
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో అక్రమ నిర్మాణాలు, చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశంలో ప్రఖ్యాతిగాంచిన జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో అడవి మధ్యలో టైగర్ సఫారీల ఏర్పాటును సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. వాటి కార్యకలాపాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సఫారీల ఏర్పాటు కోసం అక్రమ నిర్మాణాలు చేపట్టడంతోపాటు అక్కడి భారీ వృక్షాలను నరికివేయడంపై మండిపడింది.
అక్రమ నిర్మాణాలు, చెట్ల నరికివేతకు అనువుగా నిబంధనలను తుంగలో తొక్కిన 2021లో బీజేపీ ప్రభుత్వహయాంలో నాటి ఉత్తరాఖండ్ అటవీ మంత్రి హరక్ సింగ్ రావత్, నాటి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కిషన్ చంద్‌ల పనితీరును తీవ్రంగా ఆక్షేపించింది. ‘‘ ప్రజా విశ్వాసాన్ని బుట్టదాఖలుచేశారు. ఇంతటి విపరీత నిర్ణయాలు కేవలం ఇద్దరే తీసుకున్నారని అనుకోవట్లేము.
ఇందులో చాలా మంది ప్రమేయం ఉండొచ్చు’’ అని జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని పీకే మిశ్రా, జస్టిస్ సందీప్ మెహతాల సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. జాతీయవనంలోని ల్యాన్‌డౌన్ ఫారెస్ట్ డివిజన్‌లో పఖ్రో టైగర్ సఫారీ కోసం వేల చెట్లు నరికేశారంటూ పర్యావరణవేత్త, న్యాయవాది గౌరవ్ భన్సల్ వేసిన పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టు విచారించింది. ‘‘ అధికారి కిషన్‌ను సస్పెండ్ చేయాలని అటవీ కార్యదర్శి చేసిన సిఫార్సును రావత్ పెడచెవిన పెట్టారు. పైగా కిషన్‌ను సమరి్ధంచారు.
రావత్ ఆ పదవి నుంచి దిగిపోయాయే కిషన్ సస్ఫెన్షన్, అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాజకీయనేతలు, ప్రభుత్వ ఉన్నతోద్యోగులు కలిసి చేస్తున్న అక్రమాలకు ప్రబల సాక్ష్యం’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ ఈ ఉదంతంపై సీబీఐ ఇప్పటికే దర్యాప్తు జరుపుతోంది. ఈ ఘటనపై సీబీఐ సమగ్ర నివేదిక మూడు నెలల్లో సమరి్పంచాలి. తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని కోర్టు వ్యాఖ్యానించింది. జిమ్ కార్బైట్ నేషనల్ పార్క్ రాయల్ బెంగాల్ పులులకు ఆవాసం. 1,288.31 చదరపు కి.మీ.లోని ఈ అటవీప్రాంతం పేరు. అత్యంత ఎక్కువ సంఖ్యలో పులులు సంచరించే ప్రాంతంగా ప్రపంచ ప్రసిద్దిగాంచింది.
Comments
Please login to add a commentAdd a comment