కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇలాంటి నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. చట్టాలను ఉల్లంఘిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా కరకట్ట లోపల నిర్మించిన నిర్మాణాలన్నింటికీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) నోటీసులను సిద్ధం చేసింది.