ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలు కూల్చివేతకు వచ్చిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సోమవారం ఎలాంటి చర్యలు చేపట్టకుండానే వెనుదిరిగారు.
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలు కూల్చివేతకు వచ్చిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సోమవారం ఎలాంటి చర్యలు చేపట్టకుండానే వెనుదిరిగారు. స్థానికులు ఒక రోజు సమయం ఇవ్వాలని కోరడంతోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పట్టణంలోని ప్రభుత్వ భూములను పలువురు అక్రమించారు.
మరికొంత మంది అనుమతి లేని నిర్మాణాలు చేపట్టారు. దీంతో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు కూల్చివేయాలని మున్సిపల్, రెవెన్యూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.