Suriya Emotional Tweet On Dubbing Artist Srinivasa Murthy Death - Sakshi
Sakshi News home page

Suriya: ఆయన మరణం వ్యక్తిగతంగా తీరని లోటు

Published Fri, Jan 27 2023 3:37 PM | Last Updated on Fri, Jan 27 2023 3:56 PM

Suriya Emotional Tweet On Loss of Dubbing Artist Srinivasa Murthy - Sakshi

సూర్య, అజిత్‌, విక్రమ్‌ లాంటి తమిళ స్టార్ హీరోలకు తెలుగు డబ్బింగ్‌ చెప్పిన ఆర్టిస్ట్‌ శ్రీనివాస మూర్తి ఇవాళ కన్నుమూశారు. చెన్నైలో నివాసం ఉంటున్న ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న హీరో సూర్య ఎమోషనల్ ట్వీట్ చేశారు. శ్రీనివాస మూర్తి సేవలను గూర్తు చేసుకుంటూ నివాళి అర్పించారు. 

(ఇది చదవండి:  ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ కన్నుమూత)

సూర్య ట్విటర్‌లో రాస్తూ.. 'ఇది నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. తెలుగులో నా నటనకు శ్రీనివాసమూర్తి వాయిస్, భావోద్వేగాలు ప్రాణం పోశాయి. నిన్ను కోల్పోతున్నందుకు చాలా బాధగా ఉంది. ' అంటూ ట్వీట్ చేశారు. కాగా.. సూర్య నటించిన సూపర్ హిట్ సినిమాలు సింగంలో డబ్బింగ్‌ చెప్పారు. ఈ రంగంలో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న శ్రీనివాస మూర్తి.. సూర్యతో పాటు అజిత్‌, మోహన్‌లాల్‌, రాజశేఖర్‌, విక్రమ్‌ లాంటి అగ్రహీరోలకు తెలుగులో డబ్బింగ్‌ చెప్పారు. ఇటీవల విడుదలైన ‘తెగింపు’ చిత్రంలో అజిత్‌ పాత్రకి కూడా ఆయనే డబ్బింగ్‌ చెప్పడం విశేషం. శ్రీనివాస మూర్తిలాంటి గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ కోల్పోవడంపై తెలుగు, తమిళ ఇండస్ట్రీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement