కోర్టు ఎదుట నగ్నంగా ఆందోళన | Lawyer Naked Protest in front of Court in Tamil Nadu | Sakshi
Sakshi News home page

కోర్టు ఎదుట న్యాయవాది నగ్నంగా ఆందోళన

Published Thu, Jul 30 2020 8:35 AM | Last Updated on Thu, Jul 30 2020 10:15 AM

Lawyer Naked Protest in front of Court in Tamil Nadu - Sakshi

కోర్టు ఎదుట నగ్నంగా ఆందోళన చేస్తున్న న్యాయవాది మణికంఠన్‌

టీ.నగర్‌: సమస్యను పరిష్కరించాలని కోరుతూ సాత్తూరు ఉమ్మడి కోర్టు ఎదుట న్యాయవాది నగ్నంగా ఆందోళన జరపడంతో మంగళవారం కలకలం రేపింది. విరుదునగర్‌ జిల్లా సాత్తూరులోని ఆండాళ్‌పురం ప్రాంతానికి చెందిన మణికంఠన్‌ (36) సాత్తూరు కోర్టులో న్యాయవాదిగా ఉన్నారు. కోర్టు పనులు జరగనందున జీవనాధారం దెబ్బతిన్నట్లు, తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ సాత్తూరు మెయిన్‌రోడ్డులోని కోర్టు ఎదుట నగ్నంగా కూర్చుని నిరసన తెలిపారు. సాత్తూరు పోలీసులు న్యాయవాది మణికంఠన్‌తో చర్చలు జరిపి పోలీసు స్టేషన్‌ తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరించకుంటే ఈ నెల 31వ తేది నుంచి కోర్టు ఎదుట ఆమరణ నిరాహారదీక్ష జరుపుతానని తెలిపారు.

ఎస్పీ కార్యాలయం వద్ద వివాహిత ఆత్మాహుతియత్నం 
భర్త, కుటుంబ సభ్యులు వరకట్నం కోసం వేధిస్తున్నారని తిరుచ్చిలో మంగళవారం ఓ యువతి ఆత్మాహుతియత్నం చేసింది. తిరునెల్వేలి జిల్లాకు చెందిన ముత్తుసెల్వి (25) తిరువెరుంబూరుకి చెందిన కన్నన్‌(30) గత ఏడాది జూన్‌లో పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహ సమయంలో 15 సవర్ల బంగారు, సారె వస్తువులు వరకట్నంగా ఇచ్చారు. భర్త, అతని కుటుంబ సభ్యులు వరకట్నం కోసం వేధిస్తున్నారని ముత్తుసెల్వి తిరువెరుంబూరు మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కన్నన్‌ కుటుంబీకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించింది. దీంతో తిరుచ్చి జిల్లా ఎస్పీ, సర్కిల్‌ డీఐజీ కార్యాలయాల్లో ఫిర్యాదులిచ్చినా ఫలితం లేకుండా పోయింది. విసిగిపోయిన ఆమె మంగళవారం తిరుచ్చి ఎస్పీ కార్యాలయం వద్ద ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మాహుతియత్నం చేసింది. భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement