
భర్త రామకృష్ణ, అత్తమ్మ చూస్తుండగానే వారిని భయపెట్టేందుకు ఇంట్లో ఉన్న మాత్రలు ఒక్కసారిగా మింగేసింది.
పార్వతీపురం: కుటుంబసభ్యులను బెదిరించేందుకు సీతానగరం మండలం గుచ్చిమి గ్రామానికి చెందిన మండల అపర్ణ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భర్త రామకృష్ణ, అత్తమ్మ చూస్తుండగానే వారిని భయపెట్టేందుకు ఇంట్లో ఉన్న మాత్రలు ఒక్కసారిగా మింగేసింది. దీంతో కుటుంబసభ్యులు ఆటోలో ఆమెను చికిత్సకోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు.