతి నిందితుడిపై గ్యాంగ్‌స్టర్ యాక్ట్ నమోదు చేయాలని అరియలూరు ఎస్పీని పెరోజ్ ఖాన్ అబ్దుల్లాను ఆదేశించారు.
ఈ క్రమంలో కేసు విచారణ నిమిత్తం పురట్చీ తమిళన్‌ను మంగళవారం సెందురై కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చారు. అతడిని చూసేందుకు అతని భార్య కోర్టుకు వచ్చింది. ఆపై హఠాత్తుగా తన వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన పోలీసులు, న్యాయవాదులు వెంటనే మహిళను రక్షించి చికిత్స నిమిత్తం సెందురై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రసుత్తం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 17 ఏళ్ల వయసున్న ఆ వివాహిత తనకు భర్త మాత్రమే ఆధారమని, న్యాయం చేయాలని అధికారులను వేడుకోవడం గమనార్హం.
చదవండి: ట్రాన్స్‌జెండర్ షాకింగ్ నిర్ణయం.. అసలు ఏం జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment