క్రిస్టియన్ బోర్డింగ్ స్కూల్ ఉన్న చోట అక్రమంగా భవంతిని నిర్మిస్తున్న టీడీపీ కదిరి ఇన్‌చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్
సాక్షి, కదిరి: దేవుడి ఆస్తుల జోలికెళితే ఏదో ఒక రూపంలో ఆ దేవుడే శిక్షిస్తారని పెద్దలు చెబుతుంటారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని పట్టణంలోని క్రిష్టియన్ బోర్డింగ్ స్కూల్‌ను కబ్జా చేశారు. తర్వాత దానికి తప్పుడు పత్రాలు సృష్టించి తన బినామీల పేరు మీద రిజిష్రే్టషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత దాన్ని కూల్చేసి అక్కడ ఐదంతస్థుల భవంతిని నిర్మిస్తున్నారు. తప్పుడు పత్రాలు సమరి్పంచి అక్కడ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ తీసుకున్నారని ఫిర్యాదులు రావడంతో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ లీగల్ సలహాదారు ప్రసాద్‌రెడ్డి సూచనల మేరకు మున్సిపల్ కమిషనర్ కె.ప్రమీళ ఆ ప్లాన్ అప్రూవల్‌ను రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం బిల్డింగ్ నిర్మాణాన్ని ఆపేయాలని, తదుపరి నిర్మాణం చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్లాన్ రద్దు చేయించి బాధిత క్రిస్టియన్‌లకు న్యాయం చేయడంలో ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి విజయం సాధించారు. ఎన్నికలకు మునుపు క్రిస్టియన్‌లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.
వందేళ్లుగా బోర్డింగ్ స్కూల్..
కదిరిలో ఆర్‌టీసీ బస్టాండ్‌కు సమీపంలో 100 ఏళ్లుగా సీఅండ్‌ఐజీ మిషన్ చర్చికి సంబంధించిన క్రిష్టియన్ బోర్డింగ్ స్కూల్ ఉంది. అక్కడ క్రిస్టియన్ అనాథ ఆడపిల్లలు ఆశ్రయం పొందుతూ పట్టణంలోని వివిధ పాఠశాలలకు వెళ్లి చదువుకునే వారు. అక్కడ ఆశ్రయం పొంది చదువుకున్న ఎంతో మంది పలు ఉన్నత పదవుల్లోనూ ఉన్నారు.
ఆదుకుంటామని చెప్పీ...
పట్టణానికి చెందిన కొందరు క్రిస్టియన్ ఆస్తులను కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారని, వాటిని తాము కాపాడతామంటూ 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన కందికుంట వెంకట ప్రసాద్ ప్రజలను నమ్మించారు. చివరికి ఆయనే అప్పటి సీఅండ్‌ఐజీ మిషన్ చర్చి ఫాదర్‌ను చంపుతామని బెదిరించడంతో పాటు ఆ బోర్డింగ్ స్కూల్ స్థలాన్ని తన బినామీల పేరు మీద రిజిష్ట్రర్ చేయించుకున్నారు. ఈ విషయాన్ని సదరు చర్చి ఫాదర్ జిల్లా కోర్టులో కూడా ఒప్పుకున్నారు. చివరికి ఈ మనోవేదనతోనే చర్చి ఫాదర్ తనువు చాలించారు. దీంతో చర్చి ఫాదర్ వాంగ్మూలం మేరకు సదరు తప్పుడు డాక్యుమెంట్లను రద్దు చేసి ఆ బోర్డింగ్ స్కూల్‌ను మళ్లీ క్రిస్టియన్ అనాథ పిల్లలకోసమే ఉపయోగించాలంటూ అప్పట్లో కోర్టు తీర్పునిచ్చింది.
సత్యానందాన్ని బెదిరించి..
క్రిస్టియన్ బోర్డింగ్ స్కూల్ కరస్పాండెంట్‌గా ఉన్న ఎండీ సత్యానందంను 2018 జూన్ మొదటి వారంలో కందికుంట వెంకట ప్రసాద్ అనుచరులు చంపుతామంటూ బెదిరించి ఆయన దగ్గరున్న బోర్డింగ్ స్కూల్ తాళాలు లాక్కున్నారు. జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని విద్యారి్థనులు రాకనే ఈ బోర్డింగ్ స్కూల్ భవనాన్ని కూల్చేయాలనే ఆలోచనతో జూన్ మొదటి వారంలో తెల్లవారు జామునే ఒక హిటాచీ వాహనంతో పాటు మరో జేసీబీ వాహనాన్ని తీసుకొచ్చి దాన్ని నేలమట్టం చేశారు. దీన్ని అప్పట్లోనే వైఎస్సార్‌సీపీ నేత, ప్రస్తుత ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డితో పాటు వామపక్ష పారీ్టలు వ్యతిరేకించాయి.
తప్పుడు పత్రాలతో అప్రూవల్..
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 2018లో కందికుంట వెంకట ప్రసాద్ ‘సమైక్య బిల్డ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుమీద ప్లాన్ అప్రూవల్ తీసుకొని కూల్చేసిన క్రిస్టియన్ బోర్డింగ్ స్కూల్ స్థానంలో ఐదు అంతస్తుల భవంతిని నిర్మించి అందులోని ప్లాట్ల అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. సీఅండ్‌ఐజీ మిషన్ అభ్యంతరాలు చెప్పడంతో ఫేక్ డాక్యుమెంట్స్ అని నమ్ముతూ మొదట వారికి షోకాజ్ నోటీస్ ఇచ్చి దానికి సరైన సమాధానం రాకపోవడంతో సదరు ప్లాన్ అప్రూవల్‌ను రద్దు చేస్తూ మున్సిపల్ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు.
చైర్మన్‌కు డబ్బు ఆశచూపి..
కందికుంట కన్ను రెండోసారి మళ్లీ బోర్డింగ్ స్కూల్ మీదపడింది. సీఅండ్‌ఐజీ మిషన్ చర్చి చైర్మన్‌గా చెప్పుకుంటున్న త్యాగరాజు ద్వారా రూ.10 కోట్లకు పైగా విలువ చేసే 20 సెంట్ల క్రిస్టియన్ బోర్డింగ్ స్కూల్ స్థలాన్ని కందికుంట తన బినామీలైన వెంకటనారాయణ, వెంకటరమణారెడ్డిల పేరు మీద రెండోసారి రిజిష్ట్రర్ చేయించుకున్నారు. ఈ రిజి్రõÙ్టషన్ చెల్లదని, సీఅండ్‌ఐజీ మిషన్ చర్చి ఆస్తులు అమ్మడానికి కానీ, కొనడానికి కానీ ఎవరికీ అధికారాలు ఉండవని తానే మిషన్ చైర్మెన్ అంటూ బి.జాన్ డేవిడ్ అప్పట్లోనే పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికీ కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది.
ప్లాన్ అప్రూవల్ రద్దు చేశాం
గతంలో క్రిస్టియన్ బోర్డింగ్ స్కూల్ ఉన్న స్థలాన్ని కూల్చేసి అక్కడ 5 అంతస్తుల భవన నిర్మాణం కోసం బండి వెంకటనారాయణ, ఎ.వెంకటరమణారెడ్డిలు కదిరి మున్సిపాలిటీలో తీసుకున్న ప్లాన్ అప్రూవల్ రద్దు చేసిన మాట వాస్తవమే. మాకు అందిన పక్కా సమాచారం మేరకు న్యాయ సలహా తీసుకొని అవి తప్పుడు పత్రాలని నమ్ముతూ ప్లాన్ అప్రూవల్ రద్దు చేశాము. ఇక మీదట అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. అందులో ఎవరైనా ప్లాట్లు కొన్నా మున్సిపాలిటీ ఎలాంటి బాధ్యత వహించదు.
– కె.ప్రమీల, మున్సిపల్ కమిషనర్, కదిరి
అనాథ పిల్లలకే దక్కాలి
బోర్డింగ్ స్కూల్ కూల్చేసిన రోజే నేను అక్కడికి వెళ్లి అడ్డుకున్నాను. ఆ స్థలం క్రిస్టియన్ అనాథ పిల్లలకే దక్కాలన్నది నా ప్రధాన డిమాండ్. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నాను. తప్పుడు పత్రాలు చూపి ప్లాన్ అప్రూవల్ తీసుకున్న వారితో పాటు దీనికి ప్రధాన కారకులైన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వెంటనే అక్కడ నిర్మించిన భవంతిని సీఅండ్‌ఐజీ మిషన్‌కు అప్పగించాలి.
– డా.పీవీ సిద్దారెడ్డి, ఎమ్మెల్యే, కదిరి
Comments
Please login to add a commentAdd a comment