చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూశారు. చెన్నైలో నివాసం ఉంటున్న ఆయన గుండెపోటుతో మృతి చెందారు. డబ్బింగ్ రంగంలో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న శ్రీనివాస మూర్తి.. సూర్య, అజిత్, మోహన్‌లాల్, రాజశేఖర్, విక్రమ్ లాంటి అగ్రహీరోలకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఇటీవల విడుదలైన ‘తెగింపు’ చిత్రంలో అజిత్ పాత్రకి కూడా ఆయనే డబ్బింగ్ చెప్పారు.
శ్రీనివాస మూర్తిలాంటి గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ కోల్పోవడంపై తెలుగు, తమిళ ఇండస్ట్రీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఆయన ఎన్నో గొప్ప చిత్రాలకు, పెద్ద పెద్ద స్టార్లకు తన గాత్రాన్ని అందించారు. ఆయన చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోవడం పట్ల అభిమానులు, తోటి డబ్బింగ్ ఆర్టిస్టులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment