nude protest
-
కోర్టు ఎదుట నగ్నంగా ఆందోళన
టీ.నగర్: సమస్యను పరిష్కరించాలని కోరుతూ సాత్తూరు ఉమ్మడి కోర్టు ఎదుట న్యాయవాది నగ్నంగా ఆందోళన జరపడంతో మంగళవారం కలకలం రేపింది. విరుదునగర్ జిల్లా సాత్తూరులోని ఆండాళ్‌పురం ప్రాంతానికి చెందిన మణికంఠన్ (36) సాత్తూరు కోర్టులో న్యాయవాదిగా ఉన్నారు. కోర్టు పనులు జరగనందున జీవనాధారం దెబ్బతిన్నట్లు, తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ సాత్తూరు మెయిన్‌రోడ్డులోని కోర్టు ఎదుట నగ్నంగా కూర్చుని నిరసన తెలిపారు. సాత్తూరు పోలీసులు న్యాయవాది మణికంఠన్‌తో చర్చలు జరిపి పోలీసు స్టేషన్ తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరించకుంటే ఈ నెల 31వ తేది నుంచి కోర్టు ఎదుట ఆమరణ నిరాహారదీక్ష జరుపుతానని తెలిపారు. ఎస్పీ కార్యాలయం వద్ద వివాహిత ఆత్మాహుతియత్నం భర్త, కుటుంబ సభ్యులు వరకట్నం కోసం వేధిస్తున్నారని తిరుచ్చిలో మంగళవారం ఓ యువతి ఆత్మాహుతియత్నం చేసింది. తిరునెల్వేలి జిల్లాకు చెందిన ముత్తుసెల్వి (25) తిరువెరుంబూరుకి చెందిన కన్నన్(30) గత ఏడాది జూన్‌లో పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహ సమయంలో 15 సవర్ల బంగారు, సారె వస్తువులు వరకట్నంగా ఇచ్చారు. భర్త, అతని కుటుంబ సభ్యులు వరకట్నం కోసం వేధిస్తున్నారని ముత్తుసెల్వి తిరువెరుంబూరు మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కన్నన్ కుటుంబీకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించింది. దీంతో తిరుచ్చి జిల్లా ఎస్పీ, సర్కిల్ డీఐజీ కార్యాలయాల్లో ఫిర్యాదులిచ్చినా ఫలితం లేకుండా పోయింది. విసిగిపోయిన ఆమె మంగళవారం తిరుచ్చి ఎస్పీ కార్యాలయం వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతియత్నం చేసింది. భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. -
ఫేస్బుక్ కార్యాలయం ముందు నగ్న నిరసన
న్యూయార్క్ : కళాత్మక నగ్నత్వంపై ఫేస్బుక్ విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని #WeTheNipple పేరుతో వందల మంది మోడల్స్ న్యూయార్క్‌లోని ఆ కార్యాలయం ముందు నగ్న నిరసన చేపట్టారు. మగాళ్లు తమ చనుమొనలు చూపిస్తే ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు.. మహిళల చనుమొనలపై ఎందుకు ఆంక్షలు? అంటూ గొంతెత్తి అరిచారు. ఆడవాళ్ల చనుమొనలు ఫొటోలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివాదాస్పద ఆర్టిస్ట్ స్పెన్సర్ తునిక్, నేషనల్ కోలిషన్ ఎగైనెస్ట్ సెన్సార్షిప్(ఎన్సీఏసీ)తో కలిసి ఈ ఉద్యమాన్ని చేపట్టాడు. గత ఆదివారం న్యూయార్క్ వీధుల్లో మోడళ్లతో దుస్తులు విప్పించి ఆందోళనకు తెరతీశాడు. మన్‌హట్టన్‌లోని అస్టర్ ప్లేస్ సబ్వే స్టేషన్ వద్ద మోడళ్లు దుస్తులు విప్పేసి చనుమొనల చిత్రాలతో ఫొటోలకు పోజులిచ్చారు. వారి చనుమొనలకు పురుషుల చనుమొనల స్టిక్కర్లు అంటించుకొని.. వారి జననాంగాలు కనిపించకుండా చనమొనల ప్లకార్డుల అడ్డుపెట్టుకుని నిరసన తెలిపారు. ఇక ఫేస్బుక్లో కేవలం పెయింటింగ్ నగ్న చిత్రాలు మినహా ఫొటోలకు అనుమతి లేదు. వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాం యూట్యూబ్ సైతం తన నిబంధనలు మార్చుకుందని, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు ఏమైందని స్పెన్సర్ తునిక్ ప్రశ్నించారు. ఇది న్యూడ్ ఫొటోగ్రఫీ స్పూర్తిని దెబ్బతీయడేమనని వాపోయారు. -
తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: రైతుల ఆందోళనకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. రైతుల దుస్థితిపై సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటువంటి సమయాల్లో రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం సరికాదని వ్యాఖ్యానించింది. మానవతా దృక్పథంతో స్పందించాలని సుప్రీంకోర్టు సూచించింది. రైతుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదని సూటిగా ప్రశ్నించింది. కాగా దాదాపు నెల రోజులుగా కరువు ఉపశమన ప్యాకేజీ మంజూరు చేయాలని, తమ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు రైతులు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. తమ డిమాండ్ల కోసం ఆందోళన జరుపుతున్న అన్నదాతలు కేంద్ర ప్రభుత్వానికి తమ ఆక్రందనను వినిపించేందుకు ప్రతిరోజూ వినూత్నరీతిలో ఇక్కడ నిరసనలు చేపడుతున్నారు. రుణమాఫీపై కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ రైతులు గురువారం అరగుండ్లుతో నిరసన తెలిపారు. గతంలో పుర్రెలు, ఎముకలతో ఆందోళన నిర్వహించి మీడియా దృష్టి ఆకర్షించిన రైతులు.. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళన నేపథ్యంలోనే కరువు, తుపాను సాయం కింద తమిళనాడుకు కేంద్రం రూ.2,014.45 కోట్ల సాయాన్ని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఎదుట రైతులంతా నగ్నంగా గుమిగూడి నిరసన ప్రదర్శన నిర్వహించిన రైతులు నిన్న ఒంటిపై రాతలతో తమ నిరసన తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు. -
ప్రధాని కార్యాలయం ఎదుట నగ్నంగా ఆందోళన!
వినూత్న ఆందోళనలతో హోరెత్తిస్తున్న తమిళ రైతులు న్యూఢిల్లీ: తమ గోడును కేంద్రానికి వినిపించేందుకు దేశ రాజధాని ఢిల్లీలో తమిళనాడు రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతూనే ఉంది. తాజాగా రైతులు సోమవారం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఎదుట వినూత్నరీతిలో ఆందోళన చేపట్టారు. పీఎంవో సహా కీలక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండే సౌత్‌బ్లాక్ ఎదుట రైతులంతా నగ్నంగా గుమిగూడి నిరసన ప్రదర్శన నిర్వహించారు. కరువు ఉపశమన ప్యాకేజీ మంజూరు చేయాలని, తమ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దాదాపు నెలరోజులుగా తమిళనాడు రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వానికి తమ ఆక్రందనను వినిపించేందుకు వినూత్నరీతిలో అన్నదాతలు ఇక్కడ నిరసనలు చేపడుతున్నారు. గతంలో పుర్రెలు, ఎముకలతో ఆందోళన నిర్వహించి మీడియా దృష్టి ఆకర్షించిన రైతులు.. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళన నేపథ్యంలోనే కరువు, తుపాను సాయం కింద తమిళనాడుకు కేంద్రం రూ.2,014.45 కోట్ల సాయాన్ని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ట్రంప్‌కు వ్యతిరేకంగా మహిళల నగ్న నిరసన
అమెరికన్లకు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టలేం. క్లీవ్‌లాండ్‌లో వందమందికి పైగా మహిళలు దుస్తులన్నీ విప్పేసి అద్దాలు పట్టుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. వైట్‌హౌస్‌లోకి వెళ్లడానికి డోనాల్డ్ ట్రంప్‌కు ఏమాత్రం అర్హత లేదంటూ వాళ్లీ నిరసన కార్యక్రమం చేపట్టారు. రిపబ్లికన్ పార్టీ తమ అభ్యర్థిగా ట్రంప్‌ను ప్రకటించే కార్యక్రమం జరగనున్న రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ సభా వేదిక వద్ద వీళ్లంతా చేరి.. ఇలా ప్రదర్శన జరిపారు. స్పెన్సర్ టునిక్ అనే ఫొటోగ్రాఫర్ ఇచ్చిన పిలుపు మేరకు ఇదంతా జరిగింది. సుమారు 130 మంది పాల్గొన్న ఈ నిరసనలో టునిక్ వాళ్లందరినీ ఫొటో షూట్ కూడా చేశాడు. నవంబర్ 8వ తేదీన జరిగే ఎన్నికలకు ముందు వీళ్ల నగ్న నిరసన ఫొటోలను విడుదల చేస్తారు. నగ్న ప్రదర్శన చేసేందుకు తాము అనుమతి కూడా తీసుకున్నామని టునిక్ చెప్పారు. బహిరంగంగా నగ్న ప్రదర్శన చేయడం క్లీవ్‌లాండ్ చట్టాల ప్రకారం నేరమే అయినా.. పోలీసులు జోక్యం చేసుకోడానికి కుదరలేదు. నగ్నఫొటోల చిత్రీకరణలో టునిక్ సుప్రసిద్ధుడు. అయితే తాను ఇంతవరకు రాజకీయాలకు సంబంధించి ఏమీ చేయలేదని.. ఇదే చాలా పెద్ద ఎత్తున చేసిన రాజకీయ ఫొటో షూట్ అని ఆయన అంటున్నాడు. తాను తప్పనిసరిగా ఈ షూట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నాడు. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేసినంత మాత్రాన సరిపోదని, ఇలా నిరసన కూడా తెలపాల్సిందేనని అన్నాడు. తనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారని.. రిపబ్లికన్ పార్టీ పాలనలో మహిళలు, మైనారిటీల మీద జరిగే ఘోరాలను తాను సహించలేనని చెప్పాడు. టునిక్ చర్యలు తనకు నచ్చడం వల్లే ఈ ప్రదర్శనలో పాల్గొన్నట్లు ఆర్ట్ ప్రొఫెసర్, ఆర్టిస్ట్ అయిన మాపో కినార్డ్ (55) అనే మహిళ చెప్పారు. పూర్తి నగ్నంగా రోడ్డుమీద నిలబడటానికి కూడా భయం లేకుండా ఉండటమే తమకు కావాలని ఆమె వివరించారు.