
సాక్షి, హైదరాబాద్: డీడీల ఫోర్జరీ కేసులో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. కందికుంటతో పాటు మరో ఇద్దరికి జైలుశిక్ష విధించింది సీబీఐ కోర్టు. వివరాలివి.. హుస్సేనీ అలం ఎస్‌బీఐలో నకిలీ డీడీలతో మోసం చేసినట్లు కందికుంటపై ఆరోపలున్నాయి. ఈ కేసును సీబీఐ కోర్టు విచారణ చేసింది.
కందికుంటతోపాటు అసిస్టెంట్ మేనేజర్ నర్సింగరావుకు ఐదేళ్లు శిక్ష, ఇన్‌స్పెక్టర్ వెంకటమోహన్‌కు మూడేళ్లు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. కందికుంట వెంకట ప్రసాద్ 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కదిరి నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు.