బీహెచ్ఈఎల్ ఎంఐజీలో అక్రమ కట్టడాల కూల్చివేత | Demolish illegal constructions Brake in BHEL MIG | Sakshi
Sakshi News home page

బీహెచ్ఈఎల్ ఎంఐజీలో అక్రమ కట్టడాల కూల్చివేత

Published Tue, Jul 15 2014 1:20 PM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM

బీహెచ్ఈఎల్ ఎంఐజీలో అక్రమ కట్టడాల కూల్చివేత

బీహెచ్ఈఎల్ ఎంఐజీలో అక్రమ కట్టడాల కూల్చివేత

హైదరాబాద్ : అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. శేరిలింగంపల్లి బీహెచ్ఈఎల్ ఎంఐజీ ఫేజ్-3లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం కూల్చివేశారు. పోలీసుల మోహరింపు మధ్య అక్రమంగా నిర్మించిన మూడు భవనాలను పొక్లెయిన్లతో కూల్చివేశారు. మరోవైపు కూల్చివేతలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులు ఇప్పుడు ఎలా కూల్చివేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతకు జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ 809 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించింది. వాటిలో 172 పెద్ద నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement