కర్ణాటక : నా చావుకి ఎమ్మెల్యేనే కారణం అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టింది ఓ మహిళ. తన గోడును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లేఖ రాసి శివకుమారి (30) అనే మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన నెలమంగలలో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం తన ఫేస్‌బుక్ ఖాతాలో ‘మహిళపై అత్యాచారం జరగాలి, లేదా హత్య జరగాలి. అప్పుడే ప్రభుత్వం న్యాయం చేస్తుందా?’ అని అని పోస్టుచేసింది.
తరువాత, ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన నీచుడు నెలమంగల ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి. నా చావుకి అతడే కారణం’ అని మరో పోస్టుపెట్టి కాసేపటికే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. శివకుమారి గతంలోనూ ఎమ్మెల్యే తనను వేధిస్తున్నాడని, అతడికి లొంగలేదనే అక్కసుతో రౌడీలతో బెదిరించి తను ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఉద్యోగంలో కొనసాగడానికి వీలు లేకుండా చేశాడని శివకుమారి ఆరోపించారు. కొద్దినెలల క్రితం ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారని ఆమె అప్పట్లో ఫేస్‌బుక్, వాట్సప్‌లలో ముమ్మరంగా ప్రచారం చేయడం సంచలనం సృష్టించింది. అనంతరం ఉపాధ్యాయురాలి ఉద్యోగం వదిలేసిన శివకుమారి ఎమ్మెల్యేపై వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతూ ‘జనజాగృతి అభియాన్’ పేరున తాలూకాలో పర్యటిస్తూ ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు హఠాత్తుగా ఇలా ఫేస్‌బుక్ పోస్టులు పెట్టి ఆత్మహత్యాయత్నం చేసి కొత్త వివాదానికి తెరతీశారు. ప్రస్తుతం శివకుమారి మ్యాగ్నిస్ ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. పోలీసులు ఈ ఘటన గురించి ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment