
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎదుట ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. వసుధ అనే యువతి బుధవారం సచివాలయం ప్రధాన గేటు ఎదుట యువతి కళ్లు తిరిగి పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వసుధ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. కాగా విజయనగరం జిల్లాకు చెందిన శ్రవణ్ అనే వ్యక్తి వసుధను ప్రేమించి మోసం చేసినట్లు సమాచారం. అయితే అక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో ఆమె... ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. అయితే వసుధను లోపలికి అనుమతించకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసింది. కాగా గతంలోనూ ఓ ఆర్‌ఎంపీ డాక్టర్ కూడా సచివాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment