Gurukul Trust
-
గురుకుల కొలువులు 9,231
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. వివిధ కేటగిరీల్లో ఏకంగా 9,231 ఉద్యోగాల భర్తీకోసం తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఏకకాలంలో తొమ్మిది నోటిఫికేషన్లను జారీచేసింది. కేటగిరీల వారీగా పోస్టుల వివరాలను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్ (http://treirb.telangana.gov.in)లో అందుబాటులో ఉంచింది. ఆయా పోస్టులకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్లను ప్రకటనలో నిర్దేశించిన తేదీల్లో విడుదల చేస్తామని బోర్డు కన్వీనర్ మల్లయ్య భట్టు తెలిపారు. దాదాపు ఏడాదిపాటు కసరత్తు చేసిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. ఎట్టకేలకు ప్రకటన జారీచేయడంతో అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత గురుకులాల్లో పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీ చేపట్టడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. నెల రోజులు గడువుతో.. గురుకుల బోర్డు జారీచేసిన నోటిఫికేషన్లు ఇప్పటికే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. పోస్టుల వారీగా దరఖాస్తుల తేదీ ప్రారంభం, ముగింపు, పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఎప్పుడు పెడతారన్న వివరాలను వాటిలో వెల్లడించారు. కొన్నిరకాల పోస్టులకు ఈనెల 17వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం కానుండగా.. మరికొన్నింటికి ఈ నెల 24న, 28న మొదలుకానున్నాయి. అన్ని కేటగిరీల పోస్టులకు దరఖాస్తులు మొదలైన నాటి నుంచి నెలరోజుల పాటు గడువు ఉంటుంది. దాదాపు అన్ని పోస్టులకు మే నెలలో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. గడువు ముగిశాక నెలన్నర నుంచి రెండు నెలల పాటు సన్నద్ధతకు అవకాశం ఉంటుందని.. తర్వాత అందుబాటులో ఉన్న తేదీల్లో పరీక్షలను నిర్వహించే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రస్థాయిలో ఇతర నియామక బోర్డులతో సమన్వయం చేసుకోవడంతోపాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌లను పూర్తిగా పరిశీలించి.. ఇబ్బందిలేని రోజుల్లో పరీక్షల నిర్వహణను ఖరారు చేయనున్నట్టు వెల్లడించాయి. సైలెంట్‌గా ప్రకటన విడుదల గురుకుల పోస్టుల భర్తీ నోటిఫికేషన్లను టీఆర్‌ఈఐఆర్‌బీ గుట్టుచప్పుడు కాకుండా విడుదల చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. సాధారణంగా ఉద్యోగ నియామక ప్రకటనలను సదరు నియామక సంస్థ విడుదల చేయడం, మీడియా సమావేశం పెట్టి వెల్లడించడం జరుగుతుంది. గతంలో గురుకుల నియామకాల బోర్డు ఏర్పాటు చేసిన సమయంలో అప్పటి బోర్డు చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగ ప్రకటనలు విడుదల చేశారు. కానీ ఇప్పుడు భారీగా గురుకుల ఉద్యోగాల భర్తీ చేపడుతున్నా.. కేవలం ఒకట్రెండు పత్రికల్లో యాడ్ (అడ్వర్టైజ్మెంట్) రూపంలో ఇవ్వడం గమనార్హం. ఓటీఆర్ ఉంటేనే దరఖాస్తు... తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మాదిరిగానే గురుకుల నియామకాల బోర్డు కూడా ఓటీఆర్ (వన్‌టైమ్ రిజిస్ట్రేషన్) విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించింది. ఐదేళ్ల క్రితం కేవలం డిగ్రీ లెక్చరర్ కేటగిరీకి మాత్రమే ఓటీఆర్‌ను అనుసరించగా.. ఇప్పుడు ప్రతి దరఖాస్తుకు ఓటీఆర్ తప్పనిసరి చేసినట్టు నోటిఫికేషన్లో ప్రకటించింది. ఓటీఆర్ ప్రక్రియ ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు ముందుగా ఓటీఆర్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాకే గురుకుల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి వచ్చిన జోనల్ విధానానికి అనుగుణంగా ఓటీఆర్ ఆప్షన్లను సిద్ధం చేశారు. ప్రతి అభ్యర్థి విద్యార్హతలు, బోనఫైడ్లు, కుల ధ్రువీకరణ వంటి సర్టిఫికెట్లన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓటీఆర్ ప్రక్రియతో వెబ్‌సైట్‌పై తీవ్ర ఒత్తిడి పడేఅవకాశం ఉండడంతో.. దరఖాస్తులకు ఐదు రోజుల ముందుగానే ప్రారంభించినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. గురుకుల కొలువుల దరఖాస్తు ఫీజు గతంలో రూ.600గా ఉండేది. ఇప్పుడు కూడా అంతేస్థాయిలో ఫీజు నిర్ధారించే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు గురుకుల విద్యాసంస్థల్లో దాదాపు 12వేల ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 9వేల ఉద్యోగాల భర్తీకి గతేడాది జూన్‌లోనే అనుమతులు వచ్చాయి. 2022–23 విద్యా సంవత్సరంలో బీసీ గురుకుల సొసైటీ పరిధిలో మరిన్ని విద్యాసంస్థలు తెరవడంతో.. వాటిలోని పోస్టులను కూడా ఒకేదఫాలో భర్తీ చేయాలనే ఉద్దేశంతో నోటిఫికేషన్ల జారీ కోసం బోర్డు వేచిచూసింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం మరో 2,225 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చింది. అయితే తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్లలో 9వేలకుపైగా ఉద్యోగాలనే ప్రకటించారు. మిగతా కొలువులకు సంబంధించి త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది. ప్రధానంగా వ్యవసాయ డిగ్రీ కళాశాలలు, ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజీలు, ఇతర సాంకేతిక కాలేజీల్లో పోస్టులు మంజూరైనా.. వాటికి సంబంధించిన సర్వీసు నిబంధనలు ఖరారు కాలేదు. దీనిపై స్పష్టత రాగానే ఉద్యోగ ప్రకటనలు రానున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. -
మరోసారి అక్రమ కట్టడాల కూల్చివేత
-
బీహెచ్ఈఎల్ ఎంఐజీలో అక్రమ కట్టడాల కూల్చివేత
హైదరాబాద్ : అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. శేరిలింగంపల్లి బీహెచ్ఈఎల్ ఎంఐజీ ఫేజ్-3లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం కూల్చివేశారు. పోలీసుల మోహరింపు మధ్య అక్రమంగా నిర్మించిన మూడు భవనాలను పొక్లెయిన్లతో కూల్చివేశారు. మరోవైపు కూల్చివేతలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులు ఇప్పుడు ఎలా కూల్చివేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతకు జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ 809 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించింది. వాటిలో 172 పెద్ద నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. -
'ఆ రెండు ప్రాంతాల' మినహా కూల్చివేతలు
హైదరాబాద్ : అక్రమ భవనాల కూల్చివేతలపై జీహెచ్ఎంసీ వివరణ ఇచ్చింది. ఎల్బీనగర్, గోకుల్ ప్లాట్స్ మినహా మిగతా ప్రాంతాల్లో కూల్చివేతలు కొనసాగుతాయని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. పోలీసులు తక్కువగా ఉన్నందువల్ల కొన్ని ప్రాంతాల్లో కూల్చివేతలు వాయిదా వేసినట్లు ఆయన మంగళవారమిక్కడ చెప్పారు. మిగిలిన అక్రమ భవనాలను ఎప్పుడు కూల్చివేసేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కాగా ఇటీవలే గురుకుల్ ట్రస్ట్, అయ్యప్పసొసైటీలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేసిన అధికారులు తాజాగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో నేటి నుంచి కూల్చివేతకు సిద్ధమయ్యారు. అక్రమ నిర్మాణాలపై నిఘా వేసిన జీహెచ్ఎంసీ అధికారులు 890 అక్రమ నిర్మాణాలను గుర్తించడంతో పాటు వాటికి సంబంధించి రిజిస్టర్లు కూడా తయారు చేశారు. వాటిల్లో భారీ అక్రమాలకు పాల్పడిన 172 భవనాలను కూల్చివేయాలని నిర్ణయించారు. -
హైదరాబాద్‌పై సర్వాధికారాలు మావే: కేటీఆర్
-
హైదరాబాద్‌పై సర్వాధికారాలు మావే: కేటీఆర్
రెండు రాష్ట్రాలకు తాత్కాలికంగా ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరంపై సర్వాధికారాలు తమవేనని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు (కేటీఆర్) స్పష్టం చేశారు. శాంతి భద్రతల అంశం ముమ్మాటికీ రాష్ట్రానికి సంబంధించినదేనని, దాన్ని దురాక్రమిస్తే సహించబోమని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా నిన్న మొన్నటి వరకు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే ఉన్నందున ఆయన రాష్ట్రాల అధికారాల విషయాన్ని గుర్తించాలని చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్ అధికారాల విషయంలో తమకు ఇబ్బందులు సృష్టిస్తే చట్టపరంగా ఎదుర్కొంటామని ఆయన అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ అతిథి అని, ఆయన హైదరాబాద్‌లో నిరభ్యంతరంగా ఉండొచ్చని కేటీఆర్ తెలిపారు. అయితే.. గురుకుల భూముల్లో చంద్రబాబుకు ఎవరైనా బినామీలున్నారా, అక్కడ అక్రమ నిర్మాణాలు కూలిస్తే చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. -
గురుకుల్ ట్రస్ట్‌లో ఇంటింటి సర్వే
సాక్షి, హైదరాబాద్ : గురుకుల్ ట్రస్ట్‌లోని అక్రమ నిర్మాణాలపై సమగ్ర సర్వేకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఇటీవల ఈ ట్రస్ట్‌లోని నిర్మాణంలో ఉన్న కొన్ని భవనాలను కూల్చివేయడంతో పాటు మరికొన్ని భవనాలకు తాళాలు వేసిన సంగతి విదితమే. అయితే జీహెచ్ఎంసీ వద్ద ట్రస్ట్‌లోని ఆయా భవనాలకు సంబంధించిన సమగ్ర సమాచారం లేదు. ట్రస్ట్‌లోని భవనాలకు నిర్మాణ అనుమతి లేకపోయినప్పటికీ, చాలా వాటికి తాగునీరు, విద్యుత్ సదుపాయాలున్నాయి. కొన్ని భవనాలకు నిర్మాణ అనుమతులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని విభాగాలతో కూడిన సమన్వయ కమిటీతో సర్వే చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ గురుకుల్ ట్రస్ట్‌లో సోమవారం నుంచి ఇంటింటి సర్వే నిర్వహిస్తుందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. కమిటీ గుర్తించిన అంశాలతో సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయనున్నారు. భవనాల ఆస్తిపన్ను టిన్ నంబర్ తరహాలో ఒక యూనిక్ నంబరును కేటాయించనున్నట్లు చెప్పారు. సదరు నంబరు ద్వారా భవనానికి సంబంధించిన పూర్తివివరాలు తెలిసేలా డేటాబేస్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు. ఆయా ప్రభుత్వ విభాగాలతో కూడిన ఐదు బృందాలు ఈ సర్వేలో పాల్గొంటాయని చెప్పారు. -
దుకుడు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘పెట్టుబడుల ఆకర్షణలో కొత్త ఒరవడిని సృష్టిస్తాం. తగవుల్లేని భూముల కేటాయింపుతో పారిశ్రామికవేత్తలకు ద్వారాలు తెరుస్తాం. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయలాంటి రంగారెడ్డి జిల్లాలోని విలువైన ప్రభుత్వ భూములను కాపాడడం మా ప్రధాన కర్తవ్యం’ అని జిల్లా కలెక్టర్ నడిమట్ల శ్రీధర్ స్పష్టం చేశారు. గురుకుల్ ట్రస్ట్, యూఎల్సీ, సీలింగ్, అసైన్మెంట్ భూముల సర్వేలో దూకుడు ప్రదర్శిస్తూ... గతి తప్పిన సర్కారీ శాఖలను గాడిలో పెట్టేదిశగా కార్యాచరణ సిద్ధం చేసిన కలెక్టర్ శ్రీధర్ సోమవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏమన్నారో ఆయన మాటల్లోనే... ప్రభుత్వ భూముల పరిరక్షణ ప్రాధాన్యాతాంశాల్లో మొదటిది ప్రభుత్వ భూముల పరిరక్షణ. జిల్లాలోని వివిధ కేటగిరీల కింద పంపిణీ/బదలాయించిన 1.50 లక్షల ఎకరాల భూములను రీసర్వే చేసి అన్యాక్రాంతమైన భూములను గుర్తిస్తున్నాం. వివిధ సంస్థలకు కేటాయించిన 39 వేల ఎకరాల్లో ఆయా సంస్థలు ఏ మేరకు వాడుకున్నాయనే అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం. సుమారు 13వేల ఎకరాలు ఇంకా వినియోగంలోకి రాలేదని గుర్తించా. ఆక్రమణకు గురైన గురుకుల్ ట్రస్ట్‌లో భూముల సర్వే పూర్తయింది. 200 ఎకరాల్లో బహుళ అంతస్తులు, మరో 200 ఎకరాల్లో చిన్నపాటి నిర్మాణాలు వెలిశాయి. మిగతా భూమి ఖాళీగా ఉన్నట్లు గుర్తించాం. ఇప్పటికే కొన్నింటిని జీహెచ్ఎంసీ కూల్చేసింది. మిగతావాటి విషయంలోను త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ‘ఎన్’ కన్వెన్షన్‌లో తమ్మడి కుంట.. ‘ఎన్’ కన్వెన్షన్ అక్రమ నిర్మాణం. తమ్మడికుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో 3.24 ఎకరాలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించినట్లు సర్వేలో తేలింది. యాజమాన్యానికి నోటీసులు జారీ చేస్తున్నాం. గురుకుల్ ట్రస్ట్ భూమిని క్రమబద్ధీకరించాలని యూఎల్సీ వద్ద 2,833 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ భూములపై కోర్టుల్లో కూడా కేసులు ఉన్నందున.. ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా అడుగులు వేస్తాం. పరిశ్రమలకు లిటిగేషన్ లేని భూములు ఐటీ, ఫార్మా రంగాలకు అనువైన జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు భూములను సమీకరిస్తున్నాం. వివిధ సంస్థలు అట్టిపెట్టుకున్న 13వేల ఎకరాల భూములేగాక వేర్వేరు చోట్ల బిట్లుబిట్లుగా ఉన్న ఉన్న ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నాం. న్యాయపరమైన చిక్కులు లేకుండా క్లియర్‌గా ఉన్న భూములను పరిశ్రమలకు కేటాయించేలా జాబితా రూపొందిస్తున్నాం. ప్రభుత్వం పారిశ్రామిక పాలసీ తయారు చేసేలోగా ల్యాండ్ బ్యాంక్‌ను రెడీ చేసుకోవాలని నిర్ణయించాం. భూమిలేని పేదలకు పంపిణీ చేసిన లక్ష ఎకరాల అసైన్డ్భూములను కూడా సర్వే చేయిస్తున్నాం. శివారు మండలాల్లో 2,500 ఎకరాల యూఎల్సీ భూములను కూడా రీసర్వే చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించాం. దళితుల సమగ్రాభివృద్ధి దళితుల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రతి ఎస్సీ కుటుంబానికి మూడెకరాల భూమిని పంపిణీ చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించాం. భూమిలేని 4,700 కుటుంబాల్లో తొలి విడతగా పంద్రాగస్టున కొందరికి భూ పంపిణీ చేస్తాం. పనిదొంగల భరతం పడతా.. సమయపాలన పాటించని ఉద్యోగులపై కఠినంగా వ్యవహరిస్తా. రోజూ కలెక్టరేట్ నుంచి ఉద్యోగుల పనితీరును పర్యవేక్షిస్తా. ఉద్యోగులు సమయానికి విధులకు హాజరవుతున్నారా? లేదా అనే ది తెలుసుకునేందుకు నేరుగా కార్యాలయాలకే ఫోన్ చేస్తా. 64 మందికి శ్రీముఖాలు విధుల్లో అలసత్వం వహించినందుకే వైఖరి మారకుంటే వేటు: కలెక్టర్ శ్రీధర్ విధినిర్వహణలో అలసత్వం వహించిన ఉద్యోగులపై కలెక్టర్ ఎన్.శ్రీధర్ సీరియస్ అయ్యారు. గతవారంలో వరుసగా రెండ్రోజుల పాటు కొందరు అధికారులతో సంక్షేమ వసతిగృహాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేయించారు. అనంతరం వారి నుంచి వచ్చిన నివేదికలపై సమీక్షించారు. అయితే ఇందులో చాలావరకు వసతిగృహ అధికారులు, ప్రభుత్వ వైద్యులు విధులకు గైర్హాజరు కావడాన్ని గమనించి తీవ్రంగా పరిగణించారు. విధుల్లో అలసత్వం వహించిన 64 మందికి షోకాజ్‌నోటీసులు జారీ చేశారు. ఇందులో 32 మంది సంక్షేమాధికారులు కాగా, మిగిలిన వారు పీహెచ్సీ వైద్యులు, కిందిస్థాయి సిబ్బంది ఉన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కలెక్టర్ ఎన్.శ్రీధర్ స్పష్టం చేశారు. -
పది సూత్రాలతో స్పెషల్ డ్రైవ్
గురుకుల్ భూము ల్లో అక్రవూలకు కట్టడి నాలుగో రోజు 11 భవనాల సీజ్ ఎన్ కన్వెన్షన్‌పైనా అధికారుల సర్వే అక్రవూలు జరగకుండా ప్రచారం సీఎంను కలిసేందుకు వచ్చిన బాధితులు అపారుుంట్‌మెంట్ లేకపోవడంతో నిరాకరణ హైదరాబాద్: గురుకుల్ ట్రస్ట్ భూముల్లోని భవనాలను సీజ్ చేసే పనిని జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం ప్రారంభించారు. తొలిదశలో నిర్మాణం జరుగుతున్న భవనాలను కూల్చివేసిన అధికారులు రెండో దశలో భాగంగా నిర్మాణం పూర్తయి.. ఖాళీగా ఉన్న భవనాలను సీజ్ చేసే పనిని చేపట్టి 11 భవనాలను సీజ్ చేశారు. ట్రస్ట్ భూముల పరిరక్షణకు పది సూత్రాలతో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. కూల్చివేతలుంటాయి.. నిర్మాణం జరుగుతున్న భవనాల కూల్చివేతలు ఇంకా ఉంటాయని సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. అలాంటి కొన్ని భవనాలు గుర్తించామని, పాటించాల్సిన విధివిధానాలు పూర్తికాగానే వాటిని కూల్చివేస్తామని చెప్పారు. ఖాళీ స్థలాలు, ప్లాట్లు, భవనాలు కొనేముందు వాటిని కొనవచ్చా, లేదా, అనే అంశంపై తగిన అవగాహన లేకే చాలామంది గురుకుల్ట్రస్ట్లో కొనుగోళ్లు చేశారన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రజలకు తగిన అవగాహన కల్పించేందుకు భారీయెత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై క్రిమినల్ కేసులు పెట్టే అధికారం కూడా జీహెచ్ఎంసీకి ఉందని, ఉల్లంఘనులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందన్నారు. అక్యుపెన్సీ సర్టిఫికెట్ లేనప్పటికీ, విద్యుత్, నీటి సదుపాయాలు పొందిన భవనాలకు వాటిని తొలగించాల్సిందిగా సంబంధిత అధికారులకు మరోమారు లేఖ రాస్తామని చెప్పారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ అక్రమ కట్టడాలను అడ్డుకునేందుకు వివిధ విభాగాల సీనియర్ అధికారులు స్పెషల్డ్రైవ్పై శ్రద్ధ వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం కోసం 200 మందికి పైగా పోలీసులను విధుల్లో ఉంచుతున్నామన్నారు. ఎన్ కన్వెన్షన్‌పై సర్వే.. ట్రస్ట్ భూముల్లో చర్యలకు సిద్ధమైన అధికారులు సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పైనా దృష్టి సారించారు. తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ ఉందనే అభిప్రాయాలుండటంతో రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు, నీటిపారుదల శాఖల అధికారులు సర్వే కార్యక్రమాలు చేపట్టారు. సర్వే పూర్తయ్యాక.. ఎఫ్టీఎల్ మేరకు మార్కింగ్ చేయనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలితే ఎన్ కన్వెన్షన్‌కు సైతం నోటీసు జారీ చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు సంబంధించి కూల్చివేతలు జరుపకుండా కోర్టు స్టే ఉన్నట్లు సమాచారం. దొరకని సీఎం అపాయింట్మెంట్ కూల్చివేతలు ఆపాలంటూ వినతిపత్రం ఇచ్చేందుకు అయ్యప్ప సొసైటీ వాసులు సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ముందస్తు అపాయింట్మెంట్ లేకపోవడంతో వారికి సీఎంను కలిసే అవకాశం లభించలేదు. అయ్యప్ప సొసైటీ సంక్షేమ సంఘం కార్యదర్శి ప్రసాద్ నేతృత్వంలో దాదాపు 150 మంది వెళ్లారు. కూల్చివేతల అనంతరం అయ్యప్పసొసైటీలోని 60 అడుగుల రోడ్డులో నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపడితే మూడేళ్లు జైలు శిక్ష పడుతుందని బ్యానర్లు కట్టడంతో సొసైటీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. సీఎల్పీ నాయకులు జానారెడ్డి, డీఎస్‌లను కలిసినట్లు తెలిసింది. తమ వంతు సాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లు సవూచారం. కాగా, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకకపోవడంతో గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని తమ సమస్యను వినిపించాలని అయ్యప్ప సొసైటీ వాసులు యుత్నిస్తున్నారు. పది సూత్రాలివీ... 1. గురుకుల్ ట్రస్ట్‌లోని భూములు కొనవ ద్దని ప్రచారం 2. అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేస్తామని ఆయా ప్రవేశ మార్గాల వద్ద హెచ్చరికల బోర్డులు. 3. అక్రమ నిర్మాణాలపై ‘అక్రమ కట్టడం’ అని కనిపించేలా ఎర్రరంగుతో రాయుడం. 4. కూల్చివేతల ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేత 5. విద్యుత్ కనెక్షన్లు ఇవ్వరాదని టీజీఎస్పీడీసీఎల్కు మరోమారు లేఖ 6. నీటి కనెక్షన్లు ఇవ్వవద్దని జలమండలికి లేఖ 7. విద్యుత్ కనెక్షన్లు ఉన్నవారి నుంచి మూడు రెట్ల ఫీజు విధింపు వర్తింపచేయాలని టీజీఎస్పీడీసీఎల్కు లేఖ 8. గురుకుల్ ట్రస్ట్ భూముల్లో ఉన్న తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణ 9. నిర్మాణాలు జరుగుతున్న మిగతా భవనాల కూల్చివేత 10.నిర్మాణం పూర్తయిన భవనాల సీజ్ -
ఆక్రమణదారులు ఎవరైనాసరే కఠినంగా ఉండాలి: కేసీఆర్
హైదరాబాద్: గురుకుల ట్రస్ట్ భూముల్లో ఆక్రమణల తొలగింపుపై ఉన్నతాధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సామాన్యుల ఇళ్లనే తొలగిస్తున్నారనే ప్రచారం జరుగుతోందని.. అధికారులు పెద్దల జోలికి ప్రభుత్వం వెళ్లట్లేదనే వార్తలు మీడియాలో వస్తున్న విషయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆక్రమణదారులు ఎవరైనాసరే కఠినంగా ఉండాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. అక్రమ నిర్మాణాల తొలిగింపును కొనసాగించాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గురుకుల్ ట్రస్ట్ భూముల్లో అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు గత కొద్దిరోజులుగా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. -
తొలగింపు.. కొనసాగింపు
‘గురుకుల్’ కూల్చివేతలపై స్థానికుల నిరసన ఇద్దరు ఎమ్మెల్యేల అరెస్ట్ హైదరాబాద్: గురుకుల్ ట్రస్టులో బుధవారం కూడా కూల్చివేతలు కొనసాగాయి. ఉదయాన్నే జీహెచ్ఎంసీ అధికారులు పోలీసు బలగాలతో వచ్చి బృందాలుగా విడిపోయి నిర్మాణాలను తొలగిం చారు. మంగళవారం 16 భవనాలను పడగొట్టిన అధికారులు.. బుధవారం 8 నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేశారు. తొలగింపు ప్రక్రియును నిరసిస్తూ స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళనకు దిగారు. అధికారులకు, కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినదించారు. దీంతో పోలీసులు కార్పొరేటర్‌తో సహా 28 మందిని, ఏడుగురు మహిళలను అరెస్ట్ చేసి నార్సింగిలోని ఎస్ఓటీ కార్యాలయానికి తరలించారు. కాగా కూల్చివేతలను అడ్డుకునేందుకు మాదాపూర్ వస్తున్న శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వివేక్, కార్పొరేటర్లు అశోక్‌గౌడ్, రంగారావు, భానుప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పెద్దల భవనాలు వదిలి రాజకీయ అండ లేని వారి భవనాలను కూల్చివేస్తున్నారని ఎమ్మెల్యేగాంధీ ఆరోపించారు. పాత నోటీసులను పరిశీలిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు లేకుండా గురుకుల్ ట్రస్టులో కూల్చివేతలు ఎలా చేస్తారని హైకోర్టు ప్రశ్నించడంతో జీహెచ్ఎంసీ పాత రికార్డుల తనిఖీ పనిలో పడింది. కూల్చివేతలకు ముందు, తరువాత నిర్మాణాల యజమానులకు ఇచ్చిన కొన్ని నోటీసులను బయటకు తీస్తున్నారు. వీటిని అవసరమైతే హైకోర్టుకు సమర్పించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.