unauthorised construction
-
అనధికార భవనాలను కూల్చేయండి! కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు
ముంబై: అనధికార భవనాలు కారణంగా ఒక్క అమాయకుడి ప్రాణాలు పోయిన ఉరుకోమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అటువంటి నిర్మాణాల వల్ల కలిగే ప్రమాదాలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. ముంబైలో అనేక కుటుంబాలు నివశిస్తున్న తొమ్మిది అనధికార భవనాలను కూల్చివేయాలంటూ... ధానేకి చెందిన ముగ్గురు నివాశితులు పిటిషిన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చీఫ్ జస్టీస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన ధర్మాసనం విచారించిన సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. 1998 నాటి ప్రభుత్వ తీర్మానం ఇప్పటికీ అమలులో ఉందన్న విషయాన్ని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తుచేసింది. అయినా వర్షాల సమయంలో అనధికార నిర్మాణాలను పౌర అధికారులు ఎందుకు కూల్చివేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఐతే థానే మునిసిపల్ కార్పొరేషన్ (టిఎంసీ) అనధికార నిర్మాణాలకు అనేక కూల్చివేత నోటీసులు అందించినప్పటికీ, నివాసితులు అక్కడ నివశిస్తున్నారని పిటిషనర్ల తరుపు న్యాయవాది నీతా కర్ణిక్ పేర్కొన్నారు. ఈ మేరకు టీఎంసీ తరుఫు న్యాయవాది రామ్ ఆప్టే, తొమ్మిది భవనాలను కూల్చివేతలకు పౌర సంఘం అనేక నోటీసులు పంపిందని, అయితే నివాసితులు ఖాళీ చేయడానికి నిరాకరించారని ధర్మాసనానికి తెలిపారు. ఇదిలా ఉండగా సంబంధిత భవనాల తరుఫు న్యాయవాది సుహాస్ ఓక్ మానవతా దృక్పథంతో వ్యవహరించి కనీసం వర్షాకాలం ముగిసే వరకు భవనాలను కూల్చివేయకుండా టీఎంసీని ఆపాలని కోర్టును కోరారు. దీనికి ప్రతి స్పందనగా ధర్మాసనం ..." మేము మానవతా దృక్పథంతో వ్యవహరించే అనధికారిక భవనాల వల్ల ఒక్క అమాయకుడి ప్రాణం పోకూడదని అనుకుంటున్నాం. వారంతా సురక్షిత ప్రదేశంలో ఉండాలని ఆశిస్తున్నాం. అంతేకాదు ఒక్క భవనం కూలిపోతే అనేక ప్రాణాలు పోవడమే కాదు, పక్కనున్న భవనాలను కూడా నేలమట్టం చేయవచ్చు అని వెల్లడించింది. అదీగాక డిసెంబరు 2021లోనే ఈ కేసుని సుమోటాగా తీసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో ఉన్న అనధికార భవనాలన్నింటినీ కూల్చివేయాలని..ఒక ఉత్తర్వును కూడా జారీ చేసినట్లు ధర్మాసనం పేర్కొంది. అయినప్పటికీ నివాసితులు దీన్ని అర్థం చేసుకోవడం లేదంటూ చివాట్లు పెట్టింది. అంతేకాదు సంబంధిత భవనాల్లో ఉంటున్న నివాసితులందరూ ఆగస్టు 31లోగా ఖాళీ చేస్తామని హామీ ఇవ్వాలని కూడా స్పష్టం చేసింది. మరోవైపు టీఎంసీని కూడా ఆగస్టు 31 దాక భవనాలను కూల్చివేయద్దని ధర్మాసనం ఆదేశించింది. సాధ్యమైనంతవరకు ఈ ఉత్తర్వును త్వరితగతిన అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఐతే ఇలాంటి అనధికార భవనాలు ముంబైలో సుమారు 30 దాక ఉన్నట్లు సమాచారం. (చదవండి: ఆ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ చూసి షాక్ అయిన పోలీసులు: ఫోటోలు వైరల్) -
ఆ టీడీపీనేతకు షాక్
సాక్షి, కదిరి: దేవుడి ఆస్తుల జోలికెళితే ఏదో ఒక రూపంలో ఆ దేవుడే శిక్షిస్తారని పెద్దలు చెబుతుంటారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని పట్టణంలోని క్రిష్టియన్ బోర్డింగ్ స్కూల్‌ను కబ్జా చేశారు. తర్వాత దానికి తప్పుడు పత్రాలు సృష్టించి తన బినామీల పేరు మీద రిజిష్రే్టషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత దాన్ని కూల్చేసి అక్కడ ఐదంతస్థుల భవంతిని నిర్మిస్తున్నారు. తప్పుడు పత్రాలు సమరి్పంచి అక్కడ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ తీసుకున్నారని ఫిర్యాదులు రావడంతో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ లీగల్ సలహాదారు ప్రసాద్‌రెడ్డి సూచనల మేరకు మున్సిపల్ కమిషనర్ కె.ప్రమీళ ఆ ప్లాన్ అప్రూవల్‌ను రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం బిల్డింగ్ నిర్మాణాన్ని ఆపేయాలని, తదుపరి నిర్మాణం చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్లాన్ రద్దు చేయించి బాధిత క్రిస్టియన్లకు న్యాయం చేయడంలో ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి విజయం సాధించారు. ఎన్నికలకు మునుపు క్రిస్టియన్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. వందేళ్లుగా బోర్డింగ్ స్కూల్.. కదిరిలో ఆర్టీసీ బస్టాండ్‌కు సమీపంలో 100 ఏళ్లుగా సీఅండ్ఐజీ మిషన్ చర్చికి సంబంధించిన క్రిష్టియన్ బోర్డింగ్ స్కూల్ ఉంది. అక్కడ క్రిస్టియన్ అనాథ ఆడపిల్లలు ఆశ్రయం పొందుతూ పట్టణంలోని వివిధ పాఠశాలలకు వెళ్లి చదువుకునే వారు. అక్కడ ఆశ్రయం పొంది చదువుకున్న ఎంతో మంది పలు ఉన్నత పదవుల్లోనూ ఉన్నారు. ఆదుకుంటామని చెప్పీ... పట్టణానికి చెందిన కొందరు క్రిస్టియన్ ఆస్తులను కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారని, వాటిని తాము కాపాడతామంటూ 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన కందికుంట వెంకట ప్రసాద్ ప్రజలను నమ్మించారు. చివరికి ఆయనే అప్పటి సీఅండ్ఐజీ మిషన్ చర్చి ఫాదర్‌ను చంపుతామని బెదిరించడంతో పాటు ఆ బోర్డింగ్ స్కూల్ స్థలాన్ని తన బినామీల పేరు మీద రిజిష్ట్రర్ చేయించుకున్నారు. ఈ విషయాన్ని సదరు చర్చి ఫాదర్ జిల్లా కోర్టులో కూడా ఒప్పుకున్నారు. చివరికి ఈ మనోవేదనతోనే చర్చి ఫాదర్ తనువు చాలించారు. దీంతో చర్చి ఫాదర్ వాంగ్మూలం మేరకు సదరు తప్పుడు డాక్యుమెంట్లను రద్దు చేసి ఆ బోర్డింగ్ స్కూల్‌ను మళ్లీ క్రిస్టియన్ అనాథ పిల్లలకోసమే ఉపయోగించాలంటూ అప్పట్లో కోర్టు తీర్పునిచ్చింది. సత్యానందాన్ని బెదిరించి.. క్రిస్టియన్ బోర్డింగ్ స్కూల్ కరస్పాండెంట్‌గా ఉన్న ఎండీ సత్యానందంను 2018 జూన్ మొదటి వారంలో కందికుంట వెంకట ప్రసాద్ అనుచరులు చంపుతామంటూ బెదిరించి ఆయన దగ్గరున్న బోర్డింగ్ స్కూల్ తాళాలు లాక్కున్నారు. జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని విద్యారి్థనులు రాకనే ఈ బోర్డింగ్ స్కూల్ భవనాన్ని కూల్చేయాలనే ఆలోచనతో జూన్ మొదటి వారంలో తెల్లవారు జామునే ఒక హిటాచీ వాహనంతో పాటు మరో జేసీబీ వాహనాన్ని తీసుకొచ్చి దాన్ని నేలమట్టం చేశారు. దీన్ని అప్పట్లోనే వైఎస్సార్సీపీ నేత, ప్రస్తుత ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డితో పాటు వామపక్ష పారీ్టలు వ్యతిరేకించాయి. తప్పుడు పత్రాలతో అప్రూవల్.. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 2018లో కందికుంట వెంకట ప్రసాద్ ‘సమైక్య బిల్డ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుమీద ప్లాన్ అప్రూవల్ తీసుకొని కూల్చేసిన క్రిస్టియన్ బోర్డింగ్ స్కూల్ స్థానంలో ఐదు అంతస్తుల భవంతిని నిర్మించి అందులోని ప్లాట్ల అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. సీఅండ్ఐజీ మిషన్ అభ్యంతరాలు చెప్పడంతో ఫేక్ డాక్యుమెంట్స్ అని నమ్ముతూ మొదట వారికి షోకాజ్ నోటీస్ ఇచ్చి దానికి సరైన సమాధానం రాకపోవడంతో సదరు ప్లాన్ అప్రూవల్‌ను రద్దు చేస్తూ మున్సిపల్ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్‌కు డబ్బు ఆశచూపి.. కందికుంట కన్ను రెండోసారి మళ్లీ బోర్డింగ్ స్కూల్ మీదపడింది. సీఅండ్ఐజీ మిషన్ చర్చి చైర్మన్‌గా చెప్పుకుంటున్న త్యాగరాజు ద్వారా రూ.10 కోట్లకు పైగా విలువ చేసే 20 సెంట్ల క్రిస్టియన్ బోర్డింగ్ స్కూల్ స్థలాన్ని కందికుంట తన బినామీలైన వెంకటనారాయణ, వెంకటరమణారెడ్డిల పేరు మీద రెండోసారి రిజిష్ట్రర్ చేయించుకున్నారు. ఈ రిజి్రõÙ్టషన్ చెల్లదని, సీఅండ్ఐజీ మిషన్ చర్చి ఆస్తులు అమ్మడానికి కానీ, కొనడానికి కానీ ఎవరికీ అధికారాలు ఉండవని తానే మిషన్ చైర్మెన్ అంటూ బి.జాన్ డేవిడ్ అప్పట్లోనే పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికీ కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. ప్లాన్ అప్రూవల్ రద్దు చేశాం గతంలో క్రిస్టియన్ బోర్డింగ్ స్కూల్ ఉన్న స్థలాన్ని కూల్చేసి అక్కడ 5 అంతస్తుల భవన నిర్మాణం కోసం బండి వెంకటనారాయణ, ఎ.వెంకటరమణారెడ్డిలు కదిరి మున్సిపాలిటీలో తీసుకున్న ప్లాన్ అప్రూవల్ రద్దు చేసిన మాట వాస్తవమే. మాకు అందిన పక్కా సమాచారం మేరకు న్యాయ సలహా తీసుకొని అవి తప్పుడు పత్రాలని నమ్ముతూ ప్లాన్ అప్రూవల్ రద్దు చేశాము. ఇక మీదట అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. అందులో ఎవరైనా ప్లాట్లు కొన్నా మున్సిపాలిటీ ఎలాంటి బాధ్యత వహించదు. – కె.ప్రమీల, మున్సిపల్ కమిషనర్, కదిరి అనాథ పిల్లలకే దక్కాలి బోర్డింగ్ స్కూల్ కూల్చేసిన రోజే నేను అక్కడికి వెళ్లి అడ్డుకున్నాను. ఆ స్థలం క్రిస్టియన్ అనాథ పిల్లలకే దక్కాలన్నది నా ప్రధాన డిమాండ్. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నాను. తప్పుడు పత్రాలు చూపి ప్లాన్ అప్రూవల్ తీసుకున్న వారితో పాటు దీనికి ప్రధాన కారకులైన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వెంటనే అక్కడ నిర్మించిన భవంతిని సీఅండ్ఐజీ మిషన్‌కు అప్పగించాలి. – డా.పీవీ సిద్దారెడ్డి, ఎమ్మెల్యే, కదిరి -
ఆ కాలనీల్లో నిర్మాణాలు బంద్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని 1797 అనధికార కాలనీల్లో నిర్మాణాలపై సుప్రీం కోర్టు మంగళవారం స్టే విధించింది. అనధికార కాలనీల్లో భవన నిర్మాణ నిబంధనలకు విరుద్ధంగా సాగే నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది. జాతీయ రాజధానిలో రహదారులు, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఢిల్లీ మాస్టర్‌ప్లాన్‌కు ప్రతిపాదిత సవరణలపై విధించిన స్టేను ఎత్తివేయాలన్న ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) అప్పీల్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అనధికార కాలనీల్లో భవనాలు, నిర్మాణాలు మున్సిపల్ చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూడాలన్న సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనతో కోర్టు ఏకీభవించింది. కాగా దేశ రాజధానిలో నివాస ఆస్తులను వ్యాపార సముదాయాలుగా మార్చిన వాణిజ్య సంస్థలపై కొరడా ఝళిపిస్తూ కోర్టు నియమించిన పర్యవేక్షక కమిటీ సీలింగ్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులు తమ విధులను నిర్వర్తించడంలో విఫలమైనందునే పరిస్థితి దిగజారిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కుడి ఎడమల దగా
సాక్షి, సిద్దిపేట: చేర్యాల పట్టణంలోని కుడి చెరువు కళ్లెదుటే దర్జాగా కబ్జా అవుతోంది. బస్టాండ్ సమీపంలో ఉన్న ఈ చెరువు నీటిపారుదలశాఖ లెక్కల ప్రకారం 60.20 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చెరువు పూర్తిగా నిండితే (ఎఫ్టీఎల్) విస్తీర్ణం 93 ఎకరాలుగా నిర్ధారించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చివరి సరిహద్దుగా ఉన్న చేర్యాల.. జిల్లాల విభజనలో సిద్దిపేట జిల్లాలో కలిసింది. దీంతో చేర్యాల.. పట్టణ రూపు సంతరించుకుని వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది గుర్తించిన ప్రభుత్వం చేర్యాలకు నగర పంచాయతీ హోదాను ప్రకటించింది. కుడి చెరువు శిఖం ప్రాంతం చేర్యాల నుంచి హైదరాబాద్, సిద్దిపేట పట్టణాలకు వెళ్లే ప్రధాన రహదారి దుద్దెడ రోడ్డుకు ఆనుకుని ఉంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ చెరువు శిఖం ప్రాంతం చేర్యాల పట్టణంలో ప్రధాన వాణిజ్య కేంద్రం కానుంది. దీంతో దీనిపై కన్నేసిన ఆక్రమణదారులు చెరువుకు పక్కనే ఉన్న పట్టా భూముల్ని ఎరగా చూపి.. శిఖాన్ని మింగేస్తున్నారు. అందులో వర్తక వాణిజ్య భవనాలు నిర్మిస్తున్నారు. ఇలా కుడి చెరువు శిఖంలో 30 వరకు అక్రమ కట్టడాలు వెలిశాయి. హద్దులు మీరుతున్న అధికారం చెరువు హద్దులు దాటి ఆక్రమణదారులు నిర్మాణాలు చేపడుతున్నా ఇటు రెవెన్యూ, అటు గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. చెరువు సాధారణ విస్తీర్ణం వరకు ప్రభుత్వ సర్వే నంబర్లలో ఉండగా, ఎఫ్టీఎల్ ప్రాంతం ఉన్న సర్వే నంబర్లలో పట్టాదారులు ఉన్నారు. ఎఫ్టీఎల్ ప్రాంతంలోని భూముల్లో నీరు నిండుగా లేనప్పుడు మాత్రమే సాగు చేసుకోవాలని రెవెన్యూ చట్టం చెబుతోంది. అలాగే, ఎఫ్టీఎల్కు 30 మీటర్ల దూరాన్ని బఫర్ జోన్‌గా పరిగణిస్తారు. ఈ స్థలంలో నిర్మాణాలకు పంచాయతీ అధికారులు అనుమతి ఇవ్వకూడదు. కానీ అవేమీ పట్టనట్లు పలువురు చెరువులో కొంత భాగంతోపాటు, ఎఫ్టీఎల్ ప్రాంతంలో మట్టి నింపి మరీ నిర్మాణాలు చేపట్టారు. హద్దురాళ్లు పారేసినా.. చర్యల్లేవ్ కబ్జాలపై గతంలో నీటిపారుదల శాఖ అధికారులు సర్వే చేయించి ఎఫ్టీఎల్ హద్దురాళ్లు పాతారు. అక్రమ నిర్మాణాలపై చర్యలకు రెవెన్యూ, పంచాయతీ అధికారులకు సిఫార్సు చేశారు. ఈ రెండు శాఖల అధికారులు ఒకరిద్దరికి నోటీసులు జారీచేసి చేతులు దులుపుకున్నారు. విలువైన భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించకుండా ఉండేందుకు రెవెన్యూ, పంచాయతీ అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు అందాయని, రాజకీయ నాయకులకూ వాటాలు ముట్టాయని, అందుకే ఎవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో ఆక్రమణదారులు రెచ్చిపోయి ఇటీవల హద్దురాళ్లను సైతం తీసిపారేశారు. జిల్లా అధికారులు స్పందించి చేర్యాల కుడి చెరువును రక్షించాలని, విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. చెరువును కాపాడాలి చేర్యాలలోని కుడి చెరువు శిఖం మొత్తం 60 ఎకరాలు ఉంటుంది. ఇందులో ఐదెకకరాల భూమి ఆక్రమణకు గురైంది. దీనిపై పూర్వపు వరంగల్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పందించి చెరువు ఆక్రమణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని చెరువును కాపాడాలి. – అందె బీరన్న. చేర్యాల కబ్జాదారులపై చర్యలు తీసుకుంటాం చేర్యాల కుడి చెరువు ఎఫ్టీఎల్ పరిధి దాటి నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవమే. గతంలో మా శాఖ తరపున సర్వే చేయించి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పంచాయతీ అధికారులను కోరాం. పలువురికి మా శాఖ తరపున నోటీసులు జారీ చేశాం. ఇటీవల ఎఫ్టీఎల్ రాళ్లను పలువురు తీసివేశారు. తిరిగి వాటిని ఏర్పాటు చేస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. శిఖం భూమిలో నిర్మాణాలు చేపట్టిన వారెవరినీ వదలం. – స్వామిదాసు, నీటిపారుదలశాఖ డీఈ చెరువు ఉనికి కోల్పోతోంది చేర్యాల కుడి చెరువు సర్వే నంబర్ 202, 203లలో విస్తరించి ఉంది. కబ్జాలతో చెరువు ఉనికి కోల్పోతోంది. చెరువులోకి నీరు రాకుండా మార్గాలు మూసివేసిన విషయమై అప్పటి వరంగల్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. ఎన్నో ధర్నాలు చేశాం. ఫలితం లేదు. ఇప్పుడు చేర్యాల సిద్దిపేట జిల్లాలో విలీనమయ్యాక ఫిర్యాదు చేస్తే ఇక్కడి అధికారులు ఎఫ్టీఎల్ హద్దులు ఏర్పాటు చేశారు కానీ, వాటిని కబ్జాదారులు కొద్దిరోజులకే తొలగించారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేయలేదు. – అనెబోయిన స్వామి, చేర్యాల -
టీడీపీ నేత కంభంపాటి అక్రమకట్టడం కూల్చివేత
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కంభంపాటి రామ్మెహనరావు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అక్రమంగా కట్టిన కట్టడాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం కూల్చేశారు. రామ్మోహనరావు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు. ఆయన తన ఇంటికి ముందు భాగంలో రోడ్డుమీద అక్రమంగా నిర్మాణం చేస్తున్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనికి స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం ఉదయమే ఆ కట్టడాన్ని కూల్చేశారు. ఇటీవలి కాలంలో అక్రమ కట్టడాల విషయంలో జీహెచ్ఎంసీ సీరియస్‌గా వ్యవహరిస్తోంది. కూకట్ పల్లి, పాతబస్తీ తదితర ప్రాంతాలలో తమకు ఫిర్యాదులు రాగానే వెంటనే చర్యలు తీసుకుంటోంది. గత వారం 15 రోజులుగా అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో తమపై వచ్చే రాజకీయ ఒత్తిళ్లను కూడా పక్కనపెట్టి కూల్చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమం కాదు.. నేనే కూల్చేశా: కంభంపాటి కాగా, అది అక్రమ నిర్మాణం కాదని.. ఇంటి బయట వాచ్ మన్ నివాసం కోసం చిన్న గదిలాంటిది కట్టిస్తుండగా జీహెచ్ఎంసీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారని కంభంపాటి రామ్మోహనరావు తెలిపారు. దాంతో తానే మనుషులను పెట్టి దాన్ని కూల్చేసినట్లు ఆయన చెప్పారు. -
రాజమండ్రిలో అక్రమ కట్టడాల కూల్చివేత
-
ఎల్బీ నగర్లో అక్రమ కట్టడాల కూల్చివేతలు
హైదరాబాద్ : అక్రమ నిర్మాణాల కూల్చివేతల పర్వం మూడో రోజుకు కూడా కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, బీఎన్ రెడ్డి నగర్, సరూర్ నగర్, ఏఎస్ రావ్ నగర్‌లోని అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కాగా బీఎన్ రెడ్డి నగర్ లోని చైతన్య నగర్ లోని అయిదో అంతస్తును కూల్చివేశారు. కాగా కూల్చివేతలు ఆపాలంటూ స్థానికుల ఆందోళనకు దిగారు. దాంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కాగా నిన్న కాప్రా, ఉప్పల్, సైదాబాద్, ధూల్ పేట, గుడిమల్కాపూర్, అంబర్ పేట, ఆదర్శనగర్, రాజేంద్ర నగర్, నల్లగండ్ల, శేరిలింగంపల్లి, సీతాఫల్ మండీ, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో 19 భవనాలను అధికారులు నేలమట్టం చేశారు. గడిచిన రెండు రోజులగుఆ మొత్తం 25 భవనాలకు కూల్చివేశారు. -
బీహెచ్ఈఎల్ ఎంఐజీలో అక్రమ కట్టడాల కూల్చివేత
హైదరాబాద్ : అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. శేరిలింగంపల్లి బీహెచ్ఈఎల్ ఎంఐజీ ఫేజ్-3లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం కూల్చివేశారు. పోలీసుల మోహరింపు మధ్య అక్రమంగా నిర్మించిన మూడు భవనాలను పొక్లెయిన్లతో కూల్చివేశారు. మరోవైపు కూల్చివేతలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులు ఇప్పుడు ఎలా కూల్చివేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతకు జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ 809 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించింది. వాటిలో 172 పెద్ద నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. -
'ఆ రెండు ప్రాంతాల' మినహా కూల్చివేతలు
హైదరాబాద్ : అక్రమ భవనాల కూల్చివేతలపై జీహెచ్ఎంసీ వివరణ ఇచ్చింది. ఎల్బీనగర్, గోకుల్ ప్లాట్స్ మినహా మిగతా ప్రాంతాల్లో కూల్చివేతలు కొనసాగుతాయని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. పోలీసులు తక్కువగా ఉన్నందువల్ల కొన్ని ప్రాంతాల్లో కూల్చివేతలు వాయిదా వేసినట్లు ఆయన మంగళవారమిక్కడ చెప్పారు. మిగిలిన అక్రమ భవనాలను ఎప్పుడు కూల్చివేసేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కాగా ఇటీవలే గురుకుల్ ట్రస్ట్, అయ్యప్పసొసైటీలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేసిన అధికారులు తాజాగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో నేటి నుంచి కూల్చివేతకు సిద్ధమయ్యారు. అక్రమ నిర్మాణాలపై నిఘా వేసిన జీహెచ్ఎంసీ అధికారులు 890 అక్రమ నిర్మాణాలను గుర్తించడంతో పాటు వాటికి సంబంధించి రిజిస్టర్లు కూడా తయారు చేశారు. వాటిల్లో భారీ అక్రమాలకు పాల్పడిన 172 భవనాలను కూల్చివేయాలని నిర్ణయించారు.