Srinivasa Murthy
-
మరింత మంచి పాలన
సాక్షి, హైదరబాద్: క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం గాం«దీభవన్‌లో ఘనంగా జరిగాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, వర్కింగ్ ప్రెసిసెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితుడు శ్రీనివాసమూర్తి పంచాంగ పఠనం చేశారు. ప్రజాభీష్టం మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అద్భుతంగా పాలన సాగిస్తుందన్నారు. వంద రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలు అమలు చేసి, ప్రజాదరణ పొందారని, రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా పాలన సాగుతుందని జోష్యం చెప్పారు. ఈ సందర్భంగా మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ ఈ క్రోది నామ సంవత్సరంలో కోపం తగ్గించుకొని కాంగ్రెస్ కార్యకర్తలు పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, కాంగ్రెస్ నాయకులు కుమార్‌రావ్, నిరంజన్, చల్లా నర్సింహారెడ్డి, మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
డబ్బింగ్ ఆర్టిస్ట్ కన్నుమూత.. సూర్య ఎమోషనల్ ట్వీట్
సూర్య, అజిత్, విక్రమ్ లాంటి తమిళ స్టార్ హీరోలకు తెలుగు డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి ఇవాళ కన్నుమూశారు. చెన్నైలో నివాసం ఉంటున్న ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న హీరో సూర్య ఎమోషనల్ ట్వీట్ చేశారు. శ్రీనివాస మూర్తి సేవలను గూర్తు చేసుకుంటూ నివాళి అర్పించారు. (ఇది చదవండి: ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ కన్నుమూత) సూర్య ట్విటర్లో రాస్తూ.. 'ఇది నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. తెలుగులో నా నటనకు శ్రీనివాసమూర్తి వాయిస్, భావోద్వేగాలు ప్రాణం పోశాయి. నిన్ను కోల్పోతున్నందుకు చాలా బాధగా ఉంది. ' అంటూ ట్వీట్ చేశారు. కాగా.. సూర్య నటించిన సూపర్ హిట్ సినిమాలు సింగంలో డబ్బింగ్ చెప్పారు. ఈ రంగంలో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న శ్రీనివాస మూర్తి.. సూర్యతో పాటు అజిత్, మోహన్‌లాల్, రాజశేఖర్, విక్రమ్ లాంటి అగ్రహీరోలకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఇటీవల విడుదలైన ‘తెగింపు’ చిత్రంలో అజిత్ పాత్రకి కూడా ఆయనే డబ్బింగ్ చెప్పడం విశేషం. శ్రీనివాస మూర్తిలాంటి గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ కోల్పోవడంపై తెలుగు, తమిళ ఇండస్ట్రీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. This is a huge personal loss! Srinivasamurthy Garu’s voice & emotions gave life to my performances in Telugu. Will miss you Dear Sir! Gone too soon. — Suriya Sivakumar (@Suriya_offl) January 27, 2023 -
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ కన్నుమూత
చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూశారు. చెన్నైలో నివాసం ఉంటున్న ఆయన గుండెపోటుతో మృతి చెందారు. డబ్బింగ్ రంగంలో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న శ్రీనివాస మూర్తి.. సూర్య, అజిత్, మోహన్‌లాల్, రాజశేఖర్, విక్రమ్ లాంటి అగ్రహీరోలకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఇటీవల విడుదలైన ‘తెగింపు’ చిత్రంలో అజిత్ పాత్రకి కూడా ఆయనే డబ్బింగ్ చెప్పారు. శ్రీనివాస మూర్తిలాంటి గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ కోల్పోవడంపై తెలుగు, తమిళ ఇండస్ట్రీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఆయన ఎన్నో గొప్ప చిత్రాలకు, పెద్ద పెద్ద స్టార్లకు తన గాత్రాన్ని అందించారు. ఆయన చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోవడం పట్ల అభిమానులు, తోటి డబ్బింగ్ ఆర్టిస్టులు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
డీఆర్డీఎల్ డైరెక్టర్‌గా శ్రీనివాసమూర్తి
సాక్షి, హైదరాబాద్: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీ (డీఆర్డీఎల్) డైరెక్టర్‌గా ప్రముఖ శాస్త్రవేత్త జి.ఎ.శ్రీనివాస మూర్తి నియమితులయ్యారు. డాక్టర్ దశరథ్ రామ్ ఉద్యోగ విరమణ తరువాత ఆయన స్థానంలో డైరెక్టర్ అండ్ డీఎస్‌గా జి.ఎ.శ్రీనివాసమూర్తిని నియమించారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన డీఆర్డీవో అనుబంధ సంస్థ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ మిస్సైల్ కాంప్లెక్స్ (రీసెర్చ్ సెంటర్ ఇమారత్)లో డీఆర్డీఎల్ ఒక భాగమన్న విషయం తెలిసిందే. డైరెక్టర్‌గా నియమితులయ్యే ముందు వరకూ జి.ఎ.శ్రీనివాస మూర్తి అడ్వాన్స్డ్ నావల్ సిస్టమ్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసమూర్తి 1986లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ విద్యను అభ్యసించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఈ (1997) పట్టా పొందారు. 1987లోనే డీఆర్డీఎల్లో చేరిన ఆయన స్ట్రక్చరల్ డైనమిక్స్, గ్రౌండ్ రెజొనెన్స్ టెస్టింగ్, ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్ వంటి అంశాల్లో కృషి చేశారు. మిస్సైల్ కాంప్లెక్స్ చేపట్టిన పలు ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించారు. -
నేను బతికి ఉండటం అద్భుతం: శ్రీనివాసమూర్తి
బెంగళూరు: ఫేస్బుక్లో షేర్ చేసిన ఓ పోస్టు కర్ణాటకలో కల్లోలానికి దారి తీసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు ఒకరు ఓ వర్గాన్ని కించపరిచే విధంగా పోస్టు చేశారు. ఎమ్మెల్యే అండతోనే సదరు వ్యక్తి ఇలా చేస్తున్నాడని భావించి మంగళవారం రాత్రి నిరసనకారులు బెంగళూరులో శ్రీనివాస మూర్తి నివాసంపై దాడి చేశారు. దీనిపై ఎమ్మెల్యే తాజాగా స్పందించారు. తాను బతికుండటం నిజంగా అద్భుతం అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ క్షణం నేను బతికి ఉండటం నిజంగా అద్భుతం. దాడి జరిగినప్పుడు నేను బయట ఉన్నాను. నా శ్రేయోభిలాషులు ఫోన్ చేసి దాడి గురించి ముందుగానే నన్ను హెచ్చరించారు. దాంతో తప్పించుకోగలిగాను. లేదంటే ఇప్పుడు నేను ఇలా బతికి ఉండేవాడిని కాదు’ అన్నారు శ్రీనివాస మూర్తి. (బెంగళూరు అల్లర్లు: ముస్లింల సాహసం) అంతేకాక ‘గుర్తు తెలియని వ్యక్తులు నా ఇంటికి నిప్పంటించారు. పెట్రోల్ బాంబులను విసిరారు. పోలీసులు సకాలంలో రాకపోతే నా ఇంట్లో గ్యాస్ సిలిండర్‌ను పేల్చేసేవారు. ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన దాడి. పోలీసులు దీనిపై విచారణ చేయాలి. బాధ్యులను కఠినంగా శిక్షించాలి’ అని శ్రీనివాస మూర్తి డిమాండ్ చేశారు. ఓ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న తనకే ఇలా జరిగితే... ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. దాడులు చేసిన వారు తమ నియోజకవర్గానికి చెందిన వారు కాదని, బయటి వ్యక్తులన్నారు. ఈ విషయంపై హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడానని, తమ పార్టీ వారితో కూడా మాట్లాడినట్టు శ్రీనివాస మూర్తి తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. 100మంది గాయపడ్డారు. వీరిలో 60 మంది పోలీసులు ఉన్నారు. -
శ్రీనివాసమూర్తి మృతికి సుబ్బారెడ్డి సంతాపం
సాక్షి, తిరుపతి : తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు అర్చకం పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి పట్ల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా 20 ఏళ్లకు పైగా సేవలు అందించిన పెద్దింటి శ్రీనివాసమూర్తి గతేడాది పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ అనంతరం ఆయన తిరుపతిలోనే ఉంటున్నారు. ఏడాదిగా శ్రీవారి కైంకర్యాలకు దూరంగా ఉన్నారు. అయితే తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందితో నాలుగు రోజులకు ముందు ప్విమ్స్ ఆస్పత్రిలో చేరగా కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో పరిస్థితి విషమించి సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు తెలిపారు. శ్రీవారి ఆలయంలో వంశపారంపర్య కుటుంబాల నుంచి సేవలందిస్తున్న వారు ఎవరైనా పరమపదిస్తే ఆలయ సంప్రదాయం ప్రకారం సంప్రదాయ పద్ధతిలో వీడ్కోలు పలకాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన కరోనా బారిన పడి మృతి చెందడంతో మృతదేహాన్ని కూడా కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం లేని పరిస్థితి నెలకొంది. దీంతో కుటుంబసభ్యులే సాంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. (శ్రీనివాసమూర్తి దీక్షితులు కన్నుమూత) -
శ్రీనివాసమూర్తి దీక్షితులు కన్నుమూత
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు నిర్వహించే అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు సోమవారం కన్నుమూశారు. ఆయన వేకువజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీనివాసమూర్తి దీక్షితులు కరోనా వైరస్ సోకడంతో గత నాలుగు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా సేవలు అందిచారు.పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు గత ఏడాది పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ అనంతరం ఆయన తిరుపతిలోనే ఉంటున్నారు. ఏడాదిగా శ్రీవారి కైంకర్యాలకు దూరంగా ఉన్నారు. తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందితో నాలుగు రోజులకు ముందు స్వీమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించటంతో నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు. తిరుమల ఆలయ ప్రధాన అర్చకులుగా దాదాపు 20 ఏళ్లకు పైగా కొనసాగిన శ్రీనివాసమూర్తి దీక్షితులుకి ఆలయం తరపున సంప్రదాయ పద్ధతిలో వీడ్కోలు పలకాల్సి ఉంది. కాగా ప్రస్తుతం ఆయన కరోనా బారిన పడి మృతి చెందడంతో మృతదేహాన్ని కూడా కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం లేని పరిస్థితి నెలకొంది. తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు అకాల మృతిపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. -
నా చావుకి ఎమ్మెల్యే కారణం అంటూ పోస్టు చేసి.!
కర్ణాటక : నా చావుకి ఎమ్మెల్యేనే కారణం అంటూ ఫేస్బుక్లో పోస్టులు పెట్టింది ఓ మహిళ. తన గోడును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లేఖ రాసి శివకుమారి (30) అనే మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన నెలమంగలలో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం తన ఫేస్బుక్ ఖాతాలో ‘మహిళపై అత్యాచారం జరగాలి, లేదా హత్య జరగాలి. అప్పుడే ప్రభుత్వం న్యాయం చేస్తుందా?’ అని అని పోస్టుచేసింది. తరువాత, ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన నీచుడు నెలమంగల ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి. నా చావుకి అతడే కారణం’ అని మరో పోస్టుపెట్టి కాసేపటికే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. శివకుమారి గతంలోనూ ఎమ్మెల్యే తనను వేధిస్తున్నాడని, అతడికి లొంగలేదనే అక్కసుతో రౌడీలతో బెదిరించి తను ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఉద్యోగంలో కొనసాగడానికి వీలు లేకుండా చేశాడని శివకుమారి ఆరోపించారు. కొద్దినెలల క్రితం ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారని ఆమె అప్పట్లో ఫేస్బుక్, వాట్సప్‌లలో ముమ్మరంగా ప్రచారం చేయడం సంచలనం సృష్టించింది. అనంతరం ఉపాధ్యాయురాలి ఉద్యోగం వదిలేసిన శివకుమారి ఎమ్మెల్యేపై వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతూ ‘జనజాగృతి అభియాన్’ పేరున తాలూకాలో పర్యటిస్తూ ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు హఠాత్తుగా ఇలా ఫేస్బుక్ పోస్టులు పెట్టి ఆత్మహత్యాయత్నం చేసి కొత్త వివాదానికి తెరతీశారు. ప్రస్తుతం శివకుమారి మ్యాగ్నిస్ ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. పోలీసులు ఈ ఘటన గురించి ఆరా తీస్తున్నారు. -
మరమగ్గాలకు దీటుగా చేనేత మగ్గం
ధర్మవరం కళాకారుడి ప్రతిభ దర్మవరం టౌన్: అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన శ్రీనివాసమూర్తి చదివింది ఇంటర్. చేనేత కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఐదేళ్ల పాటు శ్రమించి ‘చేనేత బ్రహ్మాస్త్రం’ పేరిట ఆధునిక మగ్గాన్ని ఆవిష్కరించారు. దీనికి కరెంట్ కానీ, సోలార్ కానీ అవసరం లేదు. బుధవారం ఆయన విలేకరులకు తెలిపిన వివరాల మేరకు... సాధారణంగా చేనేత మగ్గం నేయాలంటే గుంతలో దిగి చెక్కను కాళ్లతో తొక్కుతూ శ్రమించాలి. ఈ ఆధునిక మగ్గం ద్వారా కుర్చీలో కూర్చుని కాళ్లతో పని లేకుండా నేయవచ్చు. వికలాంగులకు సైతం అనువుగా ఉంటుంది. మగ్గంలోని చెక్కలను స్ప్రింగ్‌లతో అనుసంధానం చేసి పళ్ల చక్రాలతో తయారు చేశారు. కుర్చీలో కూర్చుని పలక (మగ్గం) లాగితే జాకార్డులలో డిజైన్, కొమ్ము వేయడానికి అడ్డదారం వంటి పనులు ఒకేసారి జరుగుతాయి. సాధారణ మగ్గంలో నేత కార్మికుడు వారం పాటు శ్రమించి చీరను నే స్తే ఈ మగ్గంలో రెండు రోజుల్లో నేయవచ్చు. ఈ మగ్గాన్ని త్వరలోనే నేత కార్మికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు శ్రీనివాస మూర్తి చెప్పారు.