చిత్తూరు పట్టణంలోని గంగినేని చెరువు వద్ద అక్రమణలను బుధవారం అధికారులు తొలగించారు.
చిత్తూరు: చిత్తూరు పట్టణంలోని గంగినేని చెరువు వద్ద అక్రమణలను బుధవారం అధికారులు తొలగించారు. చెరువుకట్ట వద్ద కొందరు గుడిసెలు, రేకుల ఇళ్లు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు. వీటిని ఖాళీ చేయాలని అధికారులు నెల రోజుల క్రితమే వారికి నోటీసులు జారీ చేశారు. అయినా స్పందన లేకపోవడంతో బుధవారం ఉదయం రెవెన్యూ అధికారులు, పోలీసులతో వచ్చి జేసీబీలతో ఇళ్లను తొలగించారు. అంతకుముందు స్థానికులు తమ ఇళ్లను కూల్చవద్దంటూ అధికారులను అడ్డుకున్నారు. జేసీబీల ముందు పడుకుని హంగామా సృష్టించారు. పోలీసులు వారిని బలవంతంగా పక్కకు నెట్టేశారు.