హైడ్రాకు పోలీస్‌ స్టేషన్‌.. భారీగా సిబ్బంది కేటాయింపు | Police Staff Allotment To Hydra Officers | Sakshi
Sakshi News home page

హైడ్రాకు పోలీస్‌ స్టేషన్‌.. భారీగా సిబ్బంది కేటాయింపు

Published Tue, Sep 10 2024 8:55 PM | Last Updated on Tue, Sep 10 2024 9:08 PM

Police Staff Allotment To Hydra Officers

సాక్షి, హైదరాబాద్‌: మహా నగరంలో చెరువుల సంరక్షణ, అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా) దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ పోలీస్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.  తాజాగా హైడ్రాకు భారీగా సిబ్బందిని కేటాయించింది.

హైడ్రాకు  15 మంది సీఐ స్థాయి, 8 మంది ఏఎస్‌ఐ అధికారుల కేటాయించారు.  పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటునకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు శాంతి భద్రతల అదనపు డీజీ మహేష్ భగవత్  ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమదారులపై కేసులు, విచారణను ఈ సిబ్బంది ముమ్మరం చేయనున్నారు. 

అయితే పలుచోట్ల కూల్చివేతలను స్థానికులు అడ్డుకుంటున్నారు. హైడ్రా అధికారులపై తిరగబడుతూ వారి విధులకు ఆటంకం కలిగిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement