తొలగింపు.. కొనసాగింపు
‘గురుకుల్’ కూల్చివేతలపై స్థానికుల నిరసన
ఇద్దరు ఎమ్మెల్యేల అరెస్ట్
హైదరాబాద్: గురుకుల్ ట్రస్టులో బుధవారం కూడా కూల్చివేతలు కొనసాగాయి. ఉదయాన్నే జీహెచ్‌ఎంసీ అధికారులు పోలీసు బలగాలతో వచ్చి బృందాలుగా విడిపోయి నిర్మాణాలను తొలగిం చారు. మంగళవారం 16 భవనాలను పడగొట్టిన అధికారులు.. బుధవారం 8 నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేశారు. తొలగింపు ప్రక్రియును నిరసిస్తూ స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళనకు దిగారు. అధికారులకు, కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినదించారు. దీంతో పోలీసులు కార్పొరేటర్‌తో సహా 28 మందిని, ఏడుగురు మహిళలను అరెస్ట్ చేసి నార్సింగిలోని ఎస్‌ఓటీ కార్యాలయానికి తరలించారు. కాగా కూల్చివేతలను అడ్డుకునేందుకు మాదాపూర్ వస్తున్న శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వివేక్, కార్పొరేటర్లు అశోక్‌గౌడ్, రంగారావు, భానుప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పెద్దల భవనాలు వదిలి రాజకీయ అండ లేని వారి భవనాలను కూల్చివేస్తున్నారని ఎమ్మెల్యేగాంధీ ఆరోపించారు.
పాత నోటీసులను పరిశీలిస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారులు
నోటీసులు లేకుండా గురుకుల్ ట్రస్టులో కూల్చివేతలు ఎలా చేస్తారని హైకోర్టు ప్రశ్నించడంతో జీహెచ్‌ఎంసీ పాత రికార్డుల తనిఖీ పనిలో పడింది. కూల్చివేతలకు ముందు, తరువాత నిర్మాణాల యజమానులకు ఇచ్చిన కొన్ని నోటీసులను బయటకు తీస్తున్నారు. వీటిని అవసరమైతే హైకోర్టుకు సమర్పించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.