అక్రమ నిర్మాణాల కూల్చివేతల పర్వం మూడో రోజుకు కూడా కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్బీనగర్, దిల్
హైదరాబాద్ : అక్రమ నిర్మాణాల కూల్చివేతల పర్వం మూడో రోజుకు కూడా కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, బీఎన్ రెడ్డి నగర్, సరూర్ నగర్, ఏఎస్ రావ్ నగర్లోని అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కాగా బీఎన్ రెడ్డి నగర్ లోని చైతన్య నగర్ లోని అయిదో అంతస్తును కూల్చివేశారు. కాగా కూల్చివేతలు ఆపాలంటూ స్థానికుల ఆందోళనకు దిగారు. దాంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
కాగా నిన్న కాప్రా, ఉప్పల్, సైదాబాద్, ధూల్ పేట, గుడిమల్కాపూర్, అంబర్ పేట, ఆదర్శనగర్, రాజేంద్ర నగర్, నల్లగండ్ల, శేరిలింగంపల్లి, సీతాఫల్ మండీ, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో 19 భవనాలను అధికారులు నేలమట్టం చేశారు. గడిచిన రెండు రోజులగుఆ మొత్తం 25 భవనాలకు కూల్చివేశారు.