సాక్షి ప్రతినిధి, చెన్నై: విద్యార్థితో మలమూత్రాలు ఎత్తించిన నేరంపై ఓ మున్సిపల్ టీచర్‌కు తమిళనాడు కోయంబత్తూరు కోర్టు శుక్రవారం అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. పోలీసుల కథనం ప్రకారం.. నామక్కల్ జిల్లా రామాపురంపుదూర్ మున్సిపల్ పాఠశాలలో 2,3వ తరగతులకు ఒకే గదిలో క్లాసులు నిర్వహించేవారు. స్కూలుకు సమీపంలో నివసిస్తున్న వీరాస్వామి కొడుకు శచీంద్రన్ 2015లో 2వ తరగతి విద్యార్థిగా ఉన్నకాలంలో, తనకు తెలియకుండానే మలమూత్రాలను విసర్జించాడు.
క్లాస్ టీచర్ విజయలక్ష్మి (35) శచీంద్రన్ చేత మలమూత్రాలు ఎత్తించివేసినట్లు అదే ఏడాది నవంబరు 12న వీరాస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద టీచర్ విజయలక్ష్మిని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై నామక్కల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్లుగా విచారణ జరిపి టీచర్ విజయలక్ష్మికి అయిదేళ్ల జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో ఆమెను కోయంబత్తూరు జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment