kandikunta Venkata Prasad
-
కదిరి టీడీపీ అభ్యర్థి కారులో రూ.2 కోట్ల నగదు
అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌కు చెందిన ఫార్చునర్ కారులో సుమారు రూ.2 కోట్ల నగదు పట్టుబడింది. ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు మంగళవారం అనంతపురం నుంచి కదిరికి తరలిస్తుండగా.. స్థానిక విద్యుత్ నగర్ సర్కిల్లో పోలీసులు పట్టుకున్నారు. కారు డ్రైవర్ ఆనంద్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. కారును సీజ్ చేశారు. అనంతపురం టూటౌన్ సీఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల విధుల్లో భాగంగా అనంతపురం టూటౌన్ పోలీసులు స్పెషల్ పార్టీ, మొబైల్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి మంగళవారం ఉదయం అనంతపురం విద్యుత్ నగర్ సర్కిల్లో వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఏపీ 39 ఆర్క్యూ 0999 ఫార్చునర్ వాహనాన్ని తనిఖీ చేశారు. మూడు బ్యాగుల్లో నగదు పట్టుబడింది. దాన్ని లెక్కించి రూ.1,99,97,500 ఉన్నట్టు నిర్ధారించారు. పంచనామా నిర్వహించి.. ఈ ప్రక్రియనంతా వీడియో రికార్డింగ్ చేశారు. రామ్‌నగర్ నుంచి తరలిస్తూ.. కందికుంట వెంకటప్రసాద్ కారు డ్రైవర్ సోమవారం రాత్రి బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తిని పికప్ చేసుకుని అనంతపురం రాజు రోడ్డులోని టీడీపీ నాయకుడికి చెందిన మాసినేని హోటల్లో దించినట్టు సమాచారం. రాత్రి అక్కడే బస చేసిన డ్రైవర్ మంగళవారం ఉదయం అనంతపురం రామ్‌నగర్‌లోని ఓ ఇంటి నుంచి మూడు బ్యాగుల్లో నగదు సమకూర్చుకున్నట్టు సమాచారం. అక్కడి నుంచి సప్తగిరి సర్కిల్, సూర్యానగర్ రోడ్డు మీదుగా నేరుగా కదిరికి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. తనిఖీలు ఉంటాయనే ఉద్దేశంతో విద్యుత్ నగర్ సర్కిల్ మీదుగా వాహనాన్ని మళ్లించారు. కానీ.. పోలీసులు విద్యుత్ నగర్ సర్కిల్లోనూ వాహన తనిఖీలు చేపట్టడంతో నగదు పట్టుబడింది. కారు కందికుంట పేరుతోనే.. ఏపీ 39 ఆర్క్యూ 0999 నంబర్ గల ఫార్చునర్ కారు కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పేరుతోనే రిజి్రస్టేషన్ అయింది. నగదు పట్టుబడిన విషయం తెలిసిన వెంటనే వెంకటప్రసాద్ నల్లచెరువు మండలంలో ఎన్నికల ప్రచారాన్ని అర్ధంతరంగా ముగించుకుని కదిరిలోని ఇంటికి వెళ్లిపోయారు. కదిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపు ఖాయమనే సంకేతాలు వస్తుండటంతో కందికుంట అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లకు నగదు ఎర వేయడానికి సిద్ధమయ్యారు. అనంతపురం, ఇతర ప్రాంతాల నుంచి డబ్బు తెప్పించుకుని కదిరిలో పంచేలా ప్రణాళిక రచించుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల తనిఖీల్లో సుమారు రూ.2 కోట్ల నగదు పట్టుబడింది. ఆదాయపు పన్ను అధికారుల విచారణ వెంకటప్రసాద్ వాహన డ్రైవర్ ఆనంద్‌కుమార్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎవరిచ్చారు? ఇందుకు సంబంధించిన పత్రాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు. రూ.10 లక్షలకు పైగా నగదు తీసుకెళ్తూ పట్టుబడితే ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అనంతపురం పోలీసులు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. డ్రైవర్ ఆనంద్‌కుమార్‌ను ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా విచారిస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదును తరలించడానికి గల కారణాలు ఏమిటి? బ్లాక్ మనీ కాకపోతే అందుకు తగిన ఆధారాలు ఇవ్వాలని సూచించారు. ఈ మొత్తం ఎవరి నుంచి తీసుకున్నారు? ఎందుకు ఇంత పెద్దమొత్తంలో నగదు ఇవ్వాల్సి వచ్చింది? తదితర కోణాల్లో ఆరా తీస్తున్నారు. -
ఆ టీడీపీనేతకు షాక్
సాక్షి, కదిరి: దేవుడి ఆస్తుల జోలికెళితే ఏదో ఒక రూపంలో ఆ దేవుడే శిక్షిస్తారని పెద్దలు చెబుతుంటారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని పట్టణంలోని క్రిష్టియన్ బోర్డింగ్ స్కూల్‌ను కబ్జా చేశారు. తర్వాత దానికి తప్పుడు పత్రాలు సృష్టించి తన బినామీల పేరు మీద రిజిష్రే్టషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత దాన్ని కూల్చేసి అక్కడ ఐదంతస్థుల భవంతిని నిర్మిస్తున్నారు. తప్పుడు పత్రాలు సమరి్పంచి అక్కడ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ తీసుకున్నారని ఫిర్యాదులు రావడంతో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ లీగల్ సలహాదారు ప్రసాద్‌రెడ్డి సూచనల మేరకు మున్సిపల్ కమిషనర్ కె.ప్రమీళ ఆ ప్లాన్ అప్రూవల్‌ను రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం బిల్డింగ్ నిర్మాణాన్ని ఆపేయాలని, తదుపరి నిర్మాణం చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్లాన్ రద్దు చేయించి బాధిత క్రిస్టియన్లకు న్యాయం చేయడంలో ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి విజయం సాధించారు. ఎన్నికలకు మునుపు క్రిస్టియన్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. వందేళ్లుగా బోర్డింగ్ స్కూల్.. కదిరిలో ఆర్టీసీ బస్టాండ్‌కు సమీపంలో 100 ఏళ్లుగా సీఅండ్ఐజీ మిషన్ చర్చికి సంబంధించిన క్రిష్టియన్ బోర్డింగ్ స్కూల్ ఉంది. అక్కడ క్రిస్టియన్ అనాథ ఆడపిల్లలు ఆశ్రయం పొందుతూ పట్టణంలోని వివిధ పాఠశాలలకు వెళ్లి చదువుకునే వారు. అక్కడ ఆశ్రయం పొంది చదువుకున్న ఎంతో మంది పలు ఉన్నత పదవుల్లోనూ ఉన్నారు. ఆదుకుంటామని చెప్పీ... పట్టణానికి చెందిన కొందరు క్రిస్టియన్ ఆస్తులను కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారని, వాటిని తాము కాపాడతామంటూ 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన కందికుంట వెంకట ప్రసాద్ ప్రజలను నమ్మించారు. చివరికి ఆయనే అప్పటి సీఅండ్ఐజీ మిషన్ చర్చి ఫాదర్‌ను చంపుతామని బెదిరించడంతో పాటు ఆ బోర్డింగ్ స్కూల్ స్థలాన్ని తన బినామీల పేరు మీద రిజిష్ట్రర్ చేయించుకున్నారు. ఈ విషయాన్ని సదరు చర్చి ఫాదర్ జిల్లా కోర్టులో కూడా ఒప్పుకున్నారు. చివరికి ఈ మనోవేదనతోనే చర్చి ఫాదర్ తనువు చాలించారు. దీంతో చర్చి ఫాదర్ వాంగ్మూలం మేరకు సదరు తప్పుడు డాక్యుమెంట్లను రద్దు చేసి ఆ బోర్డింగ్ స్కూల్‌ను మళ్లీ క్రిస్టియన్ అనాథ పిల్లలకోసమే ఉపయోగించాలంటూ అప్పట్లో కోర్టు తీర్పునిచ్చింది. సత్యానందాన్ని బెదిరించి.. క్రిస్టియన్ బోర్డింగ్ స్కూల్ కరస్పాండెంట్‌గా ఉన్న ఎండీ సత్యానందంను 2018 జూన్ మొదటి వారంలో కందికుంట వెంకట ప్రసాద్ అనుచరులు చంపుతామంటూ బెదిరించి ఆయన దగ్గరున్న బోర్డింగ్ స్కూల్ తాళాలు లాక్కున్నారు. జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని విద్యారి్థనులు రాకనే ఈ బోర్డింగ్ స్కూల్ భవనాన్ని కూల్చేయాలనే ఆలోచనతో జూన్ మొదటి వారంలో తెల్లవారు జామునే ఒక హిటాచీ వాహనంతో పాటు మరో జేసీబీ వాహనాన్ని తీసుకొచ్చి దాన్ని నేలమట్టం చేశారు. దీన్ని అప్పట్లోనే వైఎస్సార్సీపీ నేత, ప్రస్తుత ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డితో పాటు వామపక్ష పారీ్టలు వ్యతిరేకించాయి. తప్పుడు పత్రాలతో అప్రూవల్.. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 2018లో కందికుంట వెంకట ప్రసాద్ ‘సమైక్య బిల్డ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుమీద ప్లాన్ అప్రూవల్ తీసుకొని కూల్చేసిన క్రిస్టియన్ బోర్డింగ్ స్కూల్ స్థానంలో ఐదు అంతస్తుల భవంతిని నిర్మించి అందులోని ప్లాట్ల అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. సీఅండ్ఐజీ మిషన్ అభ్యంతరాలు చెప్పడంతో ఫేక్ డాక్యుమెంట్స్ అని నమ్ముతూ మొదట వారికి షోకాజ్ నోటీస్ ఇచ్చి దానికి సరైన సమాధానం రాకపోవడంతో సదరు ప్లాన్ అప్రూవల్‌ను రద్దు చేస్తూ మున్సిపల్ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్‌కు డబ్బు ఆశచూపి.. కందికుంట కన్ను రెండోసారి మళ్లీ బోర్డింగ్ స్కూల్ మీదపడింది. సీఅండ్ఐజీ మిషన్ చర్చి చైర్మన్‌గా చెప్పుకుంటున్న త్యాగరాజు ద్వారా రూ.10 కోట్లకు పైగా విలువ చేసే 20 సెంట్ల క్రిస్టియన్ బోర్డింగ్ స్కూల్ స్థలాన్ని కందికుంట తన బినామీలైన వెంకటనారాయణ, వెంకటరమణారెడ్డిల పేరు మీద రెండోసారి రిజిష్ట్రర్ చేయించుకున్నారు. ఈ రిజి్రõÙ్టషన్ చెల్లదని, సీఅండ్ఐజీ మిషన్ చర్చి ఆస్తులు అమ్మడానికి కానీ, కొనడానికి కానీ ఎవరికీ అధికారాలు ఉండవని తానే మిషన్ చైర్మెన్ అంటూ బి.జాన్ డేవిడ్ అప్పట్లోనే పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికీ కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. ప్లాన్ అప్రూవల్ రద్దు చేశాం గతంలో క్రిస్టియన్ బోర్డింగ్ స్కూల్ ఉన్న స్థలాన్ని కూల్చేసి అక్కడ 5 అంతస్తుల భవన నిర్మాణం కోసం బండి వెంకటనారాయణ, ఎ.వెంకటరమణారెడ్డిలు కదిరి మున్సిపాలిటీలో తీసుకున్న ప్లాన్ అప్రూవల్ రద్దు చేసిన మాట వాస్తవమే. మాకు అందిన పక్కా సమాచారం మేరకు న్యాయ సలహా తీసుకొని అవి తప్పుడు పత్రాలని నమ్ముతూ ప్లాన్ అప్రూవల్ రద్దు చేశాము. ఇక మీదట అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. అందులో ఎవరైనా ప్లాట్లు కొన్నా మున్సిపాలిటీ ఎలాంటి బాధ్యత వహించదు. – కె.ప్రమీల, మున్సిపల్ కమిషనర్, కదిరి అనాథ పిల్లలకే దక్కాలి బోర్డింగ్ స్కూల్ కూల్చేసిన రోజే నేను అక్కడికి వెళ్లి అడ్డుకున్నాను. ఆ స్థలం క్రిస్టియన్ అనాథ పిల్లలకే దక్కాలన్నది నా ప్రధాన డిమాండ్. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నాను. తప్పుడు పత్రాలు చూపి ప్లాన్ అప్రూవల్ తీసుకున్న వారితో పాటు దీనికి ప్రధాన కారకులైన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వెంటనే అక్కడ నిర్మించిన భవంతిని సీఅండ్ఐజీ మిషన్‌కు అప్పగించాలి. – డా.పీవీ సిద్దారెడ్డి, ఎమ్మెల్యే, కదిరి -
కందికుంట అనుచరుడి వీరంగం
సాక్షి, ఎన్పీకుంట: కదిరి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ అనుచరుడు చెలరేగిపోయాడు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై పోలీస్ స్టేషన్లోనే దాడికి తెగబడ్డాడు. శనివారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన ఎన్పీ కుంట మండలంలో సంచలనమైంది. వివరాల్లోకి వెళితే... సోలార్ ప్లాంట్‌లో కాంట్రాక్టర్‌గా.. ఎన్పీకుంట మండల పరిధిలో నిర్మితమవుతున్న ‘స్టెర్లింగ్ అండ్ విల్సన్’ సోలార్ ప్లాంట్‌కు సంబంధించి జంగిల్ క్లియరెన్స్, భూమి చదను పనులకు సంబంధించిన కాంట్రాక్ట్‌ను కందికుంట అనుచరుడు రవి దక్కించుకున్నాడు. నిత్యం కూలీలను పని ప్రాంతానికి తరలించడం, తిరిగి వారిని నిర్దేశించిన చోటులో దింపేందుకు ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకున్నాడు. ట్రాక్టర్లో కూలీలను తరలించే పనిలో పది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని ధరమ్‌పుర గ్రామానికి చెందిన సుఖవీర్ అనే యువకుడిని ఏర్పాటు చేసుకున్నాడు. భాష రాక ఇబ్బందులు శుక్రవారం సాయంత్రం కూలీలను ట్రాక్టర్లో ఎక్కించుకుని సుఖవీర్ పని ప్రాంతానికి వెళ్లాడు. అయితే మరొకరికి ట్రాక్టర్‌ను పొరబాటును తీసుకెళ్లి అక్కడే రాత్రి గడిపి శనివారం ఉదయం కూలీలను ఎక్కించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. తొమ్మిది గంటల సమయంలో స్టెర్లింగ్ మెయిన్ గేటువద్దకు చేరుకోగానే అదే కంపెనీలో పనిచేస్తున్న కదిరి మండలం గంగన్నగారిపల్లికి చెందిన శ్రీనివాసులు, రెడ్డప్ప, గంగాధర మరో ఆరుగురు అడ్డగించారు. అనుమతి లేకుండా తమ ట్రాక్టర్‌ను ఎలా తీసుకెళ్లావంటూ నిలదీశారు. తెలుగు భాషరాని సుఖవీర్కు వారు చెబుతున్న మాటలు అర్థం కాలేదు. వారికి సమాధానం ఇవ్వకపోవడంతో అసహనానికి గురైన వారు సుఖవీర్తో పాటు పక్కనే ఉన్న ప్యారేలాల్ను రాడ్లు, రాళ్లతో కొట్టి గాయపరిచారు. ఆ సమయంలో ఏకపక్షంగా సాగిన దాడిని అక్కడే ఉన్న కార్మికులు ఆవుల రమేష్, ఎం.వెంకటరమణ, మహేష్, మల్లికార్జున తదితరులు అడ్డుకుని మధ్యప్రదేశ్ వాసులను కాపాడారు. పోలీస్ స్టేషన్లో పంచాయితీ తమపై జరిగిన దాడిని పోలీసుల దృష్టికి సుఖవీర్ తీసుకెళ్లాడు. దీంతో దాడికి పాల్పడిన గంగన్నగారిపల్లికి చెందిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆ సమయంలో కందికుంట అనుచరువు రవి అక్కడకు చేరుకున్నాడు. గంగాధర్‌ను చూడగానే ఆగ్రహంతో ఊగిపోతూ దుర్భాషలకు దిగాడు. ‘మా ప్లాంట్‌లో పనులు చేసుకుని బతుకుతున్న మీరు.. మా డ్రైవర్‌నే కొడతరా’ అంటూ చిందులు తొక్కుతూ గంగాధర్‌ను బూటుకాలితో తన్నాడు. రవి దౌర్జన్యాన్ని పోలీసులు అడ్డుకోలేకపోయారు. విషయం కాస్త బయటకు పొక్కడంతో చివరకు బాధితులు సుఖవీర్, ప్యారేలాల్ ఫిర్యాదు మేరకు గంగన్నవారిపల్లికి చెందిన 9 మందిపై, పోలీసుల అదుపులో ఉన్న గంగాధర్‌ను కాలితో తన్నినందుకు రవిపై కేసు నమోదు చేశారు. -
ఇక్కడ పేకాట మామూలే!
అసాంఘిక కార్యకలాపాలను అణచివేయడంలో పోలీసుల మెతకవైఖరి సరికాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఎస్పీ, కలెక్టర్ల సదస్సులో పేర్కొన్నారు. ప్రధానంగా పేకాట క్లబ్‌లపై మెరుపు దాడులు నిర్వహించి వాటి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సీఎం ఆదేశించారు. దీంతో పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్లో జరుగుతున్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. క్లబ్లో పేకాట జరగకుండా పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాక్షి, కదిరి(అనంతపురం) : పట్టణంలో సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ఎదురుగానే పెద్దల పేకాట అడ్డా ఉంది. కొన్నేళ్లుగా అక్కడ రిక్రియేషన్ ముసుగులో పేకాట జోరుగా సాగుతోంది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీకి చెందిన రాజారెడ్డి ఆ పేకాట క్లబ్‌కు అధ్యక్షుడిగా ఉంటూ దాన్ని నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేకాట కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని, జిల్లా ఎస్పీ దానిపై దృష్టి సారించాలని పట్టణవాసులు కోరుతున్నారు. పేరుకే రిక్రియేషన్ క్లబ్ కమ్యూనిటి రిక్రియేషన్ క్లబ్(సీఆర్సీ) పేరుతో పట్టణ నడిబొడ్డున అది కూడా పోలీస్‌స్టేషన్‌కు కూత వేటు దూరంలో నిర్వహిస్తున్నారు. వాస్తవంగా అక్కడ క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్ లాంటి ఇండోర్ గేమ్స్ మాత్రమే ఆడుకోవడానికి గతంలో అనుమతి నిచ్చారు. కేవలం రిక్రియేషన్ మాత్రమే అక్కడ కన్పించాలి. అయితే అందులో ఎక్కడా ఇండోర్ గేమ్స్ కనిపించవు. కింద అంతస్తులోనే కాకుండా పై అంతస్తులో కూడా పేకాట ఆడేందుకు పలు టేబుళ్లు ఏర్పాటు చేశారు. పేకాట రాయుళ్లకు ఉక్కపోత ఉండకూడదని ఏసీలు కూడా ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్లో ప్రతి ఆటకు పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి పేకాట ఆడుతున్నారు. ఇది ఇక్కడున్న పోలీసు అధికారులకు తెలియదనుకుంటే పొరపాటే. వారు దీన్ని ‘మామూలు’గా తీసుకుంటున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పేకాట క్లబ్ వైపు పోలీసులు తొంగి చూసిన పాపాన పోలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడినా అక్కడ ఎలాంటి మార్పు కనబడటం లేదు. ఇక్కడ కందికుంటదే హవా ‘2009 నుంచి ఇప్పటి దాకా ఏటా జనవరి 26న మా నాయకుడు, టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాదే ఈ క్లబ్లో జాతీయ జెండా ఎగరేస్తున్నారు. 2014లో చాంద్‌బాషా ఎమ్మెల్యే అయినప్పటికీ ఇక్కడ మాత్రం కందికుంటే ఎమ్మెల్యే. అందుకే మా నాయకుడు కందికుంటే ఇక్కడ జాతీయ జెండాను ఎగరేస్తున్నాడు. ఇక భవిష్యత్‌లో కూడా కందికుంటే ఎగరేస్తాడు. దమ్ముంటే క్లబ్‌ను టచ్ చేసి చూడండి’ అని ఈ క్లబ్లో ఉన్న కొందరు కందికుంట అనుచరులు సవాల్ విసురుతున్నారు. ఇక్కడ పేకాట జరుగుతున్న బహిరంగ రహస్యమని కూడా వారంటున్నారు. క్లబ్ ఫలితంగా ఎన్నో కుటుంబాలు నాశనం సీఆర్సీ క్లబ్లో పెద్ద మొత్తంలో డబ్బు నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి పట్టణానికి చెందిన రాజారెడ్డి, వెంకటేష్ అనే ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. రామాంజులురెడ్డి అనే మరో ఎల్ఐసీ ఉద్యోగి పేకాటలో భారీగా డబ్బు పోగొట్టుకున్నారు. దీనిపై ఆయన భార్య అప్పట్లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో చేసేది లేక ఆ కుటుంబం హైదరాబాద్‌కు బదిలీ చేసుకొని వెళ్లిపోయారు. ఆ క్లబ్‌ను ఆనుకునే అమ్మాయిల హాస్టల్ కూడా ఉంది. క్లబ్‌లోని కొందరు సభ్యులు క్లబ్‌లోనే మద్యం సేవించి హాస్టల్ అమ్మాయిలనే వేధించడంతో పాటు హాస్టల్‌ల్లోకి రాళ్లు విసిరిన సంఘటనలు కూడా లేకపోలేదు. దీనిపై గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేశారు. సభ్యుల మధ్య కూడా పలుమార్లు గొడవలు జరిగి స్టేషన్ మెట్లు కూడా ఎక్కారు. కేవలం కాలక్షేపం కోసం ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి అనుమతిస్తే పేకాట రిక్రియేషన్ క్లబ్ కాస్తా పేకాట క్లబ్‌గా మార్చేశారని కొందరు క్లబ్ సభ్యులే వాపోతున్నారు. జిల్లా ఎస్పీ బూసారపు సత్య యేసుబాబు పరిశీలించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
కదిరిలో రౌడీ రాజ్యం
సాక్షి, కదిరి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి డా.పీవీ సిద్దారెడ్డిపై గురువారం టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ అనుచరుడు పోలింగ్ బూత్‌లోనే దాడికి దిగాడు. అడ్డుకున్న సిద్దారెడ్డి గన్‌మెన్ గిరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గన్‌మెన్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ మొదలెట్టారు. దాడికి పాల్పడిన వ్యక్తి కందికుంట అనుచరుడు పాల హరి అని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆయా బూత్‌లలో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. ఇలా ఆలస్యంగా మొదలైన వాటిలో పట్టణంలోని గొల్లమ్మ మండపం వద్ద ఉన్న 88వ పోలింగ్ బూత్ కూడా ఒకటి. సాయంత్రం 6 గంటల సమయంలో డా.సిద్దారెడ్డి ఆ పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించారు. 6 గంటల తర్వాత కూడా మరో రెండు గంటలు పోలింగ్ నిర్వహించాలని టీడీపీ ఏజెంట్లు, ఆ పార్టీ నాయకులు సదరు పోలింగ్ కేంద్రంలో డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న డా.సిద్దారెడ్డి 6 గంటలకు అప్పటికే క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని, కానీ తర్వాత వచ్చే వారిని అనుమతించకూడదని డాక్టర్ సిద్దారెడ్డి తెలియజేశారు. ఆ సమయంలో కేవలం ఒక్కరు మాత్రమే క్యూలైన్లో ఉన్నారు. ఇందుకు పోలింగ్ కేంద్రంలోనే ఉన్న కందికుంట అనుచరుడు డా.సిద్దారెడ్డిపైకి దాడికి దిగాడు. అడ్డుకోబోయిన ఆయన గన్‌మెన్‌పై తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గన్‌మెన్‌ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చేతులెత్తేసిన పోలీసులు టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ పోలింగ్ సందర్భంగా రోజంతా ప్రతి పోలింగ్ కేంద్రంలోకి 100 మంది అనుచరులతో ప్రవేశించి అక్కడున్న వైఎస్సార్సీపీ ఏజెంట్లు, ఆ కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించారు. ఆయన పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశిస్తుంటే ఎక్కడా పోలీసులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో ఆయన అనుచరులు కూడా ప్రతి పోలింగ్ కేంద్రంలోకి ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోయినా లోనికి వెళ్తూ బూత్‌లో కూడా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు. -
రూ.30 కోట్ల ఆస్తి లాక్కున్నాడు
సాక్షి, కదిరి: ‘కదిరి ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ టీడీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న కందికుంట వెంకట ప్రసాద్ ఉన్నంత వరకు ఇక్కడి ప్రజలు ప్రశాంతంగా ఉండలేరు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతేనే ఎంతోమంది భూములను బలవంతంగా లాక్కున్నాడు. ఇక గెలిస్తే ఆయన విశ్వరూపం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దయచేసి పొరపాటున కూడా ఈ ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయకండి’ అని డాక్టర్ ప్రభాకర్‌నాయుడు సతీమణి పసుపులేటి సరస్వతమ్మ కోరారు. మంగళవారం ఆమె కదిరిలోని తన స్వగృహంలో కుమారుడు పవన్‌కుమార్‌తో కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని ‘సాక్షి’కి వివరించారు. ఆ పొలం అంటే ఆయనకు చాలా ఇష్టం ‘నా భర్త ప్రభాకర్ నాయుడు పాముకాటు బాధితులకు వైద్యం అందించడంలో మంచి పేరుంది. అందుకే ఆయనను అందరూ ‘పాముల డాక్టర్’ అని పిలుస్తారు. మాకు కదిరి–హిందూపురం రోడ్లో వీవర్స్ కాలనీ వద్ద రోడ్డు పక్కనే 3 ఎకరాల పొలం ఉండేది. ఆ పొలం అంటే ఆయనకు చాలా ఇష్టం. నిత్యం పొలం ఏదో ఒక పంటతో కళకళలాడుతూ ఉండేది. ఓసారి కర్నూలుకు చెందిన శిల్ప వాళ్లు అక్కడ ప్లాట్లు వేసి ఇళ్లు నిర్మించి అమ్మేందుకు ఆ పొలం ఎకరం రూ.10 కోట్లకు అడిగారు. కానీ మా ఆయన ఇవ్వలేదు. తర్వాత మా ఆయన గుండెపోటుతో రెండేళ్ల క్రితం మరణించారు. పెద్ద కర్మ కూడా పూర్తి కాకుండానే.. మా ఆయన పెద్దకర్మ కూడా పూర్తికాకనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న కందికుంట వెంకట ప్రసాద్ అనుచరుడు, ప్రస్తుతం మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న మధు (ఈయన భార్య మున్సిపల్ వైస్ చైర్పర్సన్)తో పాటు మరికొందరు వాలిపోయారు. మా పొలంలోకి వచ్చి ‘మీ ఆయన ఈ పొలం మాకు రూ.2.50 కోట్లకు అమ్మినాడు. మా దగ్గర అడ్వాన్స్‌గా రూ. కోటి తీసుకున్నాడు’ అని చెప్పి మున్సిపాలిటీకి సంబంధించిన జేసీబీ తీసుకొచ్చి పొలంలో వేసిన సద్ద పంటను దౌర్జన్యంగా దున్నేశారు. నిజంగా పొలం అమ్మినట్లయితే మా ఆయన మాకు చెప్పేవారు. రూ.30 కోట్లకు అడిగితేనే మా ఆయన ఆ పొలం ఇవ్వలేదు. రూ2.50 కోట్లకు ఇచ్చారంటే అది పూర్తిగా అబద్ధం. ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే కోట్లు విలువ చేసే భూములను బలవంతంగా లాక్కుంటున్న కందికుంట వెంకట ప్రసాద్‌కు ఓటేస్తే కదిరి ప్రాంతంలో ఉన్న పాలాలన్నీ ఆక్రమించడం ఖాయం. కదిరిలో వ్యాపారస్తులను కూడా బెదిరించి నెలనెలా మామూళ్లు ఇవ్వాలని ఆయన అనుచరులు దందా సాగిస్తున్నారు. కదిరి ప్రజలకు రెండు చేతులు జోడించి నమస్కరించి చెబుతున్నాను. కందికుంటకు ఓటు వేయకండి. అందరికీ మంచి చేసే, కదిరిని అభివృద్ధి చేయాలనే తపన ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ పీవీ సిద్దారెడ్డిని గెలిపించండి’ అని ఆమె నియోజకవర్గ ప్రజలను వేడుకున్నారు. పొలం రాసివ్వకపోతే కొడుకును చంపేస్తామన్నారు! ఆ పొలం మాకు రాసివ్వకపోతే నీ కొడుకును చంపేస్తామని కందికుంట అనుచరులు బెదిరించడంతో చేసేది లేక మేము ఆ పొలం వదుకోకతప్పలేదు. కందికుంటకు భయపడి ఎవ్వరూ మాకు అండగా నిలబడలేదు. మేము కూడా చాలా భయపడ్డాం. కొడుకు ప్రాణాలకన్నా ఆ పొలం ఎక్కువ కాదని కోటిన్నర రూపాయలు తీసుకొని వారు చెప్పినట్లు ఆ పొలాన్ని వదులుకోక తప్పలేదు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు. మాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగక్కూడదన్న ఉద్దేశ్యంతో మీడియా ముందుకు వచ్చి చెప్పక తప్పలేదు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన
అనంతపురం జిల్లా: అధికారం అండ చూసుకుని రాష్ట్రంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ అధికారులపై తమ ప్రతాపం కొనసాగిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా కదిరిలో దళిత వర్గానికి చెందిన తహసీల్దార్‌పై నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కందికుంట వెంకటప్రసాద్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. నోరు తెరిచావో.. చెయ్యి చేసుకోవాల్సి వస్తుందంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మండల మేజిస్ట్రేట్ అని కూడా చూడకుండా తహసీల్దార్‌పై బండబూతులకు దిగారు. ఈ తతంగమంతా సీఐ సమక్షంలోనే కొనసాగడం గమనార్హం. నాపైన డెకాయిట్ కేసుంది.. నీకు తెలీదేమో.. తన వర్గీయులకు ఇళ్ల పట్టాలిచ్చేందుకు జాప్యం చేయడమేగాక ఎమ్మెల్యే చాంద్‌బాషాను కలవమంటున్నారనే ఆగ్రహంతో కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కందికుంట తన వర్గీయులతో కలసి శనివారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కందికుంటతోపాటు ఆయన వర్గీయులు దళిత వర్గానికి చెందిన తహసీల్దార్ పీవీ రమణను నోటికొచ్చినట్లు మాట్లాడారు. ‘‘నువ్వు నా కన్నా తక్కువ చదువుకున్నావు. నిన్ను ఏసీబీకి పట్టించడం నాకు రెండు నిమిషాలు పట్టదు. ఇంటిపట్టాలు ఇవ్వమంటే ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లమంటావా? నాకు అనుకూలంగా ఉన్నాడని ఇక్కడున్న ఓ వీఆర్ఓను బదిలీ చేసి బ్రోకర్‌ను తెచ్చుకుంటావా? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నాపైన డెకాయిట్ కేసు నమోదైంది.. నీకు తెలీదేమో..’’ అంటూ కందికుంట తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తహసీల్దార్ అది కాదు సార్ అనబోగా.. ‘‘ఏందివయ్యా.. మళ్లీ అది కాదంటావు.. ఇంగ నేను బూతులే మాట్లాడతా.. నువ్వు నోరు తెరిచావనుకో.. నేను చెయ్యి చేసుకోవాల్సి ఉంటుంది’’ అని బెదిరింపులకు దిగారు. ‘‘ఇక్కడి రాజకీయాల్ని అనుకూలంగా మార్చుకుని మమ్మల్ని ఇబ్బంది పెడతావా? నా మనుషులొస్తే ఎమ్మెల్యే దగ్గరకు పొమ్మంటావా? వాడెవడు?’’ అని రెచ్చిపోయారు. ఇదే అదనుగా కందికుంట అనుచరుడు హరి మాట్లాడుతూ తాను వీఆర్వో అఖిలేష్‌కు రూ.70 వేలు, మీకు రూ.50 వేలు లంచమిచ్చానని అనగా.. తహసీల్దార్ అబద్ధాలు చెప్పొద్దని బదులిచ్చారు. ఇంతలో మున్సిపల్ చైర్పర్సన్ సురయాభాను అందుకుంటూ.. నీ దగ్గరకొస్తే ఎమ్మెల్యే దగ్గరకు పొమ్మంటావా? నువ్వు ఎమ్మార్వోనా లేక రాజకీయ బ్రోకర్‌వా? అంటూ రెట్టించారు. బలవంతంగా ఆయనతో కందికుంటకు క్షమాపణలు చెప్పించారు. -
టీడీపీలో ఎవరీ కందికుంట?
కదిరి: డీడీల కుంభకోణం కేసులో తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జి కందికుంట వెంకట ప్రసాద్‌కు బుధవారం నాంపల్లి సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.3లక్షల జరిమానా విధించింది. గతంలో హైదరాబాద్ సనత్‌నగర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులోనూ రూ.8.29 కోట్ల విలువ చేసే డీడీల కుంభకోణం కేసులో మే 31, 2016లో ఇదే నాంపల్లి సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.13లక్షల జరిమానా విధించింది. ఎన్నికల సమయంలో ఐపీసీ 420, 302, 307, 324, 375, 471, 147, 148, 149 సెక్షన్ల కింద 9 కేసులు ఉన్నట్లు తన అఫిడవిట్లో కందికుంట స్వయంగా పేర్కొన్నారు. ఇన్ని కేసులుండి, ఆఖరుకు జైలు శిక్ష కూడా పడిన వ్యక్తిని పార్టీలో ఎందుకు కొనసాగిస్తున్నట్లనే విషయం చర్చనీయాంశంగా మారింది. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మరో ఎమ్మెల్సీ దీపక్రెడ్డిలపై కేవలం కేసు నమోదు కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. మరి కందికుంటకు 2+2 గన్మ్యాన్లను ఇచ్చి, ఎందుకు పార్టీలో కొనసాగిస్తున్నట్లు పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చాడీయన? కందికుంట వెంకట ప్రసాద్ స్వస్థలం కదిరి కాదు. ఈయన తండ్రి రఘురామప్ప ఒకానొకప్పుడు పంచాయతీరాజ్ శాఖలో జేఈగా ఉంటూ కదిరికి బదిలీపై వచ్చారు. ఆ సమయంలో వీరు కదిరిలోని కస్తూరిబాయి స్ట్రీట్‌లో వుండేవారు. కందికుంట ఇంటర్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్న సమయంలో ఈయనకు హిందూపురం కూడలిలో సోడాలు అమ్ముకునే సోడా బాలయ్య కుమార్తె యశోదమ్మతో పరిచయయమైంది. ఆ తర్వాత ఇరువురూ ప్రేమ వివాహం చేసుకున్నారు. పరారై.. మళ్లీ దర్శనం ధర్మవరంలో ఉండగా కందికుంటకు దివంగత మంత్రి పరిటాల రవి పరిచయమయ్యాడు. అప్పటి నుంచి ఆ కుటుంబంతో సఖ్యతగా మెలుగుతున్నారు. అప్పట్లో జరిగిన ఓబుళరెడ్డి హత్య కేసులో కందికుంట హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారని తెలిసి బెంగళూరుకు పరారయ్యాడు. అక్కడ ల్యాండ్ సెటిల్మెంటల్లు చేస్తూ బెంగళూరు ప్రసాద్‌గా చెలామణి అవుతూ బాగా డబ్బు సంపాదించినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఎంట్రీ : 2004 ఎన్నికల సమయంలో కందికుంట తిరిగి కదిరి చేరుకున్నారు. అప్పుడు తెలుగుదే«శం పార్టీ తరపున కదిరి ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించారు. అయితే అప్పట్లో పొత్తులో భాగంగా ఈ సీటును చంద్రబాబు నాయుడు బీజేపీకి కేటాయించడంతో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి బరిలోకి దిగారు. దీన్ని జీర్ణించుకోలేని కందికుంట టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే టీడీపీ, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి ఎంఎస్‌ను మూడో స్థానంలోకి పంపి, ఈయన ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారు. అప్పట్లో ఆయనకు టికెట్ రాకపోవడానికి పార్టీ జిల్లా అద్యక్షుడు బీకే పార్థసారిధి కారణమని భావిస్తూ కందికుంట ఆయనపై చెప్పులతో దాడి చేయించి, పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత ఇక్కడ పార్టీకి ఎవ్వరూ దిక్కులేరంటూ ఈయనపై సస్పెన్షన్ ఎత్తివేశారు. మళ్లీ 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి కదిరి ఎమ్మెల్యేగా గెలచారు. అనంతరం 2014 ఎన్నికల్లో సైతం టీడీపీ తరపున బరిలోకి దిగి స్వల్ప ఓట్లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చాంద్‌బాషా చేతిలో ఓటమి చవి చూశారు. ఈయనపై ఇంకా ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మైనార్టీల వక్ఫ్‌బోర్డు.. క్రిష్టియన్ ఆస్తులను కూడా బినామీ పేర్లతో కబ్జా చేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: డీడీల ఫోర్జరీ కేసులో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. కందికుంటతో పాటు మరో ఇద్దరికి జైలుశిక్ష విధించింది సీబీఐ కోర్టు. వివరాలివి.. హుస్సేనీ అలం ఎస్బీఐలో నకిలీ డీడీలతో మోసం చేసినట్లు కందికుంటపై ఆరోపలున్నాయి. ఈ కేసును సీబీఐ కోర్టు విచారణ చేసింది. కందికుంటతోపాటు అసిస్టెంట్ మేనేజర్ నర్సింగరావుకు ఐదేళ్లు శిక్ష, ఇన్స్పెక్టర్ వెంకటమోహన్‌కు మూడేళ్లు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. కందికుంట వెంకట ప్రసాద్ 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కదిరి నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. -
పేదల భూములే కావాలా?
కదిరి : రెవెన్యూ అధికారుల సహకారంతో అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తమ భూముల కబ్జాకు యత్నిస్తున్నాడని, ఆయనకు పేదల భూములే కావాల్సి వచ్చాయా? అని కుటాగుళ్లకు చెందిన కొందరు బాధితులు మండిపడ్డారు. ఆ గ్రామం వద్ద జాతీయ రహదారిపై బుధవారం వారు గంట పాటు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. బాధితులు మాట్లాడుతూ జాతీయ రహదారి పక్కనే సర్వే నంబర్ 403, 404లో ఎన్నో ఏళ్లుగా తమకు భూమి ఉందన్నారు. తహశీల్దార్ నాగరాజు, ఆర్ఐల సహకారంతో కందికుంట ఈ భూమిని కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల మున్సిపల్ చైర్పర్సన్ సురయాభాను భర్త బాబ్జాన్, మరి కొందరు టీడీపీ నాయకులు వచ్చి తమ స్థలంలో ప్రవేశించారని ఆందోళన వ్యక్తం చేశారు. భూమికి సంబంధించి తమ వద్ద పట్టాదారు పాసుపుస్తకాలు కూడా ఉన్నాయన్నారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించినా ఆ భూమి ఎవరి పేరుమీద ఉందో తెలిసిపోతుందన్నారు. కదిరి తహశీల్దార్ కార్యాలయంలో పేదలకు న్యాయం జరగదని, తహసిల్దార్, ఆర్ఐలు ఇద్దరూ మాజీ ఎమ్మెల్యే కందికుంట చెప్పినట్లే నడుచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాస్తారోకోతో వాహనాల రాకపోకలు స్తంబించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీ కత్తుపై విడుదల చేశారు. రాస్తారోకో చేసిన వారిలో నాగరాజు, ఖాదర్‌బాషా, సాయినాథ్ ఇంకా పలువురు మహిళలు ఉన్నారు.