
సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద సోమవారం ఓ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అధికారులు గుర్తించి ఆమెను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ మహిళ గతంలో లైంగికదాడికి గురయ్యారు. తన జీవనాధారం కోసం ఉద్యోగం ఇవ్వాలంటూ ఆమె ఎన్నో సార్లు అధికారుల చుట్టూ తిరిగారు. అయినా పట్టించుకోకపోవడంతో విసిగి వేసారిన ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనపై ఆరా తీసిన కలెక్టర్ శశిధర్ బాధితురాలికి ఉద్యోగం ఇవ్వకుండా ఎందుకు తిప్పుతున్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. వెంటనే ఉద్యోగం ఇవ్వాలంటూ ఆదేశించారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment