కుమార్తెలకు ఇవ్వాలనుకున్న ఇళ్లు కూల్చేస్తారేమోనని ఉరి వేసుకుని బలవన్మరణం
కూకట్‌పల్లి (హైదరాబాద్): హైడ్రా అధికారులు తమ ఇళ్లు కూడా కూల్చివేస్తారేమో అన్న భయంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కూకట్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..కూకట్‌పల్లి రామాలయం సమీపంలోని యాదవబస్తీకి చెందిన గుర్రంపల్లి బుచ్చమ్మ (56 ).. భర్త శివయ్యతో కలిసి సొంత ఇంటిలో నివసిస్తోంది. వీరికి నల్లచెరువు సమీపంలో మరో రెండు ఇళ్లు, కారు షెడ్డు ఉన్నాయి. వీటిని అద్దెకు ఇచి్చన భార్యాభర్తలు పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కావడంతో తమ ఇళ్లను వారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే గత ఆదివారం హైడ్రా అధికారులు నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉన్న కొన్ని అక్రమ నిర్మాణాలను తొలగించారు. వీటికి ఎదురుగానే రోడ్డుకు ఆవతలి వైపు బుచ్చమ్మ ఇళ్లు, కారు షెడ్డు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న నిర్మాణాలను సైతం హైడ్రా అధికారులు కూల్చేస్తారని స్థానికులు చర్చించుకుంటున్నారు. దీంతో బుచ్చమ్మ ఆందోళనకు గురై శుక్రవారం సాయంత్రం భర్త హాల్లో ఉండగానే బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ‘మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కష్టపడి మా కోసం ప్లాట్లు కొని ఇళ్లు కట్టించారు. అయితే హైడ్రా వాళ్లు చుట్టుపక్కల ఇళ్లు పడగొడుతున్నారు. మా ఇళ్లూ అలాగే అవుతాయనే టెన్షన్‌తో మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది..’ అని బుచ్చమ్మ కుమార్తె సరిత చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment